అన్వేషించండి

Oorvasivo Rakshasivo Serial Today March 7th: శుభలేఖలో కాలిపోయిన ధీరు ఫొటో, రక్షితలో టెన్షన్.. ధీరు, దుర్గల ఫొటో చూసి రచ్చ చేసిన పవిత్ర!

Oorvasivo Rakshasivo Serial Today Episode దేవుడి దగ్గర దుర్గ, ధీరుల శుభలేక పెట్టి పూజ చేయిస్తుండగా కార్డులోని ధీరు ఫొటో కాలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Oorvasivo Rakshasivo Today Episode విజయేంద్ర పెళ్లి గురించి ఇంట్లో అందరూ అడుగుతారు. విజయేంద్ర ఏం సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతారు. దీంతో పురుషోత్తం సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నాడంటే అర్థం కావడం లేదా ప్రేమలో ఉన్నాడని అంటారు. దీంతో అందరూ ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతారు.

విజయేంద్ర: వైష్ణవి నానమ్మ.. 
పురుషోత్తం: నువ్వు ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదా.. 
విజయేంద్ర: మర్చిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది బాబాయ్. నా లైఫ్‌లో నా భార్య స్థానంలో వైష్ణవి మాత్రమే ఉంటుంది. ఇంకో అమ్మాయిని ఆ స్థానంలో ఊహించుకోలేను. ప్రేమను పంచలేను.
రక్షిత: వవిజయేంద్ర నువ్వు వైష్ణవినే పెళ్లి చేసుకో. తనెక్కడుందో చెప్పు నేను మీ బాబాయ్ వెళ్లి మాట్లాడి ఘనంగా పెళ్లి చేస్తాం. చెప్పు.. తనెక్కడుంది.
విజయేంద్ర: వైష్ణవి ఎక్కడుందో తెలీదు పిన్ని.. 
రక్షిత: విజయేంద్ర వైష్ణవి ఎక్కడుందో తెలీదు ఒకవేళ తనకి పెళ్లి అయిపోయి ఉంటే..
విజయేంద్ర: నాకు నమ్మకం ఉంది పిన్ని. తను నన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోదు.
పురుషోత్తం: ఆ అమ్మాయి టచ్‌లో ఉంటే రెండేళ్‌లు అయినా వెయిట్ చెయొచ్చు విజయేంద్ర. అసలు తను కలుస్తుందో లేదో తెలీక ఇలా ఎన్ని రోజులు ఉంటావ్‌రా. 
జయ: రేయ్ నాన్న బాబాయ్ పిన్ని చెప్తుంద నీ మంచి కోసమేరా.. ఒక్కసారి ఆలోచించు. నువ్వు సరే అంటే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతాను.
విజయేంద్ర: నేను మీ అందరి ప్రేమను అర్థం చేసుకోగలను అమ్మ. మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను ప్రేమించింది వైష్ణవిని పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటా..

ఇక పెళ్లి పనులు రేపటి నుంచి చేయమన్నారు అని ధీరు నానమ్మ చెప్తుంది. దీంతో రక్షిత దయాసాగర్‌కి కాల్ చేసి చెప్పమని ధీరు చెప్తాడు. ధీరు చెప్తాడు. ఇక దయాసాగర్ ఆ విషయాన్ని దుర్గకు చెప్తుంది. దీంతో దుర్గ రేపటి నుంచి వాళ్ల పతనానికి కౌంట్‌ డౌన్ స్టార్ట్ అయిందని అంటుంది. తర్వాత దుర్గ పవిత్రకు జడ వేస్తుంది. దయాసాగర్ పవిత్ర కోసం పాలు తీసుకొని వస్తాడు. దుర్గ ఒప్పించి పవిత్రకు ఒప్పించి పాలు తాగిస్తుంది. మరోవైపు విజయేంద్ర ఇంటికి వస్తాడు. విజయేంద్ర పవిత్రను చూడకూడదు అని తను వచ్చేవరకు మాట్లాడమని దయాసాగర్‌ని పంపిస్తుంది.

దయాసాగర్: ఏంటి విజయేంద్ర ఏమైనా ఇంపార్టంట్‌ విషయమా.. ఇంతకీ నీ వైష్ణవి గురించి వెతకడం ఎంత వరకు వచ్చింది.
విజయేంద్ర: ఆపని మీదే ఉన్నాను సార్. తన గురించి ఎలాంటి సమాచారం లేదు. కనీసం తన చెల్లి పవిత్ర గురించి తెలిసినా వైష్ణవి గురించి తెలిసిపోతుంది. మీకు దుర్గ చెప్పిందో లేదో నాకు తెలీదు సార్.. దుర్గ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దుర్గకు గానీ మీకు గానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా.. మళ్లీ అలా జరిగే అవకాశం ఉంది. ఇంతలో ధీరు అక్కడికి బొకే తీసుకొని వస్తాడు.
ధీరు: ఏంటి హత్యా ప్రయత్నమా.. ఏంటి బ్రో దుర్గ మీద హత్యాయత్నమా.. 
విజయేంద్ర: అవును ధీరు కావాలంటే చూడు అని వీడియో చూపిస్తాడు. 
ధీరు: వాళ్లు ఎవరైనా సరే వదిలిపెట్టను. అసలు దుర్గను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.
దుర్గ: మనసులో.. మీ అమ్మ రక్షిత ధీరు. 
ధీరు: దుర్గా నీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటా కానీ ఈ విషయం అమ్మా వాళ్లకు చెప్పొద్దు కంగారు పడి ఈ పెళ్లి అపేసినా ఆపేస్తారు. దుర్గ రేపు ఫ్రీగా ఉంటావా బయటకు వెళ్దాం. అయినా నువ్వేంటి బ్రో నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ నాకంటే ముందు ప్రత్యక్షం అవుతున్నావు.. 
విజయేంద్ర: ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటే దుర్గ ప్రతీ సారి నిన్ను ఎవరో ఒకరు కాపాడుతారు అని లేదు. నీకు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా దీన్ని అంత ఈజీగా వదలను.
దుర్గ: వద్దు విజయేంద్ర. ఇప్పటికే మీరు లైఫ్‌లో చాలా మిస్ అయ్యారు. ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ చాలు. 
విజయేంద్ర: ఒకసారి ఇలాగే ఉండి తెలీక నా వైష్ణవికి దూరం అయ్యాను. ఇప్పుడు సమస్య తెలిసి నీ లాంటి మంచి వ్యక్తి ప్రాబ్లమ్‌లో ఉంది అంటే ఎలా వదిలేస్తాను. నాకు ఉన్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్‌లో నువ్వు ఒకదానివి నీకు ఏం కానివ్వను. సార్ పెళ్లి పనుల్లో కూడా ఏమైనా సాయం కావాలి అంటే నన్ను పిలవండి నేను చూసుకుంటా..
దుర్గ: నాన్న పెళ్లి అయ్యేంత వరకు పవిత్ర ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు చూసే ప్రమాదం ఉంది. పవిత్రను మన గెస్ట్‌ హౌస్‌కి పంపించాలి.

మరోవైపు రక్షిత ఇంట్లో అందరూ ధీరు పెళ్లి పత్రికను దేవుడి దగ్గర పెట్టి పూజ చేయిస్తారు. ధీరు తన చేతుల్లో పత్రికను దేవుడి దగ్గర పెడతాడు. ఇంతలో దీపం నుంచి వత్తి పడి వెడ్డింగ్‌కార్డు మీద ఉన్న ధీరు ఫొటో కాలిపోతుంది. అందరూ షాక్‌ అయిపోతారు. అపచారం అని బాధపడతారు. ఇక ధీరు తన తల్లిని ఏం కాదు సర్దిచెప్తాడు. 

రక్షిత: దుర్గతో పెళ్లి అయితే నీకు ఏదో ప్రమాదం అని నాకు ఇది హెచ్చిరికలా అనిపిస్తుంది. 
ధీరు: మామ్ నీ ఆలోచన కరెక్ట్ కాదు. 
జయ: రక్షిత కంగారు పడకు అంతా మంచే జరుగుతుంది. 

మరోవైపు దుర్గ వెడ్డింగ్‌కార్డులో ధీరుది తనది ఫొటో చూసి బాధ పడుతుంది. విజయేంద్ర మాటలు తలచుకొని ఏడుస్తుంది. ఇంతలో పవిత్ర బయటకు వచ్చి శుభలేక చూస్తుంది. అందులో ధీరు ఫొటో చూసి వణికిపోయి అక్కా అని గట్టిగా అరుస్తుంది. కార్డు చింపేస్తుంది. దుర్గ, దయాసాగర్ కంట్రోల్ చేసినా తగ్గదు. వాడిని వదిలిపెట్టొద్దు అక్క చంపేయాలి అని కోపంతో రగిలిపోతుంది. ఇక దుర్గ పవిత్రని హగ్‌ చేసుకొని కంట్రోల్ చేస్తుంది. దయాసాగర్ అంబులెన్స్‌కి కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ మార్చి 7th: కావ్యను ఇంటికి తీసుకెళ్లిన రాజ్ - డబ్బుల కోసం స్వప్న మోడలింగ్ ఫోటోషూట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget