అన్వేషించండి
Nuvvunte Naa Jathaga Serial Today September 9th: నువ్వుంటే నా జతగా: విడాకుల పేపర్లు చింపేసిన దేవా.. మెట్టెల వేడుకలో ఏం జరిగింది? హరివర్ధన్ ఆత్మహత్యేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 9th మిథునకు మెట్టెలు పెడితే ఆత్యహత్య చేసుకొని చనిపోతా అని దేవాని హరివర్ధన్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

నువ్వుంటే నా జతగా సీరియల్
Source : https://www.hotstar.com/
Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవాల మెట్టెల కార్యక్రమం ఇరు కుటుంబాల సమక్షంలో జరుగుతున్న మొదటి తంతు కావడంతో సత్యమూర్తి కుటుంబం మొత్తం హడావుడిగా సందడిగా అంగరంగ వైభవంగా గుడిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మిథునని తోడు కోడలు అందంగా రెడీ చేస్తుంది. మిథున దగ్గరకు ఆదిత్య వెళ్లి దేవా నిన్ను మోసం చేస్తున్నాడు. దేవా నిన్ను వదిలేస్తాడు.. ముందే ఫిక్స్ అయిపో.. రాసి పెట్టుకో అని చెప్తాడు. మిథున దేవా అలా చేయడు అని ఎంత చెప్పినా ఆదిత్య దేవా నిన్ను మోసం చేస్తాడు. వదిలేస్తాడు అనే చెప్తాడు. మరోవైపు హరివర్ధన్ కూతురు మిథున జీవితం నుంచి దేవాని తరిమేయాలని గట్టిగానే అనుకుంటాడు. అందుకు విడాకులు ఇవ్వాలని చెప్తాడు. అందుకు దేవాతో మరోసారి మీటింగ్ పెడతాడు.

హరివర్ధన్: మిథున మీ ఇంట్లో ఉంటే నీ కారణంగా తనకు ప్రమాదం ఏర్పడమే కాదు.. ఇలాంటి ఫంక్షన్లు ఏర్పాటు చేస్తారు. మీ బంధం మరింత బలంగా మారిపోతుంది. అందుకే రేపు మెట్టెల ఫంక్షన్‌లో నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టాలి. మిథునతో పెట్టించాలి.
దేవా: ఏంటి సార్ నాకు ఈ శిక్ష మిథునకు దూరం అవ్వలేక నేను ఏడుస్తుంటే నేనే మిథునతో విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించాలా..
హరివర్ధన్: తప్పదు దేవా మిథున ఈ లోకంలో నీ మాట తప్ప ఇంకెవరి మాట వినదు. చివరికి కన్నతండ్రి అయినా నా మాట కూడా వినదు. నా కూతురు ప్రాణాలతో బతకాలి అంటే నువ్వు ఇలా చేయాలి దేవా.. నువ్వు బాధ పడుతుంటే నాకు బాధగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం చూపకపోతే నువ్వు మాట్లాడకుండా ఉంటే నా కూతురు ఇంకా బాధ పడుతుంది. నువ్వే మిథునకు ఎలా గోలా విడాకుల మీద సంతకం పెట్టేలా చేయ్. మీ బంధానికి దేవుడు సాక్షిగా ముగింపు చెప్దాం.

కాంతం గుడిలో రీల్స్ చేసుకుంటూ చీర కాల్చుకుంటుంది. కొంగుకి నిప్పు అంటినా కూడా పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తుంటే రంగం చూసి నిప్పు ఆర్పి పెళ్లాన్ని లాగి పెట్టి కొట్టి.. తిడతాడు. మరోవైపు గుడికి వచ్చిన దేవాని మిథున తీసుకొని ఆదిత్య దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య ఏమన్నావ్ నువ్వు దేవా రాడా.. నాకు మెట్టెలు తొడగడా.. దేవా వచ్చాడు.. ఇప్పుడేమంటావ్.. దేవా మనసులో నేను లేనా.. దేవా మనసులో నేను లేనా.. నన్ను వదిలించుకోవడానికి నాటకాలు ఆడి మోసం చేస్తున్నాడా.. అసలు ఎలా అనగలిగావ్ ఆదిత్య నువ్వు ఆ మాటలు.. దేవా నన్ను మోసం చేస్తున్నాడు అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది ఆదిత్య.. ఇందాక నువ్వు అలా మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు దేవా కోసం అలా అనకూడదు అని నోరుమూయించాలి అనుకున్నా. ఇప్పటి కైనా నీకు అర్థమైందా నా నమ్మకం విలువ. నా నమ్మకానికి బలమేంటో తెలుసా దేవాకి నా మీద ఉన్న ప్రేమ అని మిథున దేవా గురించి చెప్తుంటే దేవా చాలా బాధపడతాడు. దేవా చేయి పట్టుకొని దేవా నన్ను వదిలిపెట్టడు. నాకు దూరం అవ్వాలి అనే ఆలోచన చేయడు అని అంటుంది.

ఎప్పటికీ తన గుప్పెను విప్పదు.. ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు.. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ.. బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా.. అనే బౌగ్రౌండ్ మ్యూజిక్‌కి మిథున వెళ్లిపోతూ దేవాని చూస్తూ ఉంటే దేవా చాలా బాధపడతాడు. సీన్ పీక్స్‌లో ఉంటుంది.


దేవా మామ మాటలు తలచుకొని గుడి దగ్గర ఉన్న కోనేటి దగ్గర ఏడుస్తూ కూర్చొంటే హరివర్ధన్ వస్తారు. విడాకుల పేపర్లు ఇచ్చి సంతకం పెట్టమని చెప్తారు. దేవా ఉసూరు మని ఏడుస్తూ మామ చేయి గొంతుకి పెట్టుకొని చంపేయండి సార్ నన్ను చంపేయండి. పాత కేసులు అన్నీ పెట్టి నన్ను ఉరి తీయండి సార్ అంతే కానీ ఈ మానసిక క్షోభ నేను భరించలేను.. మిథునకు దూరం అయి నేను బతకలేను.. దాని బదులు ఒకే సారి చంపేయండి సార్ అని బతిమాలుతాడు. వెక్కి వెక్కి ఏడుస్తాడు. రెండు చేతులు జోడించి తనని అర్థం చేసుకోమని వేడుకుంటాడు.

హరివర్ధన్ మాత్రం నాకు మాటిచ్చావ్ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని అంటాడు. దేవా ఏడుస్తూ మిథునని నా ప్రాణంగా ప్రేమించాను.. ఒక్కసారి చంపేయండి కానీ ఇలా విడాకులు ఇచ్చి ప్రతీ క్షణం నేను చస్తూ బతికేలా చేయకండి అని విడాకుల పేపర్లు చింపేస్తాడు. నా వల్ల కాదు సార్ మిథున లేకుండా బతకడం నా వల్ల కాదు.. మిథునని దూరం చేసుకొని ప్రాణాలతో ఉండటం నా వల్ల కాదు అని దేవా వెళ్లిపోతాడు. దేవా దేవా అని హరివర్ధన్ పిలుస్తాడు.
మెట్టెల కార్యక్రమం మొదలవుతుంది. పట్టుబట్టలతో దేవా మిథున పీటల మీద కూర్చొంటారు. అందరూ చాలా సంతోషపడతారు. మిథున, దేవా పంతులు చెప్పినట్లు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుంటారు. మిథునకు దేవా తల్లిదండ్రులు, దేవాకి మిథున తల్లిదండ్రులు బట్టలు పెడతారు. అప్పుడే హరివర్ధన్ దేవా చెవిలో చెప్పింది గుర్తుంది కదా అని అంటాడు. దేవా షాక్ అయి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు.


దేవా డివోర్స్ పేపర్లు చింపేసి వెళ్లిపోతుంటే హరివర్ధన్ దేవాతో నువ్వు నా కూతురికి మెట్టెలు తొడిగితే ఇదే కోనేటిలో నా శవం చూస్తావ్ అని అంటాడు. దేవా షాక్ అయి ఆగిపోతాడు. హరివర్ధన్ దేవాతో ఇది నిజం నువ్వు నా కూతురికి మెట్టెలు తొడగటం తట్టుకోలేక ఒక ఆడపిల్ల తండ్రిగా ఇక్కడే నేను నా ప్రాణం తీసుకుంటా.. నువ్వు బలవంతంగా తాళి కట్టావ్.. అది చట్టబద్ధంగా పెళ్లి కాదు.. అనుకోకుండా నా కూతురి మెడలో నల్లపూసలు పడ్డాయి.. అది శాస్త్రబద్ధం కాదు..కానీ ఇప్పుడు నువ్వు మెట్టెలు పెడితే మీ పెళ్లికి పరిపూర్ణత వస్తుంది. నీ బారిలో పడి నా కూతురి చావు చూడటం కంటే ముందే నేను నా ప్రాణాలు తీసుకుంటా. నేను పోతే నా కుటుంబం ఉసురు నీకు తగిలినా పర్లేదు అంటే నా కూతురికి మెట్టెలు తొడుగు అంటాడు. ఆ మాటలు దేవా గుర్తు చేసుకొని ఆలోచిస్తాడు.


పంతులు దేవా చేతికి మెట్టలు ఇచ్చి మిథునకు తొడగమంటాడు. దేవా మెట్టెలు పట్టుకొని బాధ పడుతూ ఉంటాడు. అందరూ మెట్టలు తొడగమని అంటారు. దేవా మాత్రం ఏడుస్తూ వాటికి కింద పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దేవా ఏమైంది దేవా అని మిథున ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇంకా చదవండి





















