Nuvvunte Naa Jathaga Serial Today September 6th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా-మిథున బంధంలో విషాదం: రహస్యాలే కారణమా? అసలు ఏం జరిగింది?
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 6th మిథునని దేవా దూరం పెట్టడం, హరివర్ధన్ మౌనంగా ఉంటడం మిథునకు అర్థం కాక మిథున ఏడుస్తూ ఇద్దరిని ప్రశ్నించడంతో ఈ వారం ఆసక్తికరంగా సాగింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిథునల బంధం అంతా సుఖాంతం అయింది ఇక మిథున దేవా కలిసి ఉంటారు. దేవా జడ్జి గారి అల్లుడు అయిపోయాడు అన్న టైంకి మిథునకు బులెట్ తగలడంతో మొత్తం తలకిందులైపోతుంది. మిథునకు ప్రమాదం జరగడానికి దేవానే కారణం హరివర్ధన్ నమ్మి మిథునకు దూరంగా ఉండమని దేవాని బతిమాలి మాట తీసుకుంటాడు. అప్పటి నుంచి మిథునని దేవా దూరం పెడతాడు. మిథున ఎన్ని సార్లు కాల్ చేసినా దేవా అవాయిడ్ చేస్తాడు. మిథున దేవా తనని పట్టించుకోవడం లేదని చాలా బాధపడుతుంది.
మిథున ఏడుస్తూ ఏంటి దేవా నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది అని అనుకుంటుంది. తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న ఏమైంది దేవా ఎందుకు వెళ్లిపోయాడు. ఏం జరిగింది నాన్న.. నాన్న మీ మౌనం నాకు భయపెడుతుంది అని అంటుంది. నా కోసం నిప్పుల గుండం తొక్కిన వాడు.. నేను కోలుకున్న తర్వాత ఎందుకు నా పక్కన లేడు.. ఏదో జరగకపోతే నేను కోలుకుంటే ఎందుకు నా పక్కన ఉండడు. నాన్న ఏం జరిగింది చెప్పండి అని హరివర్ధన్‌ని అడుగుతుంది.
దేవా మామయ్య మాటలు గుర్తు చేసుకొని చాలా బాధ పడతాడు. దేవా బాధగా ఉండటం చూసి అతని ఫ్రెండ్స్ దేవాతో నువ్వు ఇలా కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదన్న ఏమైంది చెప్పు అని అడుగుతారు. నేనేం బాధ పడటం లేదురా నన్ను ప్రశ్నలతో చంపకండిరా అని వాళ్లని గదిమేస్తాడు దేవా. దేవా మనసులో ఎవడు నన్ను చంపాలి అనుకున్నది ఎవడు.. మిథునని చావు బతుకుల మధ్యకు పంపింది ఎవడు వాడి చావు చూడాలి అనుకుంటాడు.
ఆదిత్య మిథున దగ్గరకు వెళ్లి నువ్వు బతకడం నా అదృష్టం. నీకు బులెట్ తగిలితే నాకు తగిలినట్లు అయింది నీకు ఏమైనా అయితే నేను బతకగలనా మిథున అంటాడు. మిథున షాక్ అయి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావ్ నాకు ఏమైనా అయితే నువ్వు బతకలేకపోవడం ఏంటి అర్థం లేకుండా అని అడుగుతుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఆదిత్య కవర్ చేస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున.. నువ్వు ఇంకా ప్రమాదంలోనే ఉన్నావని.. దేవా రూపంలో ప్రమాదం నిన్ను ఇంకా వెంటాడుతూనే ఉందని అంటాడు. దేవా నాకోసం ప్రాణం ఇస్తాడు. అలాంటి దేవా వల్ల నాకు ప్రమాదం ఏంటి బుద్ధి లేకుండా అని అడుగుతుంది. దానికి ఆదిత్య అందరూ అనుకుంటున్నారని దేవా శత్రువుల వల్లే నీకు ఇదంతా అయిందని అంటాడు. మిథున ఆదిత్యతో దేవా నా పక్కన ఉంటే నాకు ఏం కాదు ఇలాంటి వంద ప్రమాదాలు అయినా క్షేమంగా ఎదుర్కొని తిరిగి వస్తానని అంటుంది. నువ్వు క్షేమంగా ఉండటమే నాకు కావాలి అని ఆదిత్య అంటాడు. ఆదిత్య త్రిపురతో అక్క మిథునతో నా పెళ్లికి పావులు కదుపు.. మిథున జీవితంలో దేవా లేడు.. ఇంక రాడు.. మిథున ఈ ఆదిత్య గాడి భార్య. మామయ్యతో మా పెళ్లి గురించి మాట్లాడు అని అంటాడు.
దేవా ఒంటరిగా ఏడుస్తుంటే సత్యమూర్తి వెళ్లి దేవాతో నాన్న ఏమైంది దేవా.. చీకటి దుఃఖం రెండూ ఒకటేరా.. నువ్వు మోయలేని అంత బాధ పెంచుకోకురా దయచేసి ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతారు. సత్యమూర్తి అలా అడిగే సరికి దేవా నాన్న అని సత్యమూర్తిని పట్టుకొని ఏడుస్తాడు. సత్యమూర్తి కొడుకుతో ఇంత బాధకి కారణం ఏంట్రా అని అడిగితే దేవా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మిథున అత్తారింటికి వెళ్లాలి అని బయల్దేరుతుంది. ఎంత మంది ఆపాలి అని ప్రయత్నించినా నేను వెళ్లాలి అని బయల్దేరుతుంది. నా మంచి కోరుకుంటే నన్ను ఆపొద్దు అని తండ్రికి చెప్తుంది. మిథున వెళ్లిపోవడంతో హరివర్ధన్ ఏడుస్తూ నీకేం అవుతుందో అని భయంతో దేవాని దూరం చేయగలిగాను కానీ నిన్ను ఆపలేకపోయాను. నా భయం మళ్లీ మొదటికి తీసుకొచ్చావ్ కదమ్మా అని ఏడుస్తాడు.
దేవాని తీసుకొని శారద, సత్యమూర్తి మిథున ఇంటికి వచ్చేస్తుంది. మిథునని చూసి అందరూ సంతోషంగా ఫీలవుతారు. దేవా కూడా సంతోషంగా ఉంటారు కానీ పైకి చూపించడు. దేవా మిథునని చూసి వెళ్లిపోయి ఓ మూలకు వెళ్లి ఏడుస్తాడు. దేవా తనని అవాయిడ్ చేయడం చూసి మిథున కంగారు పడుతుంది. శారద వాళ్లు మిథునకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు. రెండు సార్లు ప్రమాదం దాటుకొని వచ్చావ్ ఇక మీ బంధానికి ఏ అడ్డు ఉండదమ్మా.. నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి ఉంటారని శారద అంటుంది. ఆ మాటలు విన్న దేవా మనసులో నాకు ఆ అదృష్టం లేదమ్మా మా బంధం తెగిపోయింది అని ఏడుస్తాడు. మిథున తన వైపు రావడం చూసిన దేవా మిథునకు కనిపించకుండా దాక్కుంటాడు.
హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమకు చాలా పవర్ ఉంది. దేవా నాకు ఇచ్చిన మాట మీద ఉంటాడా..లేదంటే తన మనసులో ప్రేమను చెప్పేస్తాడా అనుకుంటాడు. దేవా మిథునని తలచుకొని నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు మిథున.. ఈ బాధ భరించడం నా వల్ల కాదు.. నీకు దూరం అవ్వడం అంటే నా ప్రాణాలు పోవడమే అని అనుకుంటూ ఏడుస్తాడు. ఇక హరివర్ధన్ దేవా తనకి ఇచ్చిన మాట తప్పడు అని అనుకుంటాడు.
దేవా ఒంటరిగా బాధ పడుతూ ఉంటే మిథున వచ్చి వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. దేవా రాయిలా నిల్చొండిపోతాడు. మిథున దేవాతో నీ ప్రేమే నన్ను బతికించింది దేవా.. నేను బతకాలి అని నిప్పుల మీద నడిచావ్ మరి నీకు నా మీద అంత ప్రేమ ఉంటే నన్ను నీకు ఆ దేవుడు దూరం చేస్తాడా చెప్పు.. ఇది మన కొత్త ఆరంభం అని మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించేశారు అని సంతోషంగా చెప్తుంది. మిథున దేవాతో ఏమైంది దేవా నా కోసం నువ్వు మా ఇంటికి రాకపోతే బిజీగా ఉన్నావ్ అనుకున్నా.. కానీ నేను మీ ఇంటికి వచ్చినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు.. ఏమైంది దేవా.. రెండు రోజుల క్రితం నేను చూసిన దేవా వేరు ఇప్పుడు ఈ దేవా వేరు.. నువ్వు ఇలా ఉండవు.. ఏమైంది దేవా ఎందుకు ఇలా ఉన్నావ్.. దేవా సమాధానం చెప్పు మాట్లాడు దేవా ఎందుకు నాతో మాట్లాడటం లేదు.. ఎందుకు నన్ను దూరం చేస్తున్నావ్ అని ప్రాధేయపడుతుంది.
దేవా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిథునని కాల్చిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు. పోలీసులు దేవాతో చంపాలని ప్లాన్ చేసింది నిన్ను కానీ నిన్ను కాల్చబోతే అది మిథునకు తగిలిందని అంటారు. దేవా ఆయనతో నాకు శత్రువులు ఉన్నారు కానీ జడ్జి ఇంటికి వచ్చి కాల్చే అంత ఎవరికీ లేదు.. వాడి వెనక ఉంది ఎవరో పెద్ద వ్యక్తి ఆ షూటర్ డిటైల్స్ ఇవ్వండి అంటారు. పోలీసులు ఇచ్చిన డిటైల్స్‌తో దేవా ఆ షూటర్ని పట్టుకుంటాడు. అతన్ని ప్రశ్నిస్తాడు. కరెక్ట్‌గా షూటర్ ఆదిత్య పేరు చెప్పేటైంకి ఆదిత్య అతన్ని కాల్చేస్తాడు. దేవా ఆదిత్య మీద కోప్పడతాడు. తర్వాత ఆదిత్యకి ఈ విషయం ఎలా తెలిసిందని అనుకుంటాడు.
మిథున దేవా కోసం ఎదురు చూసి చూసి పడుకుండి పోతుంది. దేవా అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్న మిథుని చూసి తల నిమరాలి అని ప్రయత్నించి మామ మాటలు గుర్తొచ్చి వెనక్కి వెళ్లిపోతాడు. మిథునని దూరం నుంచి చూసి ఏడుస్తాడు. నీ ప్రేమ లేకుండా బతకలేనంత ప్రేమించేలా చేశావ్.. నీ చేతిలో చేయి వేసి అందరి ముందు నీ తోడు లేకుండా బతకలేను అన్నంత ప్రేమ వచ్చేలా చేశావ్ ఎలా బతకాలో అర్థం కావడం లేదు మిథున అని ఏడుస్తాడు. మిథునకు దుప్పటి కప్పేసి వెళ్లిపోతుంటే మిథున దేవా చేయి పట్టుకుంటుంది. మిథున కూడా నిద్ర లేస్తుంది. మనసులో ఎవరికీ చెప్పుకోలేని అంత బాధ ఉంటేనే కన్నీరు వస్తాయి. నీ మనసులో కూడా అలాంటి బాధ ఉందని నాకు అర్థమైంది చెప్పు దేవా ఆ బాధ ఏంటి.. ఏం జరగకపోతే ఏదో పెద్ద విషయం జరగకపోతే నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉండవు.. ఏం జరిగిందో నాకు తెలియకపోతే ఎలా అని ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది.
శారద, ప్రమోదిని పంతుల్ని కలిస్తే మెట్టెల ఫంక్షన్ చేయించమని పంతులు చెప్తారు. రెండు కుటుంబాల సమక్షంలో జరుగుతుందని మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దేవాకి మిథున ఈ తంతు గురించి చెప్తే దేవా వద్దు అనేస్తాడు. లలిత హరివర్ధన్‌కి చెప్తే ఆయన వద్దు అనేస్తారు. దాంతో మిథునకు అనుమానం వస్తుంది. భర్తకి తండ్రికి మధ్య ఏదో జరిగిందని తండ్రిని ప్రశ్నిస్తుంది. మీకు దేవాకి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరగలేదు అని హరివర్ధన్ అంటాడు. మీరు చెప్పినట్లు ఏం జరగకపోతే దేవా నాకు దూరంగా ఎందుకు ఉంటాడు. మీరు మీ కూతురి మెట్టెల ఫంక్షన్ అని సందడిగా ఉండేవాళ్లు కానీ మీరు, దేవా ఇద్దరూ ఫంక్షన్ వద్దు అన్నారు. మీకు దేవాకి మధ్య ఏదో జరిగింది అని అర్థమవుతుంది చెప్పండి నాన్న ఏం జరిగింది అని అడుగుతుంది. హరివర్ధన్ మౌనంగా ఉంటాడు. ఈ మూడు ముళ్ల బంధం కోసం నేను ఓ యుద్ధమే చేశాను.. ఏం జరిగిందో చెప్పండి నాన్న.. ఇక్కడ మీ కళ్లలో నీరు అక్కడ దేవా కళ్లలో నీరు మీ ఇద్దరూ ఒకేలాంటి బాధ అనుభవిస్తున్నారు ఏంటో చెప్పండి నాన్న అని బతిమాలుతుంది. ఏం జరగలేదు అని హరివర్ధన్ అంటే అయితే రేపు మెట్టెలు తీసుకొని రండి ఫంక్షన్ జరిపించండి అని అంటుంది. ఏం జరగలేదు అని మీరు నిరూపించుకోవాలి అంటే మీరు కచ్చితంగా రావాల్సిందే అని అంటుంది. ఇవీ ఈ వారం హైలెట్స్.





















