Nuvvunte Naa Jathaga Serial Today September 5th: నువ్వుంటే నా జతగా సీరియల్: తండ్రిని నిలదీసిన మిథున! మెట్టెల ఫంక్షన్ ఆగిపోవడానికి కారణమేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 5th దేవా, హరివర్ధన్ ఇద్దరూ మెట్టెల ఫంక్షన్ వద్దని చెప్పడంతో మిథునకు అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా షూటర్‌ని వెంట పడి వెంటపడి పట్టుకుంటే షూటర్ నిజం చెప్పే టైంకి ఆదిత్య షూట్ చేసేస్తాడు. దేవా ఆదిత్య మీద కోప్పడతాడు. వీడి వెనక ఇంకెవడో ఉన్నాడు వాడి పేరు చెప్పేలోపు కాల్చేశావ్ అంటే మిథునని చంపింది వీడు అని తెలియగానే ఆవేశంతో కాల్చేశా సారీ భయ్యా అని ఆదిత్య అంటాడు.
ఆదిత్య వెళ్లిపోతాడు. నన్ను షూట్ చేయడానికి వచ్చింది వీడే అని ఆదిత్యకు ఎలా తెలుసు.. నేను వీడిని పట్టుకున్నానని ఆదిత్యకు ఎలా తెలుసు అని దేవా అనుకుంటాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా దేవా జరిగింది మొత్తం తలచుకొని ఆలోచిస్తాడు. ఆ కిల్లర్ వెనక ఉన్నది ఎవడు.. వాడిని కనిపెట్టడం ఎలా అని దేవా అనుకుంటాడు. హరివర్ధన్ గారికి నేను మిథునకు దూరం అయిపోతా అని మాటిచ్చాను.. మిథునకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది మరి నేను ప్రతీ క్షణం మిథున పక్కన ఉండి ఎలా కాపాడుకోవాలి అనుకుంటాడు.
మిథున దేవా దగ్గరకు వెళ్లి దేవాని పట్టుకుంటే దేవా విడిపించుకొని పక్కకు వెళ్తాడు. మిథున దేవాతో నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ దేవా.. అని మెట్టెల ఫంక్షన్ గురించి చెప్తుంది. మన రెండు ఫ్యామిలీల సమక్షంలో జరుగుతుందని మంచి మెమూరీ అవుతుందని అంటుంది. దేవా ఈ మెట్టల ఫంక్షన్ వద్దని దేవా వెళ్లిపోతాడు. దేవా సడెన్‌గా ఇలా మారిపోయాడేంటి అని మిథున ఆలోచిస్తుంది.
లలిత హరివర్ధన్ దగ్గరకు వచ్చి మిథునకు మెట్టెల తంతు ఏర్పాటు చేశారని వదిన ఫోన్ చేశారని పుట్టింటి తరుఫున మనం మెట్టెలు తీసుకెళ్లాలని సందడిగా చెప్తుంది. హరివర్ధన్ కూడా మెట్టెల ఫంక్షన్ వద్దు అనేస్తాడు. లలిత షాక్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ జరిపించాల్సిన అవసరం లేదు అని అంటాడు. లలిత ఎంత చెప్పినా హరివర్ధన్ వినడు వద్దు అంటే వద్దు అని అనేస్తాడు.
లలిత ప్రమోదినికి కాల్ చేసి చెప్పడంతో ప్రమోదిని మిథునతో మీ నాన్న గారు ఈ ఫంక్షన్ వద్దు అనేశారని బాధ పడొద్దని చెప్తుంది. మిథున ఆలోచనలో పడుతుంది. ఇక్కడ దేవా ఫంక్షన్ వద్దు అన్నాడు.. అక్కడ నాన్న వద్దు అన్నారు ఏమైందా అని ఆలోచిస్తుంది. మరోవైపు కాంతం ఫంక్షన్ ఆగిపోయినందుకు బావి పైకి ఎక్కి చిందులేస్తుంది. కిందకి దిగమని రంగం చెప్తే పడిపోయినా పర్లేదు అని గెంతులేస్తుంది. ఏమైంది అని రంగం అడిగితే దేవా, మిథున విడిపోయారని చెప్తుంది. నువ్వేందుకు అంత సంతోషంగా ఉన్నావ్ అని రంగం అడిగితే తోడికోడలు మన కంటే ఉన్నదాయి అయితే తట్టుకోవడం చాలా కష్టం అని అంటుంది.
మిథున హరివర్ధన్ దగ్గరకు వెళ్తుంది. మీకు దేవాకి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరగలేదు అని హరివర్ధన్ అంటాడు. మీరు చెప్పినట్లు ఏం జరగకపోతే దేవా నాకు దూరంగా ఎందుకు ఉంటాడు. మీరు మీ కూతురి మెట్టెల ఫంక్షన్ అని సందడిగా ఉండేవాళ్లు కానీ మీరు, దేవా ఇద్దరూ ఫంక్షన్ వద్దు అన్నారు. మీకు దేవాకి మధ్య ఏదో జరిగింది అని అర్థమవుతుంది చెప్పండి నాన్న ఏం జరిగింది అని అడుగుతుంది. హరివర్ధన్ మౌనంగా ఉంటాడు. ఈ మూడు ముళ్ల బంధం కోసం నేను ఓ యుద్ధమే చేశాను.. ఏం జరిగిందో చెప్పండి నాన్న.. ఇక్కడ మీ కళ్లలో నీరు అక్కడ దేవా కళ్లలో నీరు మీ ఇద్దరూ ఒకేలాంటి బాధ అనుభవిస్తున్నారు ఏంటో చెప్పండి నాన్న అని బతిమాలుతుంది. ఏం జరగలేదు అని హరివర్ధన్ అంటే అయితే రేపు మెట్టెలు తీసుకొని రండి ఫంక్షన్ జరిపించండి అని అంటుంది. ఏం జరగలేదు అని మీరు నిరూపించుకోవాలి అంటే మీరు కచ్చితంగా రావాల్సిందే అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















