అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today September 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని దూరం పెడుతూ నలిగిపోతున్న దేవా.. అసలు కారణం మిథునకు తెలిస్తే?

Nuvvunte Naa Jathaga Serial Today Episode September 3rd మిథున దూరం పెడుతున్నందుకు దేవా తనలో తాను కుమిలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా కోసం అత్తింటికి వచ్చేస్తుంది. దేవాని పట్టుకొని మన బంధానికి పట్టిన అన్ని గ్రహణాలు పోయాయి.. ఇక మనకు సంతోషాలు తప్ప అవరోధాలు ఉండవు అని అంటుంది. దేవా ఏం మాట్లాడకుండా దూరంగా వెళ్లిపోతాడు. 

మిథున దేవా దేవా ఏమైంది దేవా నా కోసం నువ్వు మా ఇంటికి రాకపోతే బిజీగా ఉన్నావ్ అనుకున్నా.. కానీ నేను మీ ఇంటికి వచ్చినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు.. ఏమైంది దేవా.. రెండు రోజుల క్రితం నేను చూసిన దేవా వేరు ఇప్పుడు ఈ దేవా వేరు.. నువ్వు ఇలా ఉండవు.. ఏమైంది దేవా ఎందుకు ఇలా ఉన్నావ్.. దేవా సమాధానం చెప్పు మాట్లాడు దేవా ఎందుకు నాతో మాట్లాడటం లేదు.. ఎందుకు నన్ను దూరం చేస్తున్నావ్  అని ప్రాధేయపడుతుంది.
Nuvvunte Naa Jathaga Serial Today September 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని దూరం పెడుతూ నలిగిపోతున్న దేవా.. అసలు కారణం మిథునకు తెలిస్తే?

మిథున చాలా ప్రాధేయపడుతుంది. నీ మౌనం నాకు భయం వేసేలా చేస్తుంది. ఏమైంది చెప్పు దేవా అని మిథున అడిగితే దేవా వెళ్లిపోతాడు. బయటకు వెళ్లి ఏం చెప్పను మిథున ఈ బాధని నువ్వు జీవితాంతం భరించాలి అని చెప్పనా ఏం చెప్పను అని ఏడుస్తాడు. మిథున ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

దేవా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి మిథునని కాల్చిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు. పోలీసులు దేవాతో చంపాలని ప్లాన్ చేసింది నిన్ను కానీ నిన్ను కాల్చబోతే అది మిథునకు తగిలిందని అంటారు. దేవా ఆయనతో నాకు శత్రువులు ఉన్నారు కానీ జడ్జి ఇంటికి వచ్చి కాల్చే అంత ఎవరికీ లేదు.. వాడి వెనక ఉంది ఎవరో పెద్ద వ్యక్తి ఆ షూటర్ డిటైల్స్ ఇవ్వండి అంటారు. పోలీస్ అతను దేవాతో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గ్యాంగ్‌కి సంబంధించిన వాడు అని డిటైల్స్ ఇస్తాడు. వాళ్లని పట్టుకోవడం కష్టం అని పోలీస్ అంటే ఓ రౌడీగా నాకు చాలా గ్యాంగ్‌లు తెలుసని నేను కనుక్కుంటా అని దేవా అంటాడు.
Nuvvunte Naa Jathaga Serial Today September 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని దూరం పెడుతూ నలిగిపోతున్న దేవా.. అసలు కారణం మిథునకు తెలిస్తే?

మిథున దగ్గరకు అత్త తోటికోడలు జ్యూస్ తీసుకెళ్లి ఇస్తారు. ప్రమోదిని మిథునతో డబ్బున్న వాళ్లు ఎవరినీ పట్టించుకోరు అని అనుకుంటారు కానీ నువ్వు మాత్రం మమల్ని చాలా బాగా చూసుకున్నావ్ అని అంటుంది. ఇక శారద అయితే దేవా మీ మామయ్యకి ముద్దుల కొడుకు చిన్నప్పుడు ఎంత వాడిని ప్రేమించారో రౌడీగా మారిన తర్వాత అంత ద్వేషించావు. కానీ నువ్వు దేవాని కడిగిన ముత్యంలా మార్చావమ్మా.. నువ్వు వాడిని ఎంతలా మార్చావో తెలుసా.. ఒకప్పుడు వాడి బతుకు ఒంటరిగా ముగిసిపోవాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే వాడి జీవితానికి అర్థమై లేదనే పరిస్థితికి వచ్చేశాడు. ఇక నుంచి మీ జీవితాలు సంతోషంగా ఉంటాయని శారద అంటుంది. 


Nuvvunte Naa Jathaga Serial Today September 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని దూరం పెడుతూ నలిగిపోతున్న దేవా.. అసలు కారణం మిథునకు తెలిస్తే?

కాంతం అందరితో దేవా మిథునని పట్టించుకోవడం లేదు.. దూరం పెడుతున్నాడు.. మరి వీళ్ల కాపురం వెలిగిపోయేది ఏంటి నా బొంద అని కాంతం అంటుంది. చిన్న కోడల్ని శారద తిడుతుంది. మిథున మనసులో నిజమే కదా అనుకుంటుంది. 

దేవా మందు తాగుతూ చాలా బాధ పడతాడు. నేను మాట్లాడటం లేదు అని నువ్వు ఎంత బాధ పడుతున్నావో నీతో మాట్లాడకుండా ఉండాల్సినందుకు నేను అంతే బాధ పడ్డాను అని అనుకుంటాడు. నరకాన్ని చూస్తున్నా మిథున అని ఏడుస్తాడు. త్వరగా ఇంటికి వచ్చి నిన్ను చక్కగా చూసుకోవాలి అని ఉంది కానీ నీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అని అనుకుంటాడు. దేవా దగ్గరకు అతని ఫ్రెండ్స్ వచ్చి వదిన ఎదురు చూస్తుంటుంది వెళ్లు మచ్చా.. అని అంటారు. ఏం జరిగిందో చెప్పమని దేవాని అడుగుతారు. దేవా కోపంగా వాళ్ల మీద అరిచి వెళ్లమని చెప్తాడు. 


Nuvvunte Naa Jathaga Serial Today September 3rd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని దూరం పెడుతూ నలిగిపోతున్న దేవా.. అసలు కారణం మిథునకు తెలిస్తే?

మిథున దేవా కోసం ఎదురు చూసి చూసి పడుకుండి పోతుంది. దేవా అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్న మిథుని చూసి తల నిమరాలి అని ప్రయత్నించి మామ మాటలు గుర్తొచ్చి వెనక్కి వెళ్లిపోతాడు. మిథునని దూరం నుంచి చూసి ఏడుస్తాడు. నీ ప్రేమ లేకుండా బతకలేనంత ప్రేమించేలా చేశావ్.. నీ చేతిలో చేయి వేసి అందరి ముందు నీ తోడు లేకుండా బతకలేను అన్నంత ప్రేమ వచ్చేలా చేశావ్ ఎలా బతకాలో అర్థం కావడం లేదు మిథున అని ఏడుస్తాడు. మిథునకు దుప్పటి కప్పేసి వెళ్లిపోతుంటే మిథున దేవా చేయి పట్టుకుంటుంది. మిథున కూడా నిద్ర లేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget