(Source: Poll of Polls)
Nuvvunte Naa Jathaga Serial Today September 26th: నువ్వుంటే నా జతగా: మేడ మీద దేవా మిథునల రొమాన్స్! మిథునకు ఆదిత్య మీద అనుమానం వచ్చిందా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 26th మిథున దేవాని రెచ్చగొట్టి తనతో రొమాంటిగ్‌గా ఉండేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాతో మనల్ని ఎవరో విడదీయాలని ప్రయత్నిస్తున్నారు అని అంటే ఇంకెవరు మీ నా..అని దేవా ఆపేస్తాడు. దేవా కంగారు పడి వెళ్లిపోతుంటే మిథున ఆపి మనల్ని విడదీయాలని అంత బలంగా ప్రయత్నిస్తున్నా వ్యక్తి ఎవరు అని దేవాని ప్రశ్నిస్తుంది. దేవా మనసులో మీ నాన్నని గురించి తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అనుకుంటాడు.
దేవా నిజం చెప్పు అని మిథున అడిగితే నువ్వు అంటేనే నాకు ఇష్టం లేదు.. నేను నిన్ను భార్యగా అంగీకరించలేదు.. మరి మనల్ని ఎవరు విడదీస్తారు వెళ్లిపో నువ్వు అని దేవా మిథున మీద కోప్పడతాడు. మిథున కూలబడి ఇప్పటి వరకు మనల్ని ఎవరో విడదీయాలి అనుకున్నారు అని అనుమానం ఉండేది.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటుంది. మరోవైపు కాంతం రంగానికి ముసుగు వేసి పచ్చడి చేసి కొడుతుంది. ఓసేయ్ నీ దుంప తెగ అలా కొట్టావేంటి అని అడుగుతాడు. ఏం చేశావో గుర్తొచ్చే వరకు కొడతా అని అంటుంది. రంగం గుర్తు చేసుకొని ఆ రోజు దేవా విషయంలో నిన్ను కొట్టానని ఇప్పుడు నన్ను కొడుతున్నావా అని అడుగుతాడు. అవును అని కాంతం చెప్తుంది.
దేవా మేడ మీద పడుకొని చందమామ చూస్తూ ఉంటే మిథున చాప, దిండు పట్టుకొని వస్తుంది. నన్ను చూడకుండా శూన్యంలోకి చూస్తావేంటి బాబు అని మిథున అంటే సోది ఆపి పడుకో అని దేవా అంటాడు. నువ్వు పెద్దగా గురక పెడుతున్నావ్ సౌండ్ తగ్గించు అని మిథున అంటే నిన్ను ఇక్కడ ఎవడు పడుకోమన్నాడు అని అంటే భర్త ఎక్కడ పడుకుంటే భార్య అక్కడే పడుకోవాలి అని మిథున అంటే.. నువ్వు ఎన్ని వేషాలు వేసినా మన మధ్య ఏం జరగదు అని దేవా అంటాడు.
మిథున పెద్దగా నవ్వుతూ మన మధ్య ఏం జరగదు అని నాకు ఎప్పుడో తెలుసు.. ఎందుకంటే ఆ విషయంలో నువ్వు కొంచెం వీక్ అని దేవాని రెచ్చ గొడుతుంది. దేవాకి చిర్రెత్తుకొచ్చి ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు. ఎందుకు నీకు అంత కోపం వస్తుంది. అయినా నువ్వు నేత్ర విషయంలో ఏం తప్పు చేయలేదు అని నమ్మానో తెలుసా.. నీకు అలాంటివి చేతకాదు అని రెచ్చగొడుతుంది. మన ఫస్ట్ నైట్ రోజు కూడా ఏం చేయలేకపోయి భయపడ్డావ్ అందుకే నేత్ర విషయంలో ఏదో చేశావ్ అంటే ఎలా నమ్ముతాను అంటుంది. ఏయ్ ఎక్కువ మాట్లాడకు అని అంటాడు. యుద్ధం చేయలేని వాడి నడుం చుట్టూ చాలా కత్తులు అన్నట్లు నువ్వేం చేయలేవులే అని దేవాని బాగా రెచ్చగొడుతుంది మిథున. దాంతో దేవా మిథున వెంట పడతాడు. మిథునని పట్టుకొని ముక్కూ ముక్కూ టచ్ అవ్వడంతో ఒకర్ని ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు. దేవా మిథున చేతులు వదిలేయడంతో మిథున మెల్లగా పక్కకి వెళ్లిపోతుంది. ఇద్దరూ రొమాంటిక్‌గా నవ్వుకుంటారు.
సత్యమూర్తి కొడుకు గురించి ఆలోచిస్తూ బాధగా ఉంటే శారద వెళ్లి ఏమైందని అడుగుతుంది. దేవా ఎక్కడ దేవతలాంటి భార్యని దూరం చేసుకుంటాడో అని భయంగా ఉందని అంటాడు. మిథున అలా ఎప్పటికీ జరగనివ్వదు అని శారద అంటుంది. దేవా ప్రవర్తన చూస్తుంటే భయంగా ఉందని అంటాడు. దేవా జీవితం ఏమైపోతుందో ఇక మనకు కన్నీరు తప్పవేమో శారద అని సత్యమూర్తి బాధ పడతాడు. మిథున తన భర్తలో మార్పు తీసుకొస్తుంది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని శారద అంటుంది.
ఉదయం మిథున వంట చేస్తూ దేవా చెప్పబోయిన వ్యక్తి ఎవరు.. దేవా నా మీద ప్రేమని చంపుకోవడం వెనక ఎవరు ఉన్నారు.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం ఎలా అని అనుకుంటుంది. ప్రమోదిని రావడంతో ఇదే విషయం చెప్పి ఆలోచిస్తుంది. నాకు అనుమానంగా ఉంది మిథున అని ప్రమోదిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















