Nuvvunte Naa Jathaga Serial Today September 25th: నువ్వుంటే నా జతగా: మిథున చేయి వదలొద్దని కొడుకుని బతిమాలిన సత్యమూర్తి! మిథునతో నిజం చెప్పేసిన దేవా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 25th మిథునని భార్యగా స్వీకరించమని మిథున చేయి వదలొద్దని సత్యమూర్తి కొడుకుతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటూ మిథున చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తుంది. తప్పు చేసిన వాళ్లు భయపడాలి. వీళ్లంతా నీ వాళ్లు నీ గురించి తెలిసిన వాళ్లు మిమల్ని గుండెల్లో పెట్టుకుంటారు కానీ అవమానించేలా చూడరు రండి అని తీసుకెళ్తుంది.
ప్రమోదిని దేవాతో ఏ భర్తకైనా అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం కానీ నీకు అర్థం చేసుకోవడంతో పాటు యుద్ధం చేసే భార్య దొరికింది. నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అని అంటుంది. ప్రమోదిని చెప్పింది నిజంరా.. నీ మూర్ఖత్వంతో ఈ అదృష్టం దూరం చేసుకోకురా ఈ చేయి ఎప్పటికీ విడిచి పెట్టకురా అని శారద అంటే దేవా మామ మాటలు గుర్తు చేసుకొని మిథున చేయి విడిపించుకుంటాడు.
దేవా మిథున చేయి విడిపించుకోవడం చూసిన సత్యమూర్తి దేవా అని అరిచి లాగిపెట్టి కొడతాడు. అర్థమవుతుందా నీకు ఏం చేస్తున్నావో ఏం కోల్పోతున్నావో.. మేం అంతా నిన్ను బయటకు తేలేక ఏడుస్తుంటే తను మాత్రం పిచ్చిదానిలా రోడ్ల మీద తిరిగిందిరా.. తనే లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు జైలు పాలయ్యావురా.. భార్య అంటే ధైర్యంరా అలాంటి ధైర్యాన్ని అంత గొప్ప అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకుంటావ్ ఏంట్రా అని సత్యమూర్తి బాధ పడతాడు. శారద కూడా ఏడుస్తూ తను నీ జీవితాన్ని నిలబెట్టడమే కాదురా మాకు కడుపు కోత లేకుండా చేసింది అంత మంచి భార్యని నీ చేతులారా పొగొట్టుకోకురా అని ఏడుస్తారు.
కన్న బిడ్డలు అయిన మీరు ఏ రోజు ఇంటి పరువు కోసం ఆలోచించలేదురా.. కానీ పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఆలోచించిందిరా.. తను నీ మీద పడిన నింద నిరూపించకుండా మనం వీధిలోకి కూడా వెళ్లే వాళ్లం కాదురా.. "ఎవరితో కలిసి బతకాలో చెప్పేది కాదురా జీవితం అంటే ఎవరు లేకుండా బతకలేమో చెప్పేదేరా జీవితం అంటే" అని సత్యమూర్తి దేవాతో చెప్తాడు. దేవా చాలా బాధపడతాడు కానీ విషయం ఎవరికీ చెప్పడు ఏం మాట్లాడడు కూడా. మిథున లేకపోతే నీ జీవితానికి అర్థం లేదురా అసలు జీవితమే లేదురా అని దేవా, మిథునల చేతులు కలుపుతారు. జీవిత కాలం బాధ పడే పరిస్థితి తెచ్చుకోవద్దురా.. పట్టుకోరా తన చేతిని పట్టుకోరా.. నీ భార్యని ఇంట్లోకి తీసుకెళ్లరా అని ఏడుస్తూ చెప్తాడు.
దేవా మిథున చేయి పట్టుకోకపోవడంతో రేయ్ దెయ్యం పట్టిందా నీకు ఎందుకు ఇలా చేస్తున్నావ్. ఇంత మంచి అమ్మాయిని భార్యగా అంగీకరించడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంట్రా చెప్పరా చెప్పు అని తండ్రి ఏడుస్తున్నా దేవా నోరు మెదపడు. మిథున చేయి వదిలేసి వెళ్లిపోతాడు. నా ఖర్మ అని సత్యమూర్తి ఏడుస్తూ వెళ్లిపోతాడు.
హరివర్ధన్, రాహుల్ అందరూ పరువు పోయిందని బాధ పడుతుంటే అలంకృత సంతోషంగా వచ్చి బావ తప్పు చేయలేదు అని డీజీపీ గారే చెప్పి ప్రెస్ మీట్ పెట్టారని వీడియో చూపిస్తుంది. అది గర్వించాల్సిన విషయం కాదు.. అసలు ఆ దేవా తప్పు చేస్తే వాడిని విడిపించడానికే మా నాన్న దాన్ని పెంచి పెద్ద చేసినట్లు ఉందని అంటాడు. ఆ దేవాది ప్రేమ అయితే మరి మాదేంటి అమ్మ అని రాహుల్ తల్లిని ప్రశ్నిస్తాడు. హరివర్ధన్ మనసులో మిథున ఈ దెబ్బతో నా ఇంటికి వచ్చేస్తుందని అనుకుంటే తనే వెళ్లి విడిపించుకుంది.. నా కూతుర్ని నా దగ్గరకు తెచ్చుకునేది ఎలా మిథున ఇంకా దేవాకి దగ్గరైపోతుందని అనుకుంటాడు.
దేవా రాత్రి ఆరుబయట కూర్చొంటే మిథున వచ్చి ఆకలి వేయడం లేదా.. నీకు రెండు ఆప్షన్లు ఉన్నాయ్ ఒకటి రాముడు మంచి బాలుడిలా వచ్చి తినేయడం రెండు నేను లాగిపెట్టి రెండు ఇచ్చి తినిపించడం.. దయచేసి నన్ను మంచి భార్యగా ఉండనివ్వు అని అంటుంది. దేవా వద్దని అంటే మిథున ఫుడ్ తీసుకొని వచ్చి చేతిలో ప్లేట్ పెట్టి తిను మొగుడ్స్ అని బెదిరిస్తుంది. దేవా తప్పించుకోలేక తింటుంటే మిథున దేవాని చూసి మురిసిపోతుంది. సిగ్గు పడిపోతుంది. దేవా మనసులో ఈ ప్రేమ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.. నా మనసులో నీ ప్రేమ దాచుకోవడం అస్సలు కావడం లేదు.. నీ ప్రేమని దూరం చేసుకోవాలి అంటే ప్రాణం లేకుండా బతకడమే అంతా నా తలరాత తప్పదు ఏం చేయాలి అని దేవా అనుకుంటాడు.
దేవా పైకి మాత్రం మిథున ఎందుకు ఇలాగే ఇక్కడ ఉంటావ్ వెళ్లిపో అని చెప్తాడు. నీ కళ్లలో ప్రేమ కనిపిస్తుంది దేవా.. నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది.. మరి నీ మనసులో ఏం ఉందో నాకు ఈ తాళి చెప్పదా.. నీ మనసులో నామీద ఉన్న ప్రేమ నువ్వు బలవంతంగా చంపుకుంటున్నావ్.. అందుకు కారణం మనల్ని విడదీయాలని ఎవరో బలంగా ప్రయత్నిస్తున్నారు అని మిథున అంటే దేవా ఇంకెవరు మీ నా.. అని ఆగిపోతాడు. మిథున షాక్ అయిపోయి అలా చూస్తుంటుంది. ఎవరు అని అనగానే దేవా వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.





















