Nuvvunte Naa Jathaga Serial Today September 24th: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రెస్‌మీట్ పెట్టించి భర్త, మామల పరువు కాపాడిన మిథున!
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 24th మిథున దేవాని విడిపించి తీసుకురావడం పోలీసులు మీడియాతో మాట్లాడి నేత్రతో మాట్లాడించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode నేత్ర దేవాని పెళ్లి చేసుకోవాలి అనుకునే ఇలా చేశానని డీఎస్పీతో చెప్తుంది. డీఎస్పీ వెంటనే ఎస్‌ఐకి కాల్ చేసి దేవాని తీసుకొని ఆఫీస్‌కి రమ్మని చెప్తాడు. ఎస్‌ఐ సరిగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎందుకు కొట్టావని తిడతాడు. జడ్జిగారి అమ్మాయి కోర్టులో నీ మీద కేసు వేస్తే నీ పరిస్థితి ఏంటి.. నీ ఉద్యోగం ఉంటుందా అని అంటారు. ఇప్పటికే నీపై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇంకోసారి నీమీద కంప్లైంట్ వస్తే నిన్ను సస్పెండ్ చేయిస్తా అంటాడు.
ఎస్‌ఐ సారీ చెప్తాడు. మిథునని డీఎస్పీతో సార్ ఈ కేసు వల్ల మా వీధి వీధి మమల్ని తప్పుగా చూశారు. మా మామయ్య పరువు పోయింది.. మీరు మా మామయ్య పరువు నిలబెట్టాలి సార్ ఈ సాయం చేయండి అని అంటుంది. డీఎస్పీ వస్తానని చెప్పి దేవాని తీసుకెళ్లమని అంటాడు. పరువు పోయింది.. దేవా లైఫ్ నాశనం అయిందని సత్యమూర్తి బాధ పడుతుంటారు. ఇంతో ఎస్‌ఐ దేవాని తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మీడియా కూడా వస్తుంది. దేవాని రేప్ కేసులో అరెస్ట్ చేస్తామని ఇక్కడే చెప్తారేమో పరువు అంతా పోయిందని కాంతం యాక్టింగ్ చేస్తుంది.
ఎస్‌ఐ పెద్ద మైక్ పట్టుకొని కాలనీ వాళ్లందరిని ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతారని అంటారు. దేవా ఏ తప్పు చేయలేదు.. నేత్ర అనే అమ్మాయి చెప్పిన మాటల్నీ అబద్ధం అని డీఎప్పీ చెప్తారు. సాక్ష్యాలు ఏంటి సార్ అని మీడియా అడిగితే మిథున నేత్రని తీసుకొని ఎంట్రీ ఇస్తుంది. నేత్ర కూడా మీడియాతో మాట్లాడుతుంది. నేత్ర జరిగింది అంతా మీడియాతో చెప్తుంది. కావాలనే నేను ఇలా చేశాను.. దేవా ఏం తప్పు చేయలేదు అని చెప్తుంది. సత్యమూర్తి ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషపడతారు. మిథున నేత్రతో నా భర్తని ఇంత వరకు తీసుకొచ్చినందుకు నిన్ను అరెస్ట్ చేయించడం నాకు క్షణం పట్టదు.. కానీ నేను అలా చేయడం లేదు.. సాటి ఆడపిల్లవని వదిలేస్తున్నా అని అంటుంది. సారీ అక్క అని చెప్పి నేత్ర వెళ్లిపోతుంది.
డీఎస్పీ దేవాతో నీ భార్య లేకుంటే ఈ రోజు నువ్వు జైలుపాలయ్యేవాడివి. మాస్టారూ మీ కొడుకుకి బంగారంలాంటి భార్య వచ్చింది.. మీ కోడలు మీ ఇంటి పరువు మర్యాద నిలబెట్టాలని పోరాడింది. మీ కొడుకు మీద పడిన నింద వల్ల మీరు తలదించుకునే పరిస్థితి వచ్చిందని చాలా బాధ పడి.. ఎవరి ముందు అయితే మీ పరువు పోయిందో తన భర్త మీద నిండ పడిందో అక్కడే మీ పరువు నిలబెట్టాలి అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టింది.. మీ ఇంటికి దేవత లాంటి కోడలు దొరికింది..మీ ఇంటికి ఏ సమస్య వచ్చినా తను ఉంది.. మీరు ధైర్యంగా ఉండొచ్చు.. అని చెప్పి వెళ్లిపోతారు.
దేవా ఇంట్లోకి వెళ్లకుండా బయట నిల్చొంటాడు. నువ్వు తప్పు చేయలేదు కదా లోపలికి రా ఇంకా ఇక్కడే ఉంటావా అని మిథున అంటుంది. మిథునకు దేవా థ్యాంక్స్ చెప్తాడు. ఇక మిథున దేవా చేయి పట్టుకొని లోపలికి వెళ్దాం రా అని తీసుకెళ్తుంది. దేవా, మిథునలకు శారద దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది. మీ ఇద్దరి బంధానికి ఎవరి దిష్టి తగిలిందిరా అని అంటుంది. తప్పు చేసిన వాళ్లు బాధ పడాలి.. నువ్వు కాదు అని దేవాని చెప్తుంది. లోపలికి రమ్మని దేవా చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















