Nuvvunte Naa Jathaga Serial Today September 10th: నువ్వుంటే నా జతగా: మనసులో ప్రేమ దాచేసి.. మిథునని దారుణంగా అవమానించిన దేవా! సత్యమూర్తికి ఘోర అవమానం!
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 10th మిథున దేవాని నిలదీయడం దేవా మిథున అంటే తనకు ఇష్టం లేదని చెప్పి దారుణంగా అవమానించి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథునకు మెట్టెలు పెట్టడు. అందరూ షాక్ అయి ఏమైంది అని అడుగుతారు. దేవా మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు.
మిథున దేవా.. దేవా అంటూ దేవా దగ్గరకు వెళ్తుంది.
మిథున: దేవా ఏమైంది దేవా.. ఎందుకు అలా సడెన్‌గా వచ్చేశావ్.. అందరూ నీ గురించి టెన్షన్ పడుతున్నారు. ఎదురు చూస్తున్నారు వెళ్దం పద.
దేవా: చేయి వదులు..
మిథున: ఏంటి..
దేవా: చేయి వదులు అని అరుస్తాడు.
ఆదిత్య: అక్క ఇదే మంచి టైం విధ్వసం సృష్టించు.
త్రిపుర: అత్తయ్య ఇప్పుడైనా ఆ దేవా అసలు రంగు అర్థమైందా.. మిథునని ఆ రౌడీ భార్యగా అంగీకరించాడు అనుకోవడం మీ భ్రమ. దేవా అలా నటించాడు.
శారద: అంత దారుణంగా మాట్లాడటానికి నీకు మనసు ఎలా వస్తుందమ్మా. దేవా ఇప్పుడు మిథునని భార్యగా అంగీకరించాడు.
త్రిపుర: అని మీతో చెప్పాడా.. మీరు అలా నమ్మేలా డ్రామాలాడాడు. అతను డబ్బు కోసం చాలా తెలివిగా నాటకాలు ఆడాడు.
సత్యమూర్తి: చూడమ్మా డబ్బు కోసం నాటకాలు ఆడేవాడు కాదు నా కొడుకు. ప్రాణాలు పోయినా అలాంటి నీచానికి దిగజారడు. వాడు మిథున కోసం ఎంత తల్లడిల్లిపోయాడో నాకు తెలుసు.
త్రిపుర: అయితే ఇక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయాడు..
మిథున: చెప్పు దేవా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ దేవా.. ఏమైంది దేవా..
దేవా: నేనేం చేస్తున్నా నార్మల్‌గానే ఉన్నాను.
మిథున: నువ్వు నార్మల్‌గా ఉన్నావా.. అయితే నాకు ఎందుకు మెట్టెలు తొడక్కుండా వచ్చేశావ్..
దేవా: ఇందాక నుంచి మెట్టెలు తొడగలేదు తొడగలేదు అంటున్నావ్.. మెట్టెలు తొడగడానికి నువ్వేమైనా నా భార్యవా.
మిథున: ఏంటి ఏమన్నావ్.. ఏమైంది దేవా నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్..
దేవా: నేను కరెక్ట్‌గా ఉన్నాను.. కరెక్ట్‌గా మాట్లాడుతున్నా అది నీకే ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలీదు. నేను నీ మెడలో ఇష్టపడి తాళి కట్టానా.. నిన్ను భార్యగా చూశానని నీకు చెప్పానా.. మరి ఎందుకు నన్ను దబాయిస్తున్నావ్.
మిథున: ఏంటి నువ్వు నన్ను భార్యగా చూడలేదా.. మరి మా ఇంటికి రావడానికి ఎందుకు సిద్ధ పడ్డావ్. అన్నింటికి ఎందుకు ఒప్పుకున్నావ్.
దేవా: నిన్ను వదిలించుకోవడం కోసమే వచ్చాను. నువ్వు ఎంత ప్రయత్నించినా నా ప్రాణం పోయినా నిన్ను భార్యగా అంగీకరించను. మీ నాన్న కండీషన్ నాకు మంచి అవకాశం అనుకున్నా నేను ఎలాగూ పెద్ద వెదవని కాబట్టి ఎవరితోనో గొడవ తాగి తందనాలు వేస్తాను కాబట్టి మీ నాన్నకి నేను నచ్చను కాబట్టి నువ్వు వెళ్లిపోతావు.. నీ దరిద్రం నాకు ఉండదు అనుకున్నా. కానీ నా బ్యాడ్ లక్ మీ నాన్నకి నా చెత్త క్యారెక్టర్ నచ్చింది.
మిథున: ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నావ్ దేవా నీకు ఏం అనిపించడం లేదా.. నా మీద నీకు ఆకాశమంత ప్రేమ ఉండటం నిజం కాదా.. నా భర్తడే రోజు నాకు చెప్పాలి అనుకోవడం నిజం కాదా.. నాకు బులెట్ తగలకపోయి ఉంటే అందరి ముందు ఐలవ్‌యూ మిథున అని చెప్పేవాడివి కాదా.. చెప్పు ఇవన్నీ నిజాలు కదా.. సమాధానం చెప్పు దేవా..
దేవా: నీ మీద నాకు ప్రేమ ఉందా.. ఇంత కంటే పెద్ద జోక్ మరొకటి ఉండదు. నాకు ఎవరైనా నచ్చని వ్యక్తి ఉన్నారు అంటే అది నువ్వే. భర్త భర్త అని చంపుకొని తింటున్నావ్. నిన్ను నేను భార్యగా అంగీకరించడం ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. నిన్ను చూస్తుంటే పిచ్చ జాలేస్తుంది. ఒక మగాడు చీ అని అసహ్యించుకుంటున్నా అతని వెంట పడితే అలాంటి క్యారెక్టర్‌ని ఏం అంటారో అర్థం చేసుకో.
దేవా మాటలకు మిథున ఏడుస్తూ వెళ్లిపోతుంది. దేవా కూడా చాలా ఏడుస్తాడు. ఇక త్రిపుర గొడవ పడుతూనే ఉంటుంది. త్రిపుర దేవా గురించి మాట్లాడుతూ వాడు ఒక రౌడీనే కాదు డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వెధవ అంటుంది. త్రిపుర మాటలు జాగ్రత్త అని సత్యమూర్తి తాటిస్తాడు. రాహుల్ ఎంట్రీ ఇచ్చి ఆపవయ్యా మాట్లాడుతున్నావ్.. ఇదంతా నీ కుటుంబం ఆడుతున్న నాటకంలా ఉంది.. ఒక స్కూల్ మాస్టారుగా నువ్వు సంపాదించింది ఏం లేదు కదా..అందుకే అప్పనంగా మా దగ్గర కొట్టేయాలని చూస్తున్నావ్.. తండ్రిని బట్టే కొడుకు ఉంటాడు. తండ్రి కొడుకుని అడ్డు పెట్టుకొని సంపాదించాలని చూస్తున్నాడు అని రాహుల్ అంటాడు. రాహుల్ మర్యాద నా గురించి నా వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటాడు. దాంతో రాహుల్ సత్యమూర్తి కాలర్ పట్టుకుంటాడు. అందరూ విడిపించాలని ఎంత ప్రయత్నించినా వదలడు. షర్ట్ చింపేస్తాడు. లలిత రాహుల్‌ని కొట్టి సత్యమూర్తికి క్షమాపణ అడుగుతుంది. సత్యమూర్తి కుప్పకూలిపోతాడు.
మిథున ఆదిత్య మాటలు దేవా మాటలు తలచుకొని బాధ పడుతుంటే హరివర్ధన్ వచ్చి కూతురి పక్కన కూర్చొంటాడు. ఇలాంటి టైంలో కన్నీరు కాదమ్మా జ్ఞానోదయం కావాలి.. నువ్వు అంటే ప్రేమ లేని చోట నువ్వు ఎంత ప్రేమ వెతుక్కున్నా నీకు జీవితం ఉండదమ్మా.. పెళ్లి అంటే ఇద్దరి ప్రమాణం.. ఒకరి తాపత్రయం కాదు.. ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే మంచిది అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















