Nuvvunte Naa Jathaga Serial Today july 22nd: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున-దేవా ప్రేమ కథలో కొత్త మలుపు! త్రిపుర పగ, కాంతం కుట్రలు.. ఏం జరగబోతోంది?
Nuvvunte Naa Jathaga Today Episode మిథున అత్త, తల్లితో తను తండ్రితో కాసిన పందెంలో గెలిచానని అందరికీ తన మీద దేవాకి ఉన్న ప్రేమ అర్థమైందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునని క్షేమంగా దేవా, ఎస్ఐ అపర్ణదాస్ ఇంటికి తీసుకొస్తారు. మిథునని కిడ్నాప్ చేసింది దేవా మనుషులు కాదు ఎవరో వేరే వ్యక్తి అని అంటుంది. హరివర్దన్ అపర్ణ దాస్‌కి థ్యాంక్స్ చెప్తే నాకు కాదు సార్ దేవాకి చెప్పాలి. మీ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టం కానీ దేవా తన మనసుతో వెతికి మిథున ఆచూకి కనిపెట్టాడు. జైల్లో మేం అతన్ని పెట్టి చితక్కొట్టినా మిథునని కాపాడాలని తపించాడు. అతని కళ్లలో మిథున మీద ప్రేమ చూశాను.. ఇదంతా దేవా వ్యక్తిత్వం చెప్పాలని చెప్తున్నా మీ అందరి దృష్టిలో అతని మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు కానీ అతను రౌడీనే కానీ మంచి మనసు ఉంది సార్.. ఓ ఆడపిల్లకి ఆపద రాకుండా కాపాడుకునే తోడు కంటే గొప్ప తోడు అండ మరొకటి ఉండదు సార్ అని అపర్ణ దాస్ అందరికీ చెప్తుంది.
దేవాని కొట్టినందుకు సారీ చెప్తుంది. వెళ్తూ వెళ్తూ ఒక్క మాట అని కొన్ని బంధాలను వదులుకోకూడదు. కొన్ని చేతుల్ని విడిచిపెట్టకూడదు అని మిథున దేవా చేతుల్ని కలిపి.. మరొక జన్మ ఎత్తినా దొరకదు ఆల్‌ది బెస్ట్ అని చెప్పి వెళ్లిపోతుంది. దేవా, మిథునలు తప్పించుకున్నందుకు ఆదిత్య రౌడీలను చితక్కొడతాడు. నా భార్యని వాడు ఎవడో తీసుకెళ్తుంటే చేతకాని దద్దమ్మల్లా వదిలేస్తారా అని చితక్కొడతాడు. నా ప్లాన్ అంతా సర్వనాశనం చేసి పడేశారు. ఆ దేవాని మీరు వదిలేయడం వల్ల ఇద్దరి మనసులో ప్రేమ పెరిగింది. మిథునని దక్కించుకోవడానికి యుద్ధమే చేశా ఈ సారి విధ్వంసం చేస్తా అని అంటాడు.
దేవా గదిలో ఉంటే మిథున స్నానం చేసి తల తుడుచుకుంటూ వస్తుంది. దేవా మిథునని చూసి ఏం మాట్లాడకుండా చాటుగా చూస్తాడు. మిథున నవ్వుకుంటుంది. దేవా పక్కకి తిరిగి బట్టలు మార్చుకుంటుంటే మిథున చూస్తూ ఉంటుంది. మిథున తనని చూడటం దేవా చూస్తే మిథున వెనక్కి తిరిగుతుంది. తర్వాత దేవా దగ్గరకు వెళ్లి నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. దేవా ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంటే దేవా చేయి పట్టుకొని ఆపుతుంది. దేవా ఆశ్చర్యంగా చూస్తే దేవా మర్చిపోయిన వాచ్ ఇస్తుంది. దేవా తీసుకొని ఏం మాట్లాడకుండా మిథునని చూస్తూ వెళ్లిపోతాడు. మిథున ముసి ముసిగా నవ్వుకుంటుంది.
త్రిపుర దేవా అందరి ముందు హీరో అయిపోయాడని.. నిన్నటివరకు ఆ రౌడీ పేరు ఎత్తితే రగిలిపోయిన మామయ్య ఇప్పుడు కూల్ అయిపోయారని రగిలిపోతుంటుంది. దేవాతో వాళ్లు కలిసి పోతే వాళ్లు వాళ్లు ఒకటి అయిపోతారు. నేను పరాయిదాన్నిఅయిపోతా అలా జరగకూడదు అని అనుకుంటుంది. ఇంతలో కాంతం వచ్చి నువ్వేం చేయలేవు పెద్ద హీరో అనుకుంటారు కానీ చిన్నపిల్లల దగ్గర చాక్లెట్‌లు తీసుకోవడం కూడా చేతకాదు అని ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు త్రిపురని తిడుతుంది. ఇంతలో కాంతానికి ఫోన్ రావడంతో త్రిపురకు కాంతం నాటకం అర్థమై కాంతం జుట్టు పట్టుకొని లాగేస్తుంది. దేవా, మిథున ఉప్పు నిప్పుల ఉండే వారు ఇప్పుడు పాలు నీరులా కలిసిపోతున్నారని కడుపు మండిపోతుందని మిథున, దేవా విడిపోతేనే తన కడుపు మంట చల్లారుతుందని త్రిపురని రెచ్చగొడుతుంది.
మిథున దగ్గరకు శారద జ్యూస్ తీసుకొస్తుంది. అప్పుడే మిథున తల్లి కూడా జ్యూస్ తీసుకొస్తుంది. ఇద్దరూ ఒకే సారి తీసుకొచ్చారా అని అంటే రెండు రోజుల నుంచి నువ్వేం తినలేదు కదా అని తీసుకొచ్చానని శారద అంటుంది. తల్లిలా చూసుకునే అత్త దొరకడం నీ అదృష్టం అని లలిత మిథునతో చెప్తుంది. ఇక నీ కోసం మీ అత్తయ్య చేతిలో హారతి వెలిగించి దేవుడికి మొక్కుకున్నారని లలిత చెప్పడంతో మిథున అత్తని హగ్ చేసుకొని ఎందుకు అత్తయ్యా నా కోసం ఇలా చేశారు అని అడుగుతుంది. దానికి శారద నువ్వు మా ఇంటి మహాలక్ష్మీవి నీకు ఏం కాకుండా ఉండాలని చేశానని అంటుంది. ఇక దేవా కోసం మీ నాన్నతో చేసిన చాలెంజ్ గురించి భయంగా ఉంది గెలుస్తావో లేదో అని అంటుంది. దానికి మిథున ఇంకా గెలుస్తానో లేదో ఏంటి అత్తయ్య నేను గెలిచేశాను. దేవా మనసులో నేను ఉన్నానని మా నాన్నకే కాదు ఈ ప్రపంచానికే తెలిసేలా చేశానని అంటుంది. దేవా తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడాడు. నేను తన మనసులో లేకపోతే అంతలా విలవిల్లాడిపోతాడా. నా భార్యని నేను కాపాడుకుంటానని పోలీసులతో చెప్తాడు. దేవా అలా పైకి ఉంటాడు కానీ నేను అంటే దేవాకి ఇష్టం అని చెప్తుంది నేను గెలిచాను అని మిథున సంతోషంగా ఉంటే అత్తయ్యా, తల్లి ఇద్దరూ హగ్ చేసుకుంటారు.
కాంతం చిరాకుగా వంట చేస్తుంటే పని మనిషి వచ్చి కాస్త నవ్వుతూ చేయండి అని చెప్తుంది. ఏంటే నవ్వుతూ చేసేది మా అత్తారింట్లోనే నాటకాలు ఆడి పని తప్పించుకునేదాన్ని కానీ ఇక్కడ రెండు కుటుంబాలను మంట పెట్టి ఏడిపించాలనుకుంటే రెండు కుటుంబాల కోసం వంట చేస్తున్నా నా ఖర్మ అంటుంది. ఇక త్రిపుర కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఆ సుకుమారికి 4 కూరలు ఉండాలి.. నలుగురి తిన్నది తింటుందని అంటుంది. ఇక్కడి నుంచి వెళ్లేలోపు ఆ కంచు నాకు దొరికితే తన పని అయిపోతుందని అంటుంది. తర్వాత త్రిపురని చూసి బిత్తరపోతుంది. త్రిపుర కూర మీద మూత తీస్తే మీ చేయి అంత ఉంటుంది నా ముఖం మీరు కొడితే పచ్చడి అయిపోతా అంటుంది. దానికి త్రిపుర ఇప్పుడు కొట్టే మూడ్‌లోలేను బాగా ఆకలిగా ఉంది తిన్నాక కొడతా తీసుకురా అంటుంది. మిథున దేవా గురించి తలచుకొని నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు నన్ను కాపాడిన విధానమే చెప్పిందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















