Nuvvunte Naa Jathaga Serial Today January 3rd: నువ్వుంటే నా జతగా: ఒక్కటైన మిథున, దేవా! చివరి నిమిషంలో అసలైన ట్విస్ట్! ఇదంతా నిజమేనా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode January 3rd మిథునని దేవా బతిమాలడం మిథున అందరికీ సారీ చెప్పి దేవాతో వెళ్లిపోవడానికి రెడీ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా హరివర్థన్‌తో ఎవరి కోసం నేను మిథునని మా ఇంట్లో నుంచి గెంటేశాను.. ఎవరి కోసం నేను మిథునని వదిలేశాను.. ఎవరి కోసం నేను నా మనసు చంపుకొని మిథునని దూరం చేసుకున్నాను.. మీ కోసం.. కేవలం మీ కోసం అని అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. నా కూతురిని వదిలేయరా అని మీరు నన్ను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి చేయించుకున్న ఒట్టు కోసం.. నా కారణంగా మీరంతా బాధ పడుతున్నారని.. నా కారణంగా తన జీవతం శూన్యం అవుతుందని నా మనసులో ప్రేమ చంపేసుకొని తనని నిర్ధాక్షిణ్యంగా గెంటేశాను అని చెప్తాడు.
మిథున ఏడుస్తుంది. దేవా మామతో నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను నా మీద కోపంతో మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని తన జీవితం బాగుంటుందని నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యా.. కానీ తను లేని జీవితం శూన్యం అని తను లేకుండా నేను బతకలేను అని బుద్ధి తెచ్చుకున్నా.. అందుకే పశ్చాత్తాపంతో నా భార్య ముందు ఇలా నిలబడ్డాను అని తలదించుకుంటాడు.
హరివర్థన్ దేవాతో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో లేదంటే పోలీసుల్ని పిలిపిస్తా అని అంటే పిలవండి సార్ పిలవండి నా భార్య కోసం వచ్చిన నన్ను ఏమని గెంటేస్తారో నేను చూస్తా అని అంటాడు. విడాకులు తీసుకోవడానికి వచ్చిన జంటల్ని మీరే కలుపుతారు కదా సార్ మరి మమల్ని వడదీస్తారు ఏంటి సార్ అంటాడు. పదే పదే నా చెల్లిని భార్య అంటావేంట్రా నా చెల్లి దృష్టిలో నువ్వు ఒక అనామకుడివి..అని రాహుల్ అంటే ఆ మాట తనతో చెప్పించండి అని దేవా అంటాడు. ఇక్కడి నుంచి వెళ్లరా అని రాహుల్ అంటే వెళ్తాను.. నేను తన భర్త కాదు అని మిథునతో చెప్పించండి ఒక్క మాట మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోతా అని అంటాడు.
అందరూ మిథున వైపు చూస్తారు. మిథున ఏడుస్తూ ఉంటుంది. రాహుల్, త్రిపుర అందరూ చెప్పమని అంటారు. దేవా కన్నీరు చూసి మోసపోవద్దు.. మరోసారి అందరి ముందు మీ నాన్న పరువు తీయకు.. నీ మెడలో తాళితీసి వాడి ముఖాన కొట్టి ఈ జన్మలో వాడి ముఖం చూపించొద్దు అని చెప్పు మిథున అని త్రిపుర అంటుంది. దేవా మిథునతో తప్పు చేసిన వాడి కంటే తప్పు సరిదిద్దుకునే వాడే నిజమైన వాడని అంటావు కదా.. నీ విషయంలో ఎంత తప్పు చేశానో తెలుసుకున్నా.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా.. నిన్ను కళ్లలో పెట్టుకొని మహారాణిలా చూసుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వు మిథున.. అంతే కానీ జీవితాంతం నరకంలోకి నెట్టేయకు అని అంటాడు.
మిథున ఏం మాట్లాడకుండా ఉంటే దానికి రాహుల్ తనేం మాట్లాడటం లేదు అంటే అర్థం కావడం లేదా తనకి నువ్వు ఇష్టం లేదు అని పోరా అని అంటాడు. మిథున దేవుడు అందరికీ రెండో అవకాశం ఇస్తాడు. నాకు ఇది రెండో అవకాశం నాకు ఇది దక్కేలా చూడు మిథున.. నీకు సేవలు చేసుకొని నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను దేవతలా చూసుకుంటాను.. ఒక్క అవకాశం ఇవ్వు మిథున అని వేడుకుంటాడు. మిథున రాదు అని త్రిపుర, రాహుల్ వాళ్లు చెప్తారు. దేవాని వెళ్లిపోమని అంటే మిథున నోరు విప్పే వరకు ఇక్కడి నుంచి వెళ్లను అంటాడు. రాహుల్ వాళ్ల కొట్టడానికి వస్తే నేను నా భార్య తేల్చుకోవడానికి వచ్చా మధ్యలో ఎవరైనా వస్తే ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు.
మిథునని బతిమాలుతాడు. మారిన దేవాని చూస్తావ్.. నీ దేవా ఎలా ఉండాలి అని చూశావో అలాంటి దేవాని చూస్తావ్.. అందరికీ దేవాతోనే నా బతుకు అని చెప్పి చావు అయినా బతుకు అయినా కలిసే ఉంటాం అని చెప్పి వచ్చేయ్ మిథున అని అంటాడు. మిథున ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే మిథున చివరి సారి అడుగుతున్నా నాతో మన ఇంటికి వస్తావా లేదా అని అంటాడు.
హరివర్థన్ కోపంగా నా కూతురి సమాధానం అర్థమైంది కదా.. ఇంకోసారి నా కూతురి జోలికి వస్తే చంపేస్తా గెట్ అవుట్ అని దేవాని హరివర్థన్ పొమ్మని చెప్తాడు. ఉరి శిక్ష పడిన వాడికి కూడా చివరి కోరిక అడుగుతారు. నువ్వు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు కదా మిథున.. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా ఊపిరి ఆగిపోయే వరకు నాలో నువ్వు ఉంటావ్.. నా అణువు అణువు ఉన్నావ్.. నీ కోసం బతకాలి అనుకున్నా కానీ నీ కోసం శిథిలం అయిపోతా అంటాడు.
మిథున అలా ఉండిపోవడంతో దేవా అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. మిథున దేవాని పిలిచి రమ్మని అంటుంది. నాన్న అందరూ నన్ను క్షమించండి.. మాది ఆ పార్వతీ పరమేశ్వరులు ముడి వేసిన బంధం.. అందుకే దేవా నుంచి నేను దూరంగా వచ్చేసిన సరే.. ఏదో శక్తి నా మెడలో నుంచి ఈ తాళి తీయనివ్వకుండా నన్ను నా మనసుని కట్టి పడేసుంది. ఆ శక్తి దేవాలో వచ్చని ఈ మార్పు. పార్వతి పరమేశ్వరుల సాక్షిగా ఒక్కటైన మేం మట్టిలో కలిసిపోయే వరకు ఒక్కటిగా బతుకుతాం.. ఒకరి కోసం ఒకరు బతుకుతాం.. దేవా నాకు ఆ దేవుడు ఇచ్చిన భర్త. చావు అయినా బతుకు అయినా నాకు నా భర్తతోనే నేను నా భర్తతో వెళ్లిపోతున్నా.. నన్ను అర్థం చేసుకోండి.. నన్ను ఆపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ అని మిథున దేవాని హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















