Nindu Manasulu Serial Today January 3rd: నిండు మనసులు: సిద్ధూ-ప్రేరణ ప్రేమలో పడతారా? ఇందిరకు అనుమానమెందుకు? గణ కన్నింగ్ ప్లాన్!
Nindu Manasulu Serial Today Episode January 3rd సిద్ధూ మనసులో ప్రేరణ మీద ఏం ఫీలింగ్ లేనప్పటిని అతని భవిష్యత్‌లో ప్రేరణని ప్రేమిస్తాడేమో అని ఇందిరకు అనిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూతో ఇందిర ప్రేరణని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. నేను ప్రేరణ మంచి ఫ్రెండ్స్ ఆంటీ మీకు ఇలాంటి అనుమానం వచ్చేలా చేసినందుకు నన్ను క్షమించండి అని అడుగుతాడు. దానికి ఇందిర నువ్వే నన్ను క్షమించు బాబు.. డబ్బున్న వాళ్ల ఆలోచనలకు మాలాంటి మధ్య తరగతి వాళ్ల ఆలోచనలకు పొంతన ఉండదు.. మా దృష్టిలో స్వేచ్ఛ చాలా ఖరీదైనది.. మీ బంధానికి స్వేచ్ఛ అనే పేరు పెట్టావ్.. కానీ ఆడపిల్ల తల్లికి స్వేచ్ఛ అనేది భయం కలిగించేది.. నవ్వే ముఖాల వెనక బాధ కనిపించదు అని అంటుంది.
సిద్ధూ ఇందిరతో అదేంటో చెప్పండి ఆంటీ నేను మీకు అండగా ఉంటా అని అంటాడు. ఆ మాట చాలు బాబు.. స్నేహితులుగా మీరు ముందుకు నడవండి.. మీ జీవితాల్లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించండి ఇదే మాకు కావాలి అని అంటుంది. ఇంత చెప్పాక కూడా మీరు ఇంకా అనుమాన పడుతున్నారేంటి ఆంటీ.. ప్రేరణ నాకు స్నేహితురాలు మాత్రమే.. ఆంటీ నన్ను అడిగిన ప్రశ్నలు మీ అమ్మాయిని అడిగారా.. దయచేసి అడగకండి.. ప్లీజ్.. ఆంటీ మీకో విషయం చెప్తా.. నా జీవితంలోకి ఇంకా ప్రేమ అనే చాప్టర్ రాలేదు.. నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయి కంటే ముందు వాళ్ల ఇంట్లో పర్మిషన్ తీసుకుంటా అని అంటాడు.
ప్రేరణ అప్పుడే వచ్చి ఏ విషయంలో పర్మిషన్ తీసుకుంటున్నావ్ సిద్ధూ అని అడుగుతుంది. ఇద్దరూ అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నారని అడుగుతుంది. దానికి సిద్ధూ నేను మీ అమ్మతో మాట్లాడాలి అంటే నీ పర్మిషన్ తీసుకోవాలా లోకం తీరు గురించి సందేహాలు ఉంటే అడిగానని చెప్పేసి వెళ్లిపోతాడు. ఇందిర మనసులో ప్రేరణ గురించి సిద్ధూ మాటలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి,, కానీ ఈ ఆలోచనలే సిద్ధూ మనసులో ప్రేరణ మీద ప్రేమని కలిగిస్తాయా అని అనుకుంటుంది.
గణ విజయానంద్ని కలుస్తాడు. నా పెళ్లి ఆపించడానికి నువ్వు కూడా సిద్ధూతో చేతులు కలిపావని గణ అంటాడు. నేనేదో ఆపినట్లు మాట్లాడుతున్నావ్.. పైగా నీ ఉద్యోగం పోయింది అనే బాధలో ఉన్నావ్.. కానీ ఆ బాధ నా మీద రుద్దాలిఅని చూడు. నీ పెళ్లి ఆపింది.. ప్రేరణ, సిద్ధూ నాకు ఏం సంబంధం లేదు.. వాళ్లని ఏమైనా చేసుకో నేను ఏమైనా అనుకోను.. కావాలంటే నా ఫుల్ సపోర్ట్ నీకే అని అంటాడు. ప్రేరణ, సిద్ధూ అడ్డుకోకపోతే నీ కూతురితో నా పెళ్లి చేయడం నీకు ఇష్టమే కదా అయితే ఇప్పుడు నాకు పెళ్లి జరిపించు అని అంటాడు. దానికి విజయానంద్ కుదరదు అని అంటాడు. మా ఆవిడకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటాడు. మీ ఆవిడకు ఇష్టం లేకపోయినా.. నీ కూతురికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరగాలి.. లేదంటే నీ గురించి చెప్పేస్తా అంటాడు.
విజయానంద్ కోపంగా ఈ పెళ్లి జరిపిస్తే నా పెళ్లాం నన్ను చంపేస్తుంది. నిజం చెప్తే సిద్ధూ చంపేస్తాడు. నా భార్య చేతిలో చావడం కంటే ఆ నిజం చెప్పేయ్ ఏది అయితే అదే అవుతుంది అని అంటాడు. దాంతో గణ సైలెంట్ అయిపోతాడు. గణకి సుధాకర్ కాఫీ ఇస్తాడు. నా నుంచి నీకు ఏదో కావాలి సుధా అందుకే నువ్వు ఇప్పుడు వచ్చావ్ అని గణ అంటాడు. దానికి సుధాకర్ మీరు అంటే నాకు ప్రాణం అని అంటాడు. ఇక ఇందిర కాల్ చేసి ప్రేరణ కనిపించిందని సుధాకర్కి చెప్తుంది. ఏంటి సుధా సీక్రెట్గా మాట్లాడుతున్నావ్ అని గణ అడుగుతాడు. సిద్ధూని వదలను అని గణ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు ఏం చేయలేరు సార్.. ఉద్యోగం లేని మగాడిని ఈ సమాజం విలువ ఇవ్వదు సార్.. అయినా మీకు ఉన్న అతి తెలివికి ఏదో లాభసాటి బిజినెస్ పెట్టండి సార్ అని అంటాడు.
సూపర్ ఐడియా సుధా అది ఎవరితో చేయాలో వాళ్లతో చేస్తా అని అంటాడు. గణ సుధాకర్ని తీసుకొని మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. సుధాని బయటే ఉంచి లోపలికి గణ వెళ్తాడు. గణ వెళ్లే సరికి మినిస్టర్ తన పర్సనల్ విషయం మాట్లాడుతూ ఉంటాడు. గణ నేరుగా వెళ్లే సరికి గణని మినిస్టర్ తిడతాడు. పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి అని తెలీదా.. నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని తిట్టి పంపేస్తాడు. గణ చాటుగా వచ్చి దాక్కొని సుధాకర్కి కాల్ చేసి ఫోన్ అక్కడే పెట్టేసి బయటకు వచ్చి మినిస్టర్ తన కూతురు ఎవరితోనో లవ్లో ఉందని విషయం గణ తెలుసుకుంటాడు. వెంటనే లోపలికి వెళ్లి ఫోన్ తెచ్చుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.




















