Nindu Noorella Saavasam Serial Today January 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి గాయం – గండం ముంచుకొస్తుందన్న చంభా
Nindu Noorella Saavasam serial Today Episode January 3rd: ఇంట్లో అమర్ కోసం వెళ్తూ ఆరు ఫోటో ముందు కింద పడిపోతుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ, బుజ్జమ్మ అరకు నుంచి వస్తున్న బస్సులో మధ్యలో విక్రమ్ ఎక్కుతాడు.. అమర్ తో ఫోన్ మాట్లాడుతూ.. బ్యాగ్ పైన పెట్టబోతుంటే.. విక్రమ్ ఫోన్ కింద పడిపోతుంది. వెంటనే పక్క సీట్లో ఉన్న బుజ్జమ్మ గమనించి విక్రమ్ ఫోన్ పట్టుకుంటుంది.
బుజ్జమ్మ: అంకుల్ మీరు బ్యాగ్ పెట్టుకోండి.. ఫోన్ నేను పట్టుకుంటాను.
విక్రమ్: సరేనమ్మా..
అమర్: హలో విక్రమ్ ఏమైంది..?
బుజ్జమ్మ: హలో.. (అమర్ షాక్ అవుతాడు. మిస్సమ్మ కడుపులో ఉన్నప్పుడు బుజ్జమ్మ నాన్న అని పిలిచింది గుర్తుకు వస్తుంది.) హలో అంకుల్ కాసేపు లైన్ లో ఉండండి. అంకుల్ బ్యాగ్ పైన పెడుతున్నాడు. కొంచెం వెయిట్ చేయండి.. వెయిట్ చేస్తున్నారా..? హలో మాట్లాడండి..
విక్రమ్: పాప ఫోన్ ఇటివ్వమ్మా థాంక్యూ పాప
బుజ్జమ్మ: ఇట్స్ ఓకే అంకుల్
విక్రమ్: హలో
అమర్: విక్రమ్ ఇందాక ఫోన్‌లో నాతో మాట్లాడింది ఎవరు..?
విక్రమ్: ఎవరో చిన్న పాప నేను బ్యాగ్ పెడుతుంటే.. ఫోన్ పడిపోయింది. తను పట్టుకుంది. ఇంకేంటి విశేషాలు చెప్పు.. రేపు నన్ను ఫికప్ చేసుకోవడానికి రాథోడ్‌ను పంపించు..
అమర్: లేదు రాథోడ్ తో పాటు నేను వస్తాను
విక్రమ్: నువ్వెందుకు
అమర్: పర్వాలేదు విక్రమ్ మనం కలిసి చాలా రోజులు అయింది కదా జాగ్రత్తగా రా.. హ్యాపీ జర్నీ..
విక్రమ్: ఓకే బ్రో రేపు కలుద్దాం..
అని విక్రమ్ కాల్ చేశాక అమర్ ఆలోచిస్తుంటాడు.
రాథోడ్: ఏమైంది సార్ అలా ఉన్నారు
అమర్: ఆరు గుర్తుకు వస్తుంది రాథోడ్
రాథోడ్: మేడం గారు ఎప్పుడూ మీతోనే ఉంటారు సార్
అమర్: గుర్తుకు వస్తుంది తను కాదు.. నాకోసం మళ్లీ పుట్టిన అరుంధతి. ఆరును తీసుకుని భాగీ ఎందుకు వెళ్లిపోయింది రాథోడ్.. వాళ్లు ఎక్కడున్నారు..? అసలు ఎలా ఉన్నారు..?
రాథోడ్: వాళ్లు ఎక్కడున్నా మీకోసం తప్పకుండా తిరిగి వస్తారు సార్
అమర్: ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాను రాథోడ్ ఇంకెప్పుడు వస్తారు..?
రాథోడ్: వస్తారు సార్ తప్పకుండా వస్తారు.. ఈ రోజు కృష్ణ జయంతి.. సార్ సరిగ్గా ఇలాంటి రోజునే ఆరు మేడం మళ్లీ పుట్టారు.. ఈ కృష్ణ జయంతి మీకు మంచి చేస్తుందని నాకెందుకో నమ్మకం వస్తుంది సార్. మీకోసం మిస్సమ్మ, బుజ్జమ్మ వస్తున్నారనిపిస్తుంది.
అమర్: ( మనసులో) వాళ్లు నిజంగా తిరిగి వస్తారా..? నా ఆశ నిరాశే అవుతుందా..? ఇలా ఎన్ని రోజులు ఎదురుచూడాలి
అని ఎమోషనల్ అవుతాడు అమర్. తర్వాత పిల్లలు కూడా భాగీ, బుజ్జమ్మలను గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. కింద హాల్లో ఉన్న మనోహరి అమర్‌ను పిలుస్తూ వెళ్లి కుర్చి తగిలి కింద పడిపోతుంది. అది కూడా ఆరు ఫోటో దగ్గర పడటంతో కాలికి గాయమై రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని చూసిన చంభా షాక్ అవుతుంది.
చంభా: అయ్యో మనోహరి ఎందుకిలా పడిపోయావు.. అయినా అరుంధతి ఫోటో ముందు పడిపోయావేంటి..? అరుంధతి ఫోటో ముందు నీ రక్తం చిందింది అంటే నీకు కష్టాలు మొదలు కాబోతున్నాయి మనోహరి
మనోహరి: ఏం మాట్లాడుతున్నావు చంభా ఐదేళ్ల నుంచి హ్యాపీగా ఉన్నాను.. ఆ భాగీ రావడానికి ఇంకా రెండేళ్ల టైం ఉంది. ఇప్పుడు నాకు కష్టాలు రావడం ఏంటి..?
అనగానే.. చంభా మంత్రం చదివి గవ్వలు వేసి మనోహరి జీవితంలోకి అంతం చేయబోయే వ్యక్తులు వస్తున్నారని హెచ్చరిస్తుంది. మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















