Infosys: ఉద్యోగుల కరెంట్ బిల్లులు అడుగుతున్న ఇన్‌ఫోసిస్ - పని చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికా?
Infosys employees: ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో వినియోగించే విద్యుత్ వివరాలను ఇవ్వాలని అడుగుతోంది. ఎందుకిలా అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Infosys asking employees electricity usage data: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను సేకరిస్తోంది. హైబ్రిడ్ పని విధానం వల్ల కంపెనీ కార్యకలాపాలు కేవలం ఆఫీసు క్యాంపస్‌లకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఇళ్లకు కూడా విస్తరించాయని, దీనివల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.
ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు వాడే విద్యుత్ కూడా ఇన్ఫోసిస్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల పరిధిలోకి వస్తుందని కంపెనీ సీఎఫ్ఓ జయేష్ సంఘరాజ్కా వివరించారు. ఈ వివరాల ద్వారా కంపెనీ పర్యావరణంపై చూపుతున్న ప్రభావాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించేందుకు మరియు తగిన స్థిరమైన చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
Infosys is asking 3L+ employees on their electricity consumption at home. They're gathering this data to track carbon emissions from remote work, enhance sustainability reporting, and meet ESG goals. It helps calculate indirect footprints and promote energy conservation.… pic.twitter.com/lu76ZeSJzg
— Sahil Garg (@gargsahil) January 24, 2026
ఈ సర్వేలో భాగంగా ఉద్యోగులు వాడే విద్యుత్ పరికరాలు ఫ్యాన్లు, ఏసీలు, హీటర్లు , లైట్ల వాటేజ్, వారి ఇళ్లలో సోలార్ పవర్ వాడుతున్నారా లేదా అనే వివరాలను అడుగుతున్నారు. సుమారు 3 లక్షల మంది ఉద్యోగుల నుండి ఈ సమాచారాన్ని సేకరించి, దానికి అనుగుణంగా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి ద్వారా పర్యావరణ ప్రభావాన్ని సమతుల్యం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Infosys is rubbing flint stones to make fire in 2026.
— 🐦GCC 1️⃣0️⃣1️⃣ - Maryson John (@1MortalMan) January 25, 2026
These numbers are anyways averaged and deriving them is a 30 second task. Unless they're profiling employees on Energy Consumption to reduce carbon footprint. https://t.co/lXTRl77OMR pic.twitter.com/o6EOES0H0C
అయితే, ఈ చర్యపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఆఫీసులకు ప్రయాణించేటప్పుడు వెలువడే కాలుష్యాన్ని కూడా లెక్కించాలని కొందరు సూచిస్తుండగా, భవిష్యత్తులో ఉద్యోగులను పూర్తిగా ఆఫీసులకు పిలిపించేందుకే ఈ విధమైన గణాంకాలు సేకరిస్తున్నారేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
The electricity use at home will always have lesser impacts on environment than being stuck in traffic in car for hours.
— EngiNerd. (@mainbhiengineer) January 24, 2026
If sustainability is the motive of Infosys then promote work from home as much as possible. https://t.co/bAA487sBqR
ఏది ఏమైనా, గత 15 ఏళ్లుగా సుస్థిరతపై దృష్టి పెట్టిన ఇన్ఫోసిస్, ఇప్పుడు ఇంటి పని వాతావరణాన్ని కూడా అందులో భాగం చేసింది.




















