Nuvvunte Naa Jathaga Serial Today December 27th:నువ్వుంటే నా జతగా: మిథున గదిలో దేవా..! రిషి, భానుల పెళ్లిళ్లలో కొత్త ట్విస్ట్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 27th మిథున గదిలోకి దేవా వెళ్లడం రిషి మిథున, దేవాలను చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, భానుల పెళ్లి జరిగిన చోటే మిథున పెళ్లి కూడా జరుగుతుందని తెలిసి దేవా ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. మిథున పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుందని భయంగా ఉందని రేణుక కన్నీరు పెడుతుంది. దానికి సత్యమూర్తి ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్లి ఆగే పరిస్థితి లేదని చెప్తారు.
మిథునని పెళ్లి కూతురిగా అలంకృత వాళ్లు రెడీ చేసి మురిసిపోతుంది. మిథున బాధ పడుతుంటే ఏమైందని అలంకృత అడిగితే కళ్లలో దుమ్ము పడిందని మిథున చెప్తుంది. నిజంగానే నువ్వు బాధ పడటం లేదా అక్కా అని అడుగుతుంది. ఏం లేదు నువ్వు ఎక్కువ ఆలోచించకు.. నాన్న వాళ్లకి టెన్షన్ పెట్టకు అని అంటుంది. మిథున తాను రెడీ అవుతాను అని ఫ్రెండ్స్‌ని టిఫెన్‌కి తీసుకెళ్తా అంటుంది.
దేవా ఎవరూ చూడకుండా మిథున గదికి వెళ్తాడు. మిథున షాక్ అయిపోతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. కన్‌ప్యూజ్ అయి వచ్చానని అంటాడు. లైఫ్ విషయంలోనే అనుకున్నా రూం విషయంలో కూడా కన్‌ఫ్యూజ్ అయ్యా.. రూం అయితే వెతుక్కోగలం కానీ జీవితం అలా కాదు కదా ఎలా వెతుక్కోగలం ఎక్కడ వెతుక్కోగలం అంటాడు. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ అని రిషి అడుగుతాడు. దేవాతో పాటు మిథున కంగారు పడతారు.
మిథున గదిలో నీకేం పనిరా అని అంటాడు. దేవా చెప్పబోతే అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు.. నాకు తెలుసురా అని రిషి అంటాడు. మిథున దేవా ఇద్దరూ తమ బంధం గురించి తెలిసిపోయిందని అనుకుంటే రిషి గది ఏదో తెలీక ఇక్కడికి వచ్చేశావ్ అంతే కదా అని అంటాడు. అవును అని దేవా అంటాడు. నీ పెళ్లి కూడా ఇదే గుడిలో అని ఎందుకు చెప్పలేదురా అని అడుగుతాడు. అయినా రెండు రోజులు ఎక్కడ ఉన్నావురా అని అడుగుతాడు. చిన్ని ప్రాబ్లమ్‌రా దేవా అంటాడు. మన ఇద్దరి పెళ్లిళ్లు ఒకే రోజు జరగడం సంతోషంగా ఉందిరా..అయినా ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయి మిథున గదిలోకి వచ్చేసినట్లే తాళి కూడా మిథునకు కట్టేయకురా అని జోక్ చేస్తాడు. ఒకవేళ మిథున మెడలో నువ్వు తాళి కట్టినా సరే నువ్వు కట్టిన తాళి తీసేసి నేను మిథున మెడలో తాళి కడతా అని అంటాడు.
రిషి దేవాని తీసుకెళ్లిపోతాడు. రిషి, దేవా కలిసి మిథున గదిలో నుంచి రావడం సూర్యకాంతం చూస్తుంది. వెంటనే భాను దగ్గరకు వెళ్లి విషయం చెప్పాలి అనుకుంటుంది. భాను చక్కగా రెడీ అయి మురిసిపోతూ ఉంటుంది. ఆగిపోయే పెళ్లికి హడావుడి ఎందుకు అని సూర్యకాంతం అంటుంది. ఏంటి అక్కా అపశకునం అని భాను అడుగుతుంది. నీకు ఆయన కావాల్సిన ఆయన.. ఆయన మాజీ భార్య దగ్గరకు వెళ్లి వచ్చాడని విషయం చెప్తుంది. కాసేపట్లో నా మెడలో తాళి కట్టబోతూ దాంతో మాట్లాడటానికి ఎంత ధైర్యం అని భాను వెళ్తుంది. భాను దేవా దగ్గరకు వెళ్లి ఇందాక ఎక్కడికి వెళ్లావని అంటుంది. నీకు ఎందుకు అని దేవా అంటాడు. కొంప తీసి ఆ వగలాడిని మళ్లీ చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















