Nindu Manasulu Serial Today December 27th: నిండు మనసులు: గణ మెడ పట్టుకొని గెంటేసిన సిద్ధూ! రంజిత్, ఐశ్వర్యలకు స్పెషల్ థ్యాంక్స్!
Nindu Manasulu Serial Today Episode December 27th గణని మంజుల అసహ్యించుకోవడం సిద్ధూ మెడ పట్టుకొని గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ తనకు ఏ తప్పు చేయలేదు అని కావాలనే ఇలా నా మీద నిందలు వేస్తున్నారని అంటాడు. దానికి ప్రేరణ అవునా అయితే నువ్వే తప్పు చేయలేదు అని కావాలనే ఇలా అంటున్నారు అని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు అని అంటుంది. గణ షాక్ అయిపోతాడు.
గణ మనసులో ఎలా అయినా తప్పించుకోవాలి తప్పడం లేదు.. క్షమించమ్మా అని ఈశ్వరి మీద ఒట్టు వేయడానికి వెళ్తాడు. దాంతో మంజుల ఒక్క సారిగా గణని లాగిపెట్టి కొడుతుంది. అత్తయ్యగారు అని గణ అంటే ఇంకోసారి అలా పిలిచావంటే చంపేస్తా అని అంటుంది. నువ్వు చేసిన పాపాలు నీ ముందే కనిపిస్తున్నా మీ అమ్మ మీద ఒట్టేయాలి అనుకున్నావంటే నువ్వు ఎంత నీచుడివో అర్థమవుతుంది. నీ మాటలు నమ్మి నువ్వు మంచోడివి నా కూతురి జీవితం బాగుంటుందని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నా.. ఎంత మోసగాడివిరా నువ్వు అని అంటుంది.
గణ మంజుల కాలి మీద పడి నేను సాహితిని ప్రేమిస్తున్నాను అంటాడు. ఒకమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని నమ్మించి తన ప్రాణాలు తీయాలి అనుకున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడివో అని అంటుంది. నా కొడుకు చెప్తున్నా వినకుండా నీతో పెళ్లి చేయాలి అనుకున్నా అలా చేసుంటే నేను చేసిన తప్పునకు నా కూతురి జీవితం నాశనం అయిపోయేది. అవసరం కోసం ఆడవాళ్లని వాడుకునే నీ లాంటి వాడు నా ఇంట్లో ఉండకూడదు పోరా బయటకు అని అంటుంది. దానికి సిద్ధూ అమ్మా వాడికి మాటలతో కాదు చేతలతో చెప్పాలి అని గణని లాక్కుంటూ వెళ్లి బయట గెంటేస్తాడు.
ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ గణకి వార్నింగ్ ఇస్తారు. ఆడవాళ్ల జీవితాలలో ఆడుకోవడం మానేయ్ అని ప్రేరణ అంటే ఇంకోసారి నా చెల్లితో మాట్లాడాలి అనుకున్నా తనని చూసినా చంపేస్తా అని సిద్ధూ అంటాడు. విజయానంద్ బయటకు అరవకుండా సౌండ్ రాకుండా అరిచి సంతోషపడతాడు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలిరా అని విశ్వాసంతో చెప్తాడు.
గణని ఈశ్వరి ఇంటికి వెళ్లిన తర్వాత లాగిపెట్టి కొడుతుంది. నీది ఒక జన్మేనారా.. నిన్ను కన్నందుకు నా పరువు నిలబెడతావు అంటే పరువు తీసేశావు.. అని తిడుతుంది. నలుగురిలో సిగ్గు విడిచి ఓ ఆడపిల్ల అలా చెప్పింది అంటే అది నిజమే.. అయినా నువ్వు కన్న తల్లిని కూడా మోసం చేస్తావా అని అంటుంది. ప్రేరణ నిజం నిరూపించింది ఇక తన ముందు ఎలా నేను తల ఎత్తుకొని తిరగాలిరా అని అంటుంది.
ఇందిర ప్రేరణ, సిద్ధూల నోరు తీపి చేస్తుంది. సిద్ధూ, ప్రేరణలు కలిసి ఐశ్వర్యకి కూడా థ్యాంక్స్ చెప్తారు. నా వల్ల నువ్వు చాలా అవమానాలు పడ్డావు ప్రేరణ అని సిద్ధూ అంటాడు. ఇక ఐశ్వర్య మా అక్క సాహితి కోసం అంత జాలి చూపించింది కానీ నాకు ఇంట్లో పనులు చెప్పి కష్టపెడుతుంది అని జోకులు వేస్తుంది. ఇక రంజిత్ రావడంతో అందరూ రంజిత్‌కి థ్యాంక్స్ చెప్తారు. ఈయన అక్కడికి వెళ్లడానికి కారణం కూడా అక్కే అమ్మా అని ఐశ్వర్య చెప్తుంది. అసలేం జరిగింది అని ఇందిర అడుగుతుంది. దానికి ప్రేరణ వర్ష గురించి తెలియగానే సిద్ధూకి చెప్తే గణ అలర్ట్ అయిపోతాడని సిద్ధూకి చెప్పలేదు.. ఆ టైంలోనే మన ఓనర్ గారు కనిపించారు.
ఫ్లాష్‌బ్యాక్‌లో గణని ఎదురించడం కష్టం అని రంజిత్ చెప్తాడు. అప్పుడు ప్రేరణ రంజిత్ సాయం అడుగుతుంది. రంజిత్ ఓకే అంటాడు. ఇద్దరం కలిసి వెళ్లొద్దు అని రంజిత్ చెప్పి తన వాచ్ ప్రేరణకి ఇచ్చి వాచ్‌కి ఫోన్ కనెక్ట్ అయిందని నువ్వు ఎక్కడున్నా నాకు తెలుస్తుందని అంటారు. అలా ప్రేరణ రంజిత్ కలిసి వర్షని కాపాడుతారు. సిద్ధూ ఇద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్తాడు. అసలు నువ్వు ఎందుకే కారు డిక్కీలో ఉన్నావని ఇందిర అడుగుతుంది. అక్క కంగారుగా మాట్లాడటం, అక్క ఓనర్ మాట్లాడుకోవడం చూశానని అక్క నాకు సాయం అడగకుండా ఓనర్ గారికి సాయం అడగడం నాకు నచ్చలేదు.. అందుకే నేను ఏంటో నిరూపించుకోవాలని డిక్కీలో దాక్కున్నానని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















