అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today December 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోయిన భాగీ – సీసీటీవీ ఫుటేజ్‌ చెక్‌ చేసిన అమర్‌

Nindu Noorella Saavasam serial Today Episode December 27th: భాగీ కోసం వెతికిన అమర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ చెక్‌ చేసి షాక్‌ అవుతాడు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: పంతులు చెప్పినట్టే ఇంట్లోంచి వెళ్లిపోవడానికి డిసైడ్‌ అయిన భాగీ పిల్లలకు దగ్గరకు వెళ్లి జాగ్రత్తలు చెప్తుంది. డోర్ దగ్గర నిలబడి భాగీ మాటలు వింటున్న చంభా, మనోహరి నవ్వుకుంటారు.

మనోహరి: చంభా, భాగీ బాగానే భయపడుతున్నట్టు ఉంది

చంభా: మరి నువ్వు చెప్పింది పంతులు గారు పొల్లు పోకుండా చెప్పారు

అమ్ము:  మా అమ్మ పోయాక మమ్మల్ని అమ్మలా చూసుకున్నావు మిస్సమ్మ.. ఇప్పుడు అమ్మ కూడా బుజ్జమ్మలా తిరిగి వచ్చింది. మీరు ఇద్దరూ ఉంటే మాకు ఆ దేవుడు కూడా అక్కర లేదు

మనోహరి: ( మనసులో) భాగీ నీతో ఉండదే.. నీ మాటలతో దాని గుండె పగిలిపోతుంది

అంజు: అవును మిస్సమ్మ ఆ దేవుడైనా అడిగితేనే వరం ఇస్తాడు. కానీ నువ్వు మేము అడక్క ముందే మాకు ఏం కావాలో ఇస్తావు

ఆనంద్‌:  మా కోసం అమ్మవు అయ్యావు మిస్సమ్మ.. ఆఖరికి మా అమ్మను కూడా బుజ్జమ్మ రూపంలోనే మాకు తిరిగి ఇచ్చావు

ఆకాష్‌: నీలా ఎవ్వరూ చేయలేరు మిస్సమ్మ.. నువ్వు ఎప్పుడూ మా పక్కనే ఉండాలి

మనోహరి: ఈ పిల్లల కోడి రేపు ఒంటరి కోడి అవ్వనుంది చంభా

చంభా:  లేకపోతే ఆ కోడిపిల్లలను గద్ద ఎత్తుకుపోతుంది

హాల్లో కూర్చుని పాపను ఎత్తుకుని ఉన్న ప్రేమగా చూస్తుంటాడు అమర్‌.

అమర్‌: ( మనసులో) ఇది వరకు నీకు పిల్లలకు ఏది కావాలన్నా నన్ను భయపడుతూ అడిగేదానివి.. ఇప్పుడు ఈ నాన్న నువ్వు ఏది అడిగినా కాదనడు

భాగీ: రేపటి నుంచి మీరు అల్లరి చేయకూడదు. మీ నాన్న చెప్పిన మాటలు వినాలి. మీరు గొడవలు పడకూడదు.. మీరంతా కలిసి ఒకటిగా ఉండాలి. టైంకు తిని నిద్రపోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి

అమ్ము:  ఎవరికి చెప్తున్నావు మిస్సమ్మ ఇదంతా

భాగీ: మీకే చెప్తున్నాను.. మీ అందరికీ చెప్తున్నాను

అంజు:  అదేంటి..? అప్పగింతలులా చెప్తున్నావు..

ఆనంద్‌: నువ్వు మాతోనే ఉంటావు గా మిస్సమ్మ మళ్లీ ఇవవ్నీ చెప్పడం ఎందుకు..?

మనోహరి: చంభా, భాగీ స్వరం చూస్తుంటే.. ఈ నైటే జంప్‌ అయ్యేలా ఉంది..?

చంభా: అవును పంతులు గారు వీలైనంత త్వరగా ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోమ్మని చెప్పారు కదా..

ఆకాష్‌: చెప్పు మిస్సమ్మ ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నావు.. ఏదో సెండాఫ్‌ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి..?

భాగీ: సెండాఫ్‌ కాదు నేను బుజ్జమ్మతో బిజీగా ఉంటాను కదా అందుకే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేనని చెప్తున్నాను అంతే..

అమ్ము: నువ్వు మమ్మల్ని చూసుకోవడం ఏంటి మిస్సమ్మ ఇక నుంచి మేమే నిన్ను చూసుకుంటాము

అంజు: నీ బాధ్యత, బుజ్జమ్మ బాధ్యత మాదే అని మేము ఎప్పుడో డిసైడ్‌ అయిపోయాము

ఆనంద్: అవును మిస్సమ్మ ఇన్నాళ్లు నువ్వు మమ్మల్ని ఎలా చూసుకున్నావో నిన్ను బుజ్జమ్మను మేము అలాగే చూసుకుంటాము

ఆకాష్‌: నీ పనులు బుజ్జమ్మ పనులు అన్ని మేమే చూసుకుంటాము..

అమ్ము: నీ విలువ తెలియక నీకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నాము మిస్సమ్మ. నిన్ను అనరాని మాటలు అన్నాము మమ్మల్ని క్షమించు

అని అమ్ము ఏడుస్తుంది. భాగీ అమ్మును ఓదార్చి బయటకు వెల్లిపోతుంది. తర్వాత రాత్రికి అందరూ నిద్రపోయాక భాగీ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. పొద్దున్నే నిద్ర లేచిన అమర్‌, భాగీ కోసం వెతుకుతాడు. అందరినీ పిలిచి ఆరా తీస్తాడు. ఎవ్వరూ చూడలేని చెప్పగానే.. రాథోడ్‌ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్‌ చేయమంటాడు. ఫుటేజీలో భాగీ ఇల్లు వదిలి వెళ్లిపోతున్న వీడియో చూసి అమర్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget