Nuvvunte Naa Jathaga Serial Today August 6th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా మాటలకు ఆలోచనలో జడ్జి.. మామ మనసు గెలుచుకున్నాడా? దేవాకి ఆ శిక్ష ఎందుకు?
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 6th హరివర్ధన్, దేవా కలిసి గేమ్ ఆడటం దేవా కావాలనే ఓడిపోయిన విషయం జడ్జికి అర్థమవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తండ్రితో కలిసి సెటిల్ ఆడుతుంటుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ మిథున, హరివర్ధన్ ఆట చూస్తుంటారు. ఇంతలో దేవా బయటకు వస్తాడు. అలంకృత చూసి బావ ఏంటి ఇక్కడ ఉండిపోయారు.. కొత్త పెళ్లి కొడుకులా ఇక్కడే ఉండిపోయారు ఏంటి రండి అని అంటుంది. పర్లేదులే వద్దు అని దేవా అంటే ఫ్రీనే బావ డబ్బు కట్టి చూడక్కర్లేదు అని దేవాని తీసుకెళ్తుంది.
దేవాని చూసి హరివర్ధన్ ఆగిపోతాడు. మిథున మనసులో నీకు మా నాన్నకి పరిచయం ఏర్పడటానికి ఇదేం మంచి టైం అనుకుంటూ కాసేపు ఆడి కాలు బెనికినట్లు నటిస్తుంది. హరివర్ధన్‌తో పాటు అందరూ టెన్షన్ పడిపోతారు. హాస్పిటల్‌కి వెళ్దామని హరివర్ధన్ అంటే వద్దని మిథున అంటుంది. ఇక అలంకృత మ్యాచ్ ఆగిపోయినట్లేనా అని అడుగుతుంది. ఎందుకు ఆపేయడం నా తరఫున మా ఆయన ఆడుతాడు.. నన్ను గెలిపిస్తాడు అని మిథున అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మిథున బ్యాట్ తీసుకెళ్లి తండ్రి భర్తకి ఇస్తుంది.
హరివర్ధన్ రాకెట్ విసిరేస్తాడు. వాడితో నేను ఆడటం ఏంటి నాన్‌సెన్స్ అంటే మానాన్న దేనికి భయపడరు కానీ మొదటి సారి భయపడుతున్నారని అంటుంది. నేను వాడికి భయపడటం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ వాడితో ఆడటం ఇష్టం లేక వెళ్లిపోతున్నా అని జడ్జి అంటారు. చూసేవాళ్లకి మీరు భయంతో వెళ్లిపోతున్నట్లు ఉందని మిథున అంటుంది. మిథున ప్లాన్ అర్థమయ్యి లలిత కూడా నిజమే అంటుంది. అందరికీ విషయం తెలిసిపోతే బాగోదు నాన్న అని మిథున అంటే అలంకృత కూడా అలాగే అంటుంది. ఇంతలో త్రిపుర, రాహుల్‌లో మీకు నచ్చని ప్లేయర్ అయితే ఆట మధ్యలో వెళ్లిపోరు కదా.. మీ గెలుపుతో వార్నింగ్ ఇవ్వండి.. ఈ విషయంలో కూడా ఓటమి తప్పదు అని అర్థమయ్యలా చేయండి అంటారు.
హరివర్ధన్ బ్యాట్ పట్టుకొని నేను రెడీ అంటాడు. దేవాని మిథున ఆడమని అంటే ఇవన్నీ నాకు తెలీవు అని దేవా అంటే ఓటమి భయం అని రాహుల్ అంటాడు. దేవా ఆడను అంటే మిథున వెళ్లి నా కోసం నన్ను గెలిపించడానికి ఆడు అని చెప్తుంది. దేవా బ్యాట్ తీసుకుంటాడు. అలంకృత అక్కతో ఏది ఏమైనా బావకి నువ్వు అంటే చాలా లవ్ అక్క నన్ను గెలిపించు నా కోసం అని నువ్వు అనగానే బ్యాట్ తీసుకున్నాడు అని అంటుంది. ఇద్దరూ బ్యాట్స్ తీసుకొని నేను రెడీ అంటే నేను రెడీ అని ఆట స్టార్ట్ చేస్తారు. ఇద్దరూ హోరా హోరీగా ఆడుతారు. హరివర్ధన్ ఓడిపోయేలా ఉన్నాడని రాహుల్, త్రిపుర అనుకుంటారు.
అలంకృత మిథునతో ఒక వైపు మీ ఆయన, మరోవైపు నాన్న ఎవరు గెలవాలి అనుకుంటున్నావ్ అంటుంది. ఇక ఇద్దరూ హోరాహోరీ ఆడి సమానంగా పాయింట్స్ తెచ్చుకుంటారు. లాస్ట్ పాయింట్ ఎవరికి వస్తుందా అనుకునే టైంలో దేవా అవుట్ అయిపోతాడు. హరివర్ధన్ ఎగిరి గంతులేస్తాడు. అందరూ సంబర పడతారు. హరివర్ధన్ దేవాని చూసి వాడికి భయపడి నేను వెళ్లిపోతున్నా అన్నారు ఇప్పుడేమంటారు.. ఈ ఆటలోనే కాదు తర్వాత ఛాలెంజ్‌లో కూడా నేను గెలుస్తా అంటారు.
మిథున దేవా దగ్గర వెళ్లి ఎందుకు కావాలని ఓడిపోయావ్ అని అడుగుతుంది. అలా ఎందుకు ఓడిపోతాను అని దేవా అంటే నేను చూశా దేవా ఎందుకు ఓడిపోయావ్ చెప్పు అంటే సంతోషంగా ఉన్న హరివర్ధన్ వాళ్లని చూపించి ఇందుకోసం.. మీ నాన్న ఓడిపోయి ఉంటే వాళ్లంతా బాధ పడవాళ్లు నలుగురిని సంతోష పెట్టడం కోసం ఓడిపోవడం కూడా గెలుపే అవుతుంది అని దేవా అంటాడు. మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దేవా మాటలు హరివర్ధన్ వింటాడు. మిథున మనసులో మా నాన్నతో కలిసి పోవాలి అని నేను నిన్ను ఆడమన్నాను దేవా కానీ నువ్వు మా నాన్న మనసు గెలుచుకునేలా ఆడావని అనుకుంటుంది.
త్రిపుర, రాహుల్ కోపంగా లోపలికి వెళ్లిపోతారు. ఆ రౌడీని మామయ్య గారుతో కలపాలి అనే మిథున ఇలా ప్లాన్ చేసింది. మామయ్య గారి మనసు మారిపోతుంది.. ఈ రెండు మూడు రోజుల్లో మార్చేస్తుంది. మిథున కోటలా ఉంటూ వాడిని కాపాడుతుంది. మీ నాన్న వాడిని మామయ్య అర్థం చేసుకునేలా చేస్తుంది అందుకు యుద్ధం చేయడానికి మిథున రెడీగా ఉంది. ఇందుకు వాడి ఇంట్లో సునామి సృష్టిస్తే వాడు ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు మిథున వాడు దూరం అవుతారు అంటుంది. ఆ ఇంట్లో ఎలాంటి సునామి సృష్టిద్దాం అని రాహుల్ అడుగుతాడు.
మిథున వాటర్ బాటిల్ తీసుకొని దేవా దగ్గరకు వెళ్లే సరికి దేవా నేల మీద పడుకోవడం చూసి చాలా బాధ పడుతుంది. దేవా పక్కనే కూర్చొని కన్నీరు పెట్టుకుంటుంది. దేవాని లేపి కింద పడుకున్నావేంటి పైన పడుకో అని అంటుంది. కింద పడుకుంటే ఏం అవుతుంది అని దేవా అంటే.. నువ్వు నా భర్త దేవా నువ్వు నా పుట్టింట్లో ఉన్నంత వరకు నిన్ను మర్యాదలో ఒక చిన్న పొరపాటు జరిగినా.. అవమానం జరిగినా నీ భార్యగా నేను ఓడిపోయినట్లే ఇక్కడున్నంతకాలం నువ్వు ఇబ్బంది పడకుండా హాయిగా ఉండాలి పద బెడ్ మీద పడుకో అంటుంది.
దేవా మిథునతో నేను నేల మీద పడుకుంటే నీకు బాధేస్తుంది అంటున్నావ్.. కానీ నేను నీకు ఎంత ఇబ్బంది పెట్టానో తెలుసుకుంటున్నాను. నిన్ను అందరూ నీకు యువరాణిలా చూసుకుంటున్నారు. కానీ మా ఇంట్లో కటిక నేల మీద ఫ్యాన్ కూడా లేకుండా తిండి లేకుండా నువ్వు చూసిన పడిన బాధల కంటే ఇది ఎక్కువా అని అడుగుతాడు. కొన్ని తప్పులకు క్షమాపణ చెప్పడం కరెక్ట్ కొన్ని తప్పులకు మనకు మనం శిక్షించుకోవడం కరెక్ట్ ఈ శిక్ష నాకు కరెక్ట్.. నువ్వు బాధ పడుతూ నన్ను బాధ పెట్టకు దేవా అని మిథున అంటుంది. ఇది నాకు ఇష్టమైన శిక్ష నన్ను పశ్చాత్తాపడనివ్వు మిథున పర్లేదు వెళ్లు అని మిథునని పంపేస్తాడు.
మిథున వెళ్లి మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తుంది. దేవా మిథున చిన్న నాటి ఫొటో పట్టుకొని అది చూస్తూ ఆలోచిస్తుంటాడు. మరోవైపు హరివర్ధన్ గేమ్ దగ్గర దేవా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. మిథున తండ్రి దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడుకొంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు ఎందుకు పడుకోలేదని అడుగుతారు. మన ఆలోచనలు ఒకే విషయం మీద ఉన్నాయి నాన్న. ఎలా అయినా గెలవాలి అని నేను ఎలా గెలుస్తుందా అని మీరు అలుపెరగని యుద్ధం చేస్తున్నాం నాన్న. ఒక మనిషి గురించి తెలుసుకోవాలి అంటే ఏళ్లు వెయిట్ చేయాల్సిన పని లేదు నాన్న కొన్ని పరిస్థితులు చాలు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















