Nuvvunte Naa Jathaga Serial Today August 5th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున ఎగిరి గంతేసేలా దేవా ఏం చెప్పాడు? ఆదిత్యలో ఆవేశం పెంచిన సీన్ ఏంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 5th మిథునకు దేవా సారీ చెప్పడం మిథున సంతోషంతో దేవాని హగ్ చేసుకోవడం ఆదిత్య చూసి పగ పెంచుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచించి బాధ పడుతుంటే దేవా మిథునతో నా మీద కోపంగా ఉందా అని అడుగుతాడు. దానికి మిథున నా భర్త గురించి బాధగా ఉంది. నా భర్త మాటలు పడుతుంటే అవమానం పడుతుంటే బాధగా ఉంది.. నా భర్త అందరి ముందు తలదించుకుంటుంటే ఆ బాధ నరకంగా ఉంది దేవా అని మిథున అంటుంది. మిథున మాటలకు దేవా బాధగా చూస్తాడు.
మిథున: దేవా నీ అలవాటు మార్చుకోమని నేను అనను కానీ నా బాధ ఒక్కటే ఎవరికీ తెలీని నాకు మాత్రమే తెలిసే మంచిని అందరికీ నిరూపిస్తా అని చెప్పాను..నువ్వు ఇలా మందు తాగి వస్తే అందరూ నిన్ను తప్పుగా అంటే ఎలా తట్టుకోగలను చెప్పు. నిన్ను రాత్రి అందరూ అన్ని మాటలు అంటే నేను ఏడుస్తూనే ఉన్నా.. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నా. నువ్వు బాధ పడితే నాకు బాధ దేవా.. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్లే. నాకు మా నాన్న నువ్వు ఒకటే దేవా.. నిజం చెప్పాలి అంటే మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో జీవితాంతం కలిసి బతకాల్సిన నువ్వు అంటే అంత కంటే ఎక్కువే ఇష్టం దేవా. అలాంటి నువ్వు మా నాన్న దృష్టిలో ఆకాశమంత ఎత్తులో ఉండాలి తప్ప ఇలా కాదు. నీతో జీవితాంతం బతకడానికి నేను జీవన్మరణ పోరాటం చేస్తున్నా. మా నాన్నతో చేసిన ఛాలెంజ్‌లో నువ్వు నన్ను గెలిపిస్తావన్న నమ్మకం నాకు ఉంది. దయచేసి నా తాళి విలువ తగ్గేలా చేయకు దేవా అని బాధ పడుతుంది.
దేవా మిథున కోసం సారీ అని ఓ ఆకు మీద రాసి మిథునకు కనిపించేలా పెడతాడు. మిథున అది చూసి చాలా సంతోషడుతుంది. దేవా నువ్వు నాకు సారీ చెప్పావా.. నువ్వు సారీ చెప్పావా.. నేను బాధ పడినా పట్టించుకోని నువ్వు నాకు సారీ చెప్పావా నువ్వు మారిపోయావ్ దేవా నన్ను గెలిపించావ్ అని సంతోషంతో దేవాని హగ్ చేసుకుంటుంది. దేవా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు.
మిథున దేవాని హగ్ చేసుకోవడం ఆదిత్య చూస్తాడు. కోపంతో రగిలిపోతాడు. ఇక మిథున సంతోషంతో ఏం మాట్లాడకుండా పరుగులు తీస్తుంది. సంతోషంగా దేవా గురించి ఆలోచించుకుంటూ పరుగెడుతుంది. ఆదిత్య దేవాని కోపంగా చూస్తాడు. తర్వాత మిథున ఓ చోట ఆగితే ఆదిత్య అక్కడికి వెళ్తాడు. మిథున ఆదిత్యతో చాలా సంతోషంగా ఉంది ఆదిత్య చాలా చాలా ఇంత సంతోషం నాకు ఎప్పుడూ లేదు.. ఈ సంతోషానికి కారణం దేవా.. దేవా నాకు సారీ చెప్పాడు. దేవా ఎవరికీ సారీ చెప్పడు అందులోనే తన తప్పు లేకుండా మొదటి సారి నాకు సారీ చెప్పాడు అని మిథున చాలా సంబర పడిపోతుంది. ఆదిత్య లోలోపల రగిలిపోతూనే పైకి నవ్వుతాడు. మిథున ఆదిత్యతో దేవాకి నేను అంటే ఎంత ప్రేమ లేకపోతే అలా సారీ చెప్తాడు. దేవాలో మార్పు కనిపిస్తుంది ఆదిత్య నాన్న ముందు దేవా మంచితనం నిరూపిస్తాను.. చాలా చాలా త్వరలోనే నేను గెలుస్తాను. దేవా కంటే మంచోడు ఈ భూమ్మీద ఉండడు అని నిరూపిస్తా.. నాన్న దేవాని అల్లుడిగా అంగీకరిస్తారు. మమల్ని దీవిస్తారు అని మిథున చెప్పగానే ఆదిత్య ఆల్‌దిబెస్ట్ చెప్తాడు.
మరోవైపు కాంతం మామ ఇళ్లు అమ్మడానికి ఒప్పుకోలేదని బ్యాగ్ సర్దేసి వెళ్లిపోతానని రంగంతో చెప్తుంది. రంగం పెళ్లాన్ని బతిమాలి తండ్రితోనే ఇళ్లు అమ్మించే ప్లాన్ ఉందని సూర్యకాంతానికి చెప్తాడు. పగ పెడితే ఎవరూ లొంగరు కానీ పొగ పెడితే లొంగిపోతారని అంటాడు. భర్త ప్లాన్ అదుర్స్ అని సూర్యకాంతం పొగుడేస్తుంది. మరోవైపు ఆనంద్, ప్రమోదినిలు బాధ పడతారు. ఇళ్లు అమ్మేయాలని రంగం నాన్నని బాధ పెట్టాడని అనుకుంటారు.
ఆదిత్య రోడ్డు మీదకు వెళ్లి కోపంతో రగిలిపోతాడు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా.. నువ్వు నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకున్నా అలాంటిది నువ్వు ఆ దేవాని హగ్ చేసుకుంటే నా రక్తం మరిగిపోయింది ఆ దేవాని చంపేయాలి అనిపించింది.. నువ్వు నా భార్యవి మిథున విధ్వంసం సృష్టించి అయినా సరే నిన్ను నాభార్యని చేసుకుంటా. మీనాన్న దగ్గర దేవా మంచివాడని నిరూపిస్తావా మిమల్ని విడగొట్టడానికి నేను సుడిగుండంలా మీ నాన్న దగ్గర నుంచి నరుక్కొస్తా అనుకుంటాడు. రాత్రి మిథున ఇంటి దగ్గర మిథున, హరివర్ధన్ సెటిల్ ఆడటానికి రెడీ అవుతారు. చాలా రోజుల తర్వాత ఇలా ఆడుతున్నారని లలిత అంటే మిథున చూశావా చాలా రోజుల తర్వాత మీ నాన్న ముఖంలో సంతోషం ఉంది. నువ్వు దాన్ని దూరం చేశావని త్రిపుర అంటుంది. ఆ రోజులు మళ్లీ వచ్చేస్తాయిలే అని హరివర్ధన్ అంటారు. ఇక ఇద్దరూ ఆడుతారు. అందరూ క్లాప్స్ కొడతారు. దేవా కూడా వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















