Nuvvunte Naa Jathaga Serial Today August 25th: నువ్వుంటే నా జతగా సీరియల్: జడ్జి నిర్ణయాన్ని అడ్డుకున్న దేవా.. మనసులో మాటలు చెప్తూ ఎమోషనల్..!
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 25th హరివర్ధన్ దేవాని అల్లుడిగా అంగీకరిస్తానని లలితతో చెప్పడం దేవా అందరి ముందు తన మనసులో మాటలు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథునకు అందరి ముందు ప్రపోజ్ చేస్తానని అనుకుంటాడు. ఇక దేవాని చంపడానికి సీరియల్ కిల్లర్ ఫంక్షన్‌కి వస్తాడు. ఆదిత్య కోపంగా ఆ దేవాని చంపించబోతున్నా.. మిథున నాకు మాత్రమే భార్య.. నా భార్య జీవితంలోకి ఆ దేవా వస్తానంటే చూస్తూ ఊరుకుంటానా.. వాడిని చంపేస్తా అని అనుకుంటాడు.
హరివర్దన్ దేవా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లలిత భర్త దగ్గరకు వచ్చి దేవా గురించే ఆలోచిస్తున్నారు కదా ఈ రోజు మీరు మిథునకు చెప్పాల్సిన నిర్ణయానికి చివరి రోజు. పిల్లల్ని కన్నాం కదా అని శాసించే అధికారం మనకు ఉండదు కదండీ.. పిల్లల ఇష్టాలను మనం గౌరవించాలి. మిథున దేవాని కోరుకుంటుంది. దేవా కూడా మిథునని భార్యగా అంగీకరించాడు. ఇప్పుడు మనందరం సంతోషంగా ఉండటం మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది మీ నిర్ణయం ఏంటి అని అడుగుతుంది. ఒక రౌడీ చేతిలో నా కూతురి జీవితం పెట్టడానికి నాకు చాలా భయం వేస్తుంది కానీ దేవా మన అలంకృత జీవితం కాపాడటమే కాకుండా ఆడ పిల్ల కోసం తన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. తన మంచితనాన్ని తానే నిరూపించుకున్నాడు.. అందుకే దేవాని అల్లుడిగా అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. లలిత చాలా చాలా సంతోషపడుతుంది. మిథునకు ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తుందని అంటుంది. అందరి ముందు ఈ విషయం చెప్తానని హరివర్ధన్ అంటారు.
ఆదిత్య కిల్లర్‌కి కాల్ చేసి స్పాట్‌లోనే దేవా ప్రాణం పోవాలని చెప్తాడు. ఇక పార్టీలో జ్యూస్‌లు తాగుతూ శ్రీరంగం ఎంజాయ్ చేస్తుంటే హడావుడిగా సూర్యకాంతం వచ్చి మనం ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అడుగుతున్నామని ఆ త్రిపుర మనల్ని చంపడానికి సీరియల్ కిల్లర్‌ని రప్పించిదని పెద్ద గన్ కూడా చూశానని అంటుంది. దానికి రంగం సరిగ్గా పెద్ద పిల్లిని నీ మీదకు విసిరితే భయంతో చస్తా నీ కోసం ఎందుకు అంత ప్లాన్ చేస్తారు. పైగా మనం అడిగిన 5, 10 లక్షల కోసం 50 లక్షలు ఖర్చు పెట్టి సీరియల్ కిల్లర్‌ని పిలిపించిందా.. నీకు ఏమైనా కోతి కరిచేసిందా అని వెళ్లిపోతాడు. ఈ విషయం ఎవరో ఒకరికి చెప్పాలని కాంతం పరుగులు తీస్తుంది.
హరివర్ధన్ అందరి ముందు మాట్లాడుతూ ఈ భర్త్‌డే నా కూతురికి చాలా చాలా స్పెషల్.. తన జీవితంలోకి ఒక అద్భుతం అడుగుపెట్టబోతున్నరోజు అని అంటారు. నా కూతుర్ని అపురూపంగా పెంచుకున్నా. యువరాణి లాంటి తనని యువరాజు లాంటి అన్నీ ఉన్న అబ్బాయికి ఇవ్వాలి అనుకున్నా అని చెప్తూ దేవా బలవంతంగా తాళి కట్టి నా కూతురి జీవితం నాశనం అయిందని చెప్తారు. దేవా కోసం తనకు తన కూతురికి మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగిందని.. ఈ యుద్ధానికి నా నిర్ణయంతో ముగింపు చెప్తున్నానని తన నిర్ణయం చెప్పే టైంకి దేవా ఆపుతాడు. 5 నిమిషాలు మాట్లాడాలని పర్మిషన్ అడుగుతాడు.
మరోవైపు కాంతం ఆదిత్య దగ్గరకు వెళ్లి వకీల్‌సాబ్ అంటూ సీరియల్ కిల్లర్ తనని చంపాడనికి వచ్చారని చెప్తుంది. ఆదిత్య షాక్ అయిపోతాడు. కవర్ చేయడానికి అతను కిల్లర్ కాదు నిన్ను చంపడానికి రాలేదు అతను జడ్జి గారి సెక్యూరిటీ కోసం వచ్చారని అంటాడు. కిల్లర్ గెటప్ ఏంటి అని కాంతం అడిగితే ఎవరికీ డౌట్ రాకుండా అలా వచ్చారని నీ అంత మంచి దాన్ని చంపడానికి ఎవరైనా వస్తారా అని ఆదిత్య చెప్పడంతో కాంతం నమ్మేస్తుంది.
దేవా ముందు మాట్లాడుతాడు. మిథున నేను ఊహించకుండా నా జీవితంలోకి వచ్చిన పేరు ఇది.. ప్రతీ క్షణం నన్ను వెంటాడని పేరు. నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసిన పేరు. నేను ఓ రౌడీని. నేను అంటే కొంత మందికి భయం. కొంత మందికి కోపం. కొంత మందికి అసహ్యం. కనిపెంచిన వాళ్లకి బాధ. గత కొన్నేళ్లుగా అదే నా ప్రపంచం. ప్రేమ, బంధాలు అన్నీ చచ్చిపోయావి. నా లైఫ్‌కి గ్యారెంట్ లేదు కాబట్టి నన్ను నేనే చంపేసుకున్నా. అన్నీ చంపేసుకున్న నా జీవితంలోకి బలవంతంగా కట్టిన తాళితో వచ్చింది మిథున.. చీదించుకున్నా..అసహ్యించుకున్నా. అవమానించా.. మాటలతో హిసించా.. భరించరాని బాధ పెట్టాను.. అన్నీ భరిస్తూ చావు అయినా బతకు అయినా నీతోనే అని చెప్పింది. కోరినది క్షణాల్లో ఎదురుగా తెచ్చిపెట్టే తల్లిదండ్రుల్ని విలాసాలను వదిలేసి వచ్చేసింది. ప్రసాదం తినింది.. కన్నీటితో కడుపునింపుకుంది. నమ్మిన బంధం కోసం ఇంతలా భరిస్తారా.. ఆఖరికి కన్న వారిని కూడా వదిలేసి వచ్చేంత త్యాగం చేస్తారా అని ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు నాకు నచ్చినట్లు నేను ఉండే వాడిని కానీ నన్ను పూర్తిగా మార్చేసింది మిథున. బతకడం అంటే ఎదుటి వారు సంతోషపడేలా బతకాలని తెలిసేలా చేసింది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















