Nuvvunte Naa Jathaga Serial Today April 16th: నువ్వుంటే నా జతగా సీరియల్: కన్నవాళ్ల కోసం కష్టపడు.. ఒక్క రోజు కూలీ చేసి చూడు.. మిధున వల్ల దేవాలో మార్పు!
Nuvvunte Naa Jathaga Today Episode దేవా తీసుకొచ్చిన బట్టలు సత్యమూర్తి విసిరికొట్టడం కూలీ చేసి అయినా నీ సంపాదనతో బట్టలు కొనమని మిధున దేవాతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి ఇంటికి వచ్చి శారదకు బ్యాగ్ అందించి నువ్వు చెప్పినవన్నీ తెచ్చానో లేదో చూసుకో అని అంటాడు. ఇంతలో రంగం వచ్చి తల్లిదండ్రుల్ని కూర్చొపెట్టి మీ పెళ్లి రోజుకు రకరకాల బెలూన్స్ డెకరేషన్ చేస్తా.. పేపర్లు ఎగరేస్తా అని చెప్తూ ఉంటాడు. అది విన్న ప్రమోదిని భర్తతో మీ తమ్ముడు మీ అమ్మానాన్న పెళ్లి రోజుని ఎంత బాగా చేయాలని ప్లాన్ చేశాడో కదండీ మన దగ్గర డబ్బులు ఉంటే మనం కూడా అలాగే చేసేవాళ్లం కదా అని అంటుంది. మీరు ఎలాగూ ఉద్యోగానికి వెళ్తున్నారు కదా వచ్చే పెళ్లి రోజుకి మనం గ్రాండ్‌గా చేద్దామని అంటుంది.
మీ జేబులో డబ్బులు ఇస్తే సెలబ్రేట్ చేస్తా..
రంగం నాన్నతో నాన్న గారు మీ జేబులో 3 వేలు తీసి ఇవ్వండి నేను చెప్పినవన్నీ చేసేస్తా అంటాడు. దాంతో సత్యమూర్తి నీ రియలిస్టేట్ తెలివి నా దగ్గర వాడకు. పెళ్లి రోజు చేసుకోవాలన్న ఆశ నాకు లేదు అంత డబ్బు లేదు అని అంటారు. శారదతో ఎప్పటిలా పొద్దునే గుడికి వెళ్లి వద్దాం అని చెప్తారు. శారద సరే అంటుంది.
తల్లిదండ్రులకు బట్టలు తెచ్చిన దేవా..
ఇంతలో దేవా తల్లిదండ్రుల కోసం బట్టలు తీసుకొస్తాడు. అది చూసిన మిధున చాలా సంతోష పడుతుంది. దేవా చేతిలో బ్యాగ్‌లు చూసి కాంతం, రంగం కరెంట్ షాక్ కొట్టినట్లు గిలగిలా అయిపోతారు. దేవా అమ్మానాన్నల దగ్గర కూర్చొని అమ్మా నాకు నీ అమ్మానాన్నల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి అని అంటాడు. కన్నవాళ్లగా మా ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉంటుంది అని శారద అంటుంది. దాంతో దేవా అమ్మ నేను ఎంతో సంతోషంతో నీకు నాన్నకి బట్టలు తీసుకొచ్చా మీరు కట్టుకుంటే నాకు ఎంతో సంతోషం అని అంటాడు. శారద చాలా సంతోష పడుతుంది. బట్టలు చూపించమని రంగం అడుగుతాడు. దేవా చూపించడంతో కంచిపట్టు చీర అని కాంతం నోరెళ్ల బెడుతుంది. అమ్మా నాన్నబట్టలు ఎలా ఉన్నాయి అంటాడు.
బట్టలు విసిరి కొట్టిన సత్యమూర్తి..
దేవా వదినకు తాంబూలం పల్లెం తీసుకురమ్మని అందులో బట్టలు పెట్టి ఇస్తాడు. శారద చాలా సంతోష పడుతుంది. రేపు ఈ బట్టలు కట్టుకోండి అని చెప్తాడు. నాన్నని కూడా తీసుకోమని అంటాడు. నేను సంతోషంగా తీసుకోవడానికి నువ్వు నీ రక్తం చిందించిన డబ్బుతో తీసుకురాలేదు ఎంతో మంది రక్తంతో సంపాదించిన డబ్బుతో తీసుకొచ్చావని అంటాడు. అమ్మ సంతోషం కోసం అయినా తీసుకో నాన్న అంటాడు. సత్యమూర్తి తీసుకోవడంతో దేవా ఆనంద్ పడతాడు. కానీ సత్యమూర్తి వాటిని నేలకేసి విసిరి కొడతాడు.
చిరిగిపోయిన బట్టలతోనే ఉంటాం..
మీ అమ్మ సంతోషం కోసం తీసుకోమంటావా.. పాపపు సొమ్ముతో కొన్న ఈ బట్టలు నా భార్య కోసం నేను ఎలా తీసుకుంటాను అనుకున్నావ్‌రా. అవసరం అయితే చిరిగిన బట్టలతో ఉంటా కానీ నీ పాపం సొమ్ముతో తీసుకొచ్చిన డబ్బుతో తీసుకోనురా. నీ కష్టంతో ఒక రుమాలు కొనివ్వు అందులో సంతోషం ఉంటుంది అని ఛీ కొట్టి వెళ్లిపోతారు. దేవా చాలా బాధ పడతాడు. కన్నీరు పెట్టుకుంటాడు.
మీ నాన్న కోపం నీకు అర్థం కాలేదు..
రాత్రి కూడా దేవా బాధపడుతుంటే మిధున నీరు తీసుకెళ్లి ఇస్తుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని దేవా అంటాడు. అందరి ముందు నన్ను అవమానిస్తే నువ్వు సంతోషపడతాడు కదా చాలా ఇప్పుడు నీకు అంటాడు. మా నాన్నతో తిట్టించాలి అన్నదే నీ ఆలోచన అంటాడు. నేను చెప్పిన విధానం నీకు అర్థం కాలేదు.. మీ నాన్న కోపం కూడా నీకు అర్థం కాలేదు అని అంటుంది మిధున. నీ బాధకి మీ అమ్మానాన్నల సంతోషానికి నీ దగ్గరే సమాధానం ఉంది. నీ కష్టార్జితంతో బట్టలు తీసుకొనిరా అప్పుడు బట్టలు ఇవ్వు. మీ నాన్న తీసుకోకపోయినా మీ అమ్మ సంతోషంగా తీసుకుంటుంది అని చెప్తుంది.
మీ కన్నవాళ్ల కోసం కష్టపడు..
దేవా మిధునతో నీకు పిచ్చా పురుషోత్తం అన్న ఇవ్వకుండా నేను ఎలా సంపాదిస్తాను అని అంటాడు. పురుషోత్తం అన్న ఇస్తేనే నీ దగ్గర డబ్బులు ఉంటాయా నీకు కష్టపడి సంపాదించడం తెలీదా. నువ్వు కష్టపడి ఒక రెండు వేలు సంపాదించు అంటుంది. ఒక్క రోజులో రెండు వేలు ఎవరు ఇస్తారు అంటాడు. దాంతో మిధున మనసు ఉంటే మార్గం ఉంటుంది వెతికితే ఏదో ఒక పని దొరుకుతుంది అని అంటుంది. మీ అమ్మానాన్నలకు బట్టలు ఇచ్చి సంతోషపరచాలి అని ఉంటే కూలి పని అయినా నువ్వు చేస్తావని అంటుంది. ఆ పురుషోత్తం కోసం దెబ్బలు కూడా తింటావ్ మీ అమ్మానాన్న కోసం కష్టపడలేవా. వాళ్లకి బట్టలు కొని ఇవ్వు అప్పుడు ఆ సంతోషం చూడు కోట్లు ఖర్చుపెట్టినా నీకు దొరకదు అని చెప్తుంది.
కూలీ కోసం దేవా ఆరాటం..
దేవా ఆలోచనలో పడతాడు. విషయం తెలిసి తన ఫ్రెండ్స్ పెద్దగా నవ్వుతారు. దేవా మీద సెటైర్లు వేస్తారు. మంచి జోక్ వేశావ్ అని నువ్వు కష్టపడి కూలి పని చేస్తావా అని అంటాడు. ఆటో కంపెనీ ఓనర్ ఆటో నడుపుతా అని అన్నట్లు ఉందని అంటారు. నాకు రెండు వేలు కావాలి ఏ పని అయినా చేస్తానని దేవా అంటాడు. ఓ పని ఉందని కూరగాయల మార్కెట్ ఉందని నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తారని చెప్తారు. దాంతో దేవా అక్కడికి వెళ్తాడు. మరోవైపు అత్త ప్రమోదిని, కాంతంని పక్కన కూర్చొపెట్టుకొని మల్లెపూలు దండ గుచ్చుకుంటుంది. ఇంతలో మిధున వచ్చి పువ్వులు కొడుతున్నారేంటి అని అంటే శారద మూర ఎక్కువ ఖరీదు అని నా ముగ్గురు కోడళ్లు జడనిండా పూలు పెట్టుకోవాలి అంటే విడిపూలు కట్టడం మంచిదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















