Nindu Noorella Saavasam Serial Today September 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ రిస్క్యూ ఆపరేషన్ - అంజు గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్
Nindu Noorella Saavasam serial Today Episode September 9th: తీవ్రవాదులను పట్టుకోవడానికి అమర్ రిస్క్యూ ఆపరేషన్ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: పక్క ప్లాట్‌లో ఉగ్రవాదులు ఉన్నారని అంజు భాగీకి చెప్తుంది. వెంటనే భాగీ అమర్‌కు ఫోన్ చేసి ఉగ్రాదులు ఇక్కడ ఉన్నారని చెప్తుంది. దీంతో అమర్ అలర్ట్ అవుతాడు.
అమర్: వెంటనే మీరందరూ మీ పిన్ని, నాన్నతో సహా అందరూ మన ఇంటికి వెళ్లిపోండి. మీరు వెళ్లేటప్పుడు ఎక్కువ హడావిడి ఉండకూడదు. వాళ్లెవరికీ డౌట్ కూడా రాకూడదు
భాగీ: సరేనండి వీలైనంత త్వరగా వెళ్లిపోతాము..
అమర్: కేర్‌ఫుల్ భాగీ మేము బయలుదేరుతున్నాం
భాగీ: నాన్నా ఆయన వీలైనంత త్వరగా మనల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నారు.. మనం వెళ్దాం పద నాన్నా
రామ్మూర్తి: ఎందుకమ్మా.. ఏమైంది…
భాగీ: ఆయన ఏదో ప్లాన్ చేశారు నాన్న మనం వెళ్దాం పదండి..
రామ్మూర్తి : సరే వెళ్దాం పదండి..
టెర్రరిస్టుల దగ్గరకు ఇన్‌ఫార్మర్ వస్తాడు.
ఇన్ ఫార్మర్: లెఫ్టినెంట్ అమరేంద్ర ఇక్కడకు వస్తున్నారట.. మీరు వెళ్లిపోండి
టెర్రరిస్ట్: అమరేంద్రనా..? వాడి వల్ల మా టీం మొత్తం డిస్టర్బ్ అయింది. వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయా..?
ఇన్ ఫార్మర్: ఉన్నాయి.. వాడి రెండో వైఫ్ వాళ్ల అమ్మా నాన్న ఇక్కడే ఈ అపార్టెమంట్ లోనే ఉంటారు. మన ఎదురు ప్లాటే..
తీవ్రవాదులు గన్స్ తీసుకుని రామ్మూర్తి ప్లాట్‌లోకి వెళ్తారు. అందరినీ బెదిరిస్తూ.. ఒక దగ్గర కూర్చోబెడతారు. అప్పుడే అక్కడకు తన ఫోర్స్ తో వస్తాడు అమర్. తీవ్రవాది అమర్‌కు ఫోన్ చేస్తాడు.
తీవ్రవాది: హలో అమరేంద్ర నీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉంది. నువ్వు లోపలికి వస్తే వీళ్లను బయటకు పంపిస్తా.. శవాలుగా… నీకు అరగంట టైం ఇస్తున్నాను.. మేము వెళ్లిపోవడానికి రూట్ క్లియర్ చేయ్.. లేదంటే అరగంట తర్వాత ప్రతి అయిదు నిమిషాలకు ఒక డెడ్ బాడీ కిందకు వస్తుంది.
అంటూ వార్నింగ్ ఇవ్వగానే.. అమర్ తన ఫోర్స్ మొత్తాన్ని పిలుస్తాడు. ఇక టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తారు చిత్ర, మను.
మను: వావ్ వాట్ ఏ న్యూస్ చిత్ర
చిత్ర: ఇది నీకు అంత హ్యపీ న్యూసా మను
మను: అవును సూపర్ న్యూస్ తీవ్రవాదుల కాల్పుల్లో భాగీ ఆ నలుగురు పిల్లలు చనిపోతే అమరేంద్ర ఒంటరి వాడై పోతాడు. అప్పుడు నా సొంతం అవుతాడు. నాకు అమర్‌కు మధ్యలో అడ్డుగా ఇంకెవ్వరూ ఉండరు.
చిత్ర: అంటే నీకు కాలమే ఇలా కలిసి వస్తుందన్న మాట. కలిసొచ్చే కాలానికి ఎదురొచ్చే అదృష్టం అంటే ఇదే మనోహరి.. ఈసారి నువ్వు ఏమీ చేయకుండానే.. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. పాపం భాగీ పిల్లలు బలి అవ్వబోతున్నారు.
మను: ఇన్నాళ్లు నేను పడిన కష్టానికి ఫలితం ఇది. నా కోసం ఆ దేవుడే ఈ మిలిటెంట్లను పంపించాడు..
చిత్ర: కానీ అక్కడ ఉన్నది బావ అంత తేలిగ్గా వదిలిపెట్టడు కదా మను.. పైగా ఇలాంటి ఎంతో మంది తీవ్రవాదులను ఆయన కాల్చి చంపేసి ఉంటారు..
అని చెప్పగానే.. అమర్ దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే తీవ్రవాదులను అమర్ కాల్చేస్తాడు. మిగిలిన తీవ్రవాదులు భాగీ పిల్లలను చంపేస్తారు. ఇక అమర్ నా సొంతం అవుతాడు. అంటూ వెళ్లిపోతుంది మను. ఇక అమర్ తీవ్రవాదులను పట్టుకోవడానికి అపార్ట్‌మెంట్లోకి వెళ్తుంటాడు. ఉగ్రవాదులు బాంబులు వేసినా ఆగకుండా లోపలిక వెళ్లి వాళ్లన కొట్టి గన్స్ లాక్కుంటుంటాడు. ఇంతలో ఒక తీవ్రవాది చాటు నుంచి అమర్‌ను కాలుస్తాడు. అది చూసిన అంజు అమర్‌కు అడ్డుగా వస్తుంది. బుల్లెట్ అంజు బాడీలోకి వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















