అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీలోకి ప్రవేశించిన ఆరు ఆత్మ – నిజం తెలుసుకున్న భాగీ

Nindu Noorella Saavasam serial Today Episode September 26th: ఆరు డైరీ చదివిన అమర్‌ అనుమానంగా మనోహరి వైపు చూస్తుంటే మనోహరి బయపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు రూంలోకి వెళ్లిన అమర్‌కు ఆరు రాసిన డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ తీసుకుని ఓపెన్‌ చేసుకుని చదువుతాడు అమర్‌. అమర్‌ డైరీ చదవడం ఆరు చూస్తుంది.

ఆరు: గుప్త గారు ఆయన నా డైరీ మొత్తం చదివేస్తున్నారు

గుప్త: చదవవలెనని విధి లిఖితం బాలిక

అమర్‌ ఒక పేజీ చదువుతూ షాక్‌ అవుతాడు.

ఆరు: ఏంటి గుప్త గారు ఆయన చదువుతూ షాక్‌ అయ్యారు.. ఆ పేజీలో ఏముంది

గుప్త: నువ్వు దిన చర్య రాసిన దానివి నీకు గుర్తు ఉండదా..?

ఆరు: అప్పుడేం రాశానో ఇప్పుడేం గుర్తుకు ఉంటుంది గుప్తగారు.. ఆ గుర్తుకు వచ్చింది. అప్పట్లో నాకు మనోహరి మీద వచ్చిన కొన్ని అనుమానాల గురించి డైరీలో రాసినట్టు గుర్తు కొంపదీసి ఆయన ఆ పేజీ చదివేశారా..?

గుప్త: ఆ పుటను మనోహరి ఏనాడో చించివేసినది. నువ్వు రాసిన దినచర్య నుంచి ఆ పత్రము ఏనాడో తొలగించబడినది

ఆరు: మరి ఆయన ఏం చదువుతున్నారు

గుప్త: ఇన్ని మార్లు మమ్మలను అడుగుట ఏల నువ్వే నీ పతి దేవుని దగ్గరకు వెళ్లి ఆ పత్రమును చదువుము

ఆరు అమర్‌ దగ్గరకు వెళ్తుంది. అమర్‌ డైరీ తీసుకుని బయటకు వెళ్తాడు.

ఆరు: చ ఆ పేజీలో ఏముందో చూడలేకపోయాను గుప్త గారు

గుప్త: చింతించకుము బాలిక మరి కాసేపట్లో నీకు ఆ పుటలో ఏముందో తెలియును

 ఆరు: ఎలా తెలుస్తుంది..?

గుప్త: నీ పతిదేవుడు చెప్పెదడు..

ఆరు: ఏం చెప్తారు..?

గప్త: నీవు గతంలో చేసిన నిర్వాకములన్నీయూ చెప్పును..

ఆరు: అంతగా నేనేం చేశాను..

గుప్త: నీవే ఆలకించుము పద బాలిక

అని ఇద్దరూ బయటికి వెళ్తారు. గార్డెన్‌ నిల్చుని చూస్తుంటారు. ఇంతలో భాగీ వస్తుంది.

ఆరు: గుప్త గారు నా చెల్లి వచ్చేసింది.. తనకు నిజం తెలిసిపోయినట్టు ఉంది.

గుప్త: నీ స్నేహితురాలు కూడా వచ్చింది బాలిక

భాగీ, రాథోడ్‌ లోపలికి వెళ్తారు.. వెనకే మనోహరి వెళ్తుంది.

భాగీ: ఏవండి నేను మీకు ఒక విషయం చెప్పాలి

అమర్: కాస్త ఆగు భాగీ

మనోహరి భయపడుతుంది.

ఆరు: గుప్త గారు ఇప్పుడు ఆయన చేతిలో దానికి ఉంటుంది. నన్ను చంపినందుకు దాన్ని రెండు చెంపలు వాయించి బయటకు పంపిస్తారు. పోలీసులను పిలిచి జైలుకు పంపిస్తారు. అది జీవితాంతం జైలులో ఉండిపోతుంది. రండి రండి చూద్దాం

రాథోడ్‌: సార్‌ మిస్సమ్మ చెప్పేది త్వరగా వినండి సార్‌

అమర్‌: నేనే మీకో విషయం చెప్పాలి. అదేంటంటే మనోహరి గురించి..

భాగీ: నేను చెప్పాలనుకుంటుంది కూడా తన గురించే అండి..

అమర్‌: ముందు నన్ను చెప్పనివ్వు  

రాథోడ్‌: సార్‌ సార్‌ మిస్సమ్మ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్‌ సార్‌

అమర్‌: నేను చెప్పేది కూడా ఇంపార్టేంటే..

ఆరు: ఆయన ఇప్పుడు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు గుప్త గారు.

గుప్త: నువ్వు దినచర్యలో లిఖించిన విషయం

అమర్‌: మనోహరి ఇలా రా.. ( మనోహరి దగ్గరకు వెళ్తుంది.) ఇదేంటో తెలుసా..? ఇది అరుంధతి డైరీ.. ఇందులో అరుంధతి ఏం రాసిందో తెలుసా..? నీకు సంబంధించిన విషయం ఒకటి రాసింది… ఇది ఇవాళ నాకు కనిపించింది. ఈ విషయం నీకు తెలియాలని బయటకు తీసుకొచ్చాను..

అని అమర్‌ చెప్తాడు. మనోహరి భయంతో వణికిపోతుంది. తర్వాత అమర్‌, భాగీ రూంలో నిద్రపోతుంటే.. సడెన్‌ గా భాగీకి మెలుకువ వస్తుంది. దెయ్యం పట్టిన వ్యక్తిలా లేచి ఆరు రూంలోకి వెళ్తుంది. అక్కడ ఆరు ఫోటో చూసి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget