Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీ కారుకు అడ్డంగా నిలబడ్డ మనోహరి – నిజం తెలిసి షాక్ అయిన రాథోడ్
Nindu Noorella Saavasam serial Today Episode September 25th: అశ్రమంలో నిజం తెలుసుకున్న భాగీ ఇంటికి వెళ్తుంటే.. మనోహరి వచ్చి అడ్డుగా నిలబడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమానికి వెళ్లి సరస్వతిని కలిసిన భాగీకి నిజాలు అన్ని చెప్తుంది సరస్వతి. దీంతో భాగీ, రాథోడ్ షాక్ అవుతుంటారు.
సరస్వతి: అరుంధతిని అది చంపిందన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసన్న విషయం దానికి తెలుసు. అందుకే ఆ నిజం మీతో చెప్పనివ్వకుండా నన్ను ఆడ్డుకుంటుంది. నన్ను చంపడానికి కూడా వెనుకాడటం లేదు
ఇంట్లో ఉన్న మనోహరి ఆశ్రమానికి బయలుదేరుతుంది. అమర్ హాల్లో ఉండటం చూసి ఫోన్ వచ్చినట్టు నాటకం ఆడుతుంది.
మను: హలో ఆ అదితి అవునా సరే సరే నేను ఇప్పుడే వచ్చేస్తాను సరే. అమర్ నేను అర్జెంట్‌గా ఒక ప్లేస్‌కు వెళ్లాలి.. నేను ఒక ఆఫన్నవర్‌లో తిరిగి వస్తాను.
అమర్: సరే మనోహరి
వెంటనే అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్లిపోతుంది మనోహరి. ఆశ్రమంలో సరస్వతి చెప్తున్న విషయాలు వింటూ ఎమోషనల్ అవుతుంది భాగీ.
సరస్వతి: అరుంధతి చాలా మంచి అమ్మాయి. దేవత లాంటి అమ్మాయి. తను ఈ ఆశ్రమం కోసం అనాథ పిల్లల కోసం ఎంతో చేసింది. తను ఒక మంచి వ్యక్తికి ఇల్లాలు అయిందని.. మంచి కుటుంబానికి కోడలు అయిందని మేము చాలా సంతోషించాం. ముగ్గురు పిల్లల తల్లిగా అరుంధతి జీవితం పరిపూర్ణం అయిందని అనుకున్నాం.. కానీ ఆ మనోహరి అరుంధతి జీవితాన్ని అసంపూర్ణం చేసింది. ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసింది. అరుంధతి అమరేంద్ర గారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజులకు కోల్ కతా వెళ్లింది.
రాథోడ్: అవును మేడం మేము ఒకసారి కోల్‌కతా వెళ్లి ఎంక్వైరీ చేశాము కానీ మాకు ఎటువంటి సాక్ష్యం దొరకలేదు.
సరస్వతి: అక్కడ రణవీర్ అనే అతణ్ని పెళ్లి చేసుకుని అతనితో ఒక బిడ్డను కని ఆ బిడ్డను అనాథ ఆశ్రమంలో వదిలేసింది. అరుంధతి మంచి మనసుతో ఆ బిడ్డను దత్తత తీసుకుని తన బిడ్డల్లో ఒక బిడ్డగా పెంచింది. ఆ విషయం మనోహరికి తెలియదు. ఆ తర్వాత మీ ఇంట్లో చేరింది. తన వల్ల మీకు మీ కుంటుంబానికి ప్రమాదం జరగుతుందని చాలా బయపడ్డాను. అందుకే తన గురించి మీకు ముందే చెబితే తనను మీరు దూరం పెడతారు అనుకున్నాను.
భాగీ: అవును మేడం మీరు చాలాసార్లు కలవడానికి వచ్చారు కానీ కలవలేకపోయాం.
సరస్వతి: కానీ ఇప్పటికి చెప్పగలిగాను..
అంటూ చెప్పగానే.. భాగీ ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇక అమర్ వెంటనే లేచి వెళ్లి ఆరు రూం ఓపెన్ చేస్తాడు. ఆ విషయం తెలిసి గుప్త పరుగెత్తుకుంటూ లోపలిక వెళ్తాడు.
ఆరు: గుప్త గారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఆగండి..
అని ఇద్దరూ కలిసి రూంలోకి వెళ్తారు. అమర్ ఫోటో ముందు నిలబడి చూస్తుంటాడు.
ఆరు: చూశారా గుప్త గారు ఆయనకు నేను గుర్తుకు వచ్చానేమో..? నన్ను చూడాలని నా గది తలుపులు తెరిచారు.
గుప్త: ( మనసులో) నిన్ను చూచుటకు నీ పతిదేవుడు ఈ గది తలుపులు తెరువలేదు బాలిక నీ సహోదరి నిన్ను చూచుటకు విధి తెరిపించినది.
అమర్: ఆరు నిన్ను చూడగానే ఇష్టపడ్డాను.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. నీవల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్‌లాంగ్ మనం కలిసి హ్యాపీగా ఉంటామనుకున్నాను.. కానీ విధి మనల్ని వేరు చేసింది
ఆరు: మనల్ని వేరు చేసింది విధి కాదండి.. ఆ మనోహరి చేసింది
అమర్: నువ్వు వెళ్లిపోయావు నేను మిగిలిపోయాను కానీ నువ్వు లేని ఈ లోకంలో నేను నీ జ్ఞాపకాలతో పిల్లల కోసం బతుకుతున్నాను.
అనుకుంటూ అమర్ ఎమోషనల్ అవుతుంటాడు. ఇక మనోహరి ఆశ్రమానికి వెళ్లి భాగీని అడ్డగిస్తుంది. భాగీ కోపంగా మనోహరిని తోసేసి ఇంటికి బయలుదేరుతుంది. వెనకే మనోహరి వస్తుంది. అందరూ ఇంటికి రాగానే హాల్లో అమర్ కూర్చుని ఉంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















