Nindu Noorella Saavasam Serial Today September 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రణవీర్ ను గేటు వద్దే ఆపిన సెక్యూరిటీ – బాంబుతో సహా ఇంట్లోకి వచ్చిన మను
Nindu Noorella Saavasam Today Episode: బాంబు ఉన్న గణపతి విగ్రహాన్ని మనోహరి ఇంట్లోకి తీసుకురావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: విగ్రహం తీసుకురావడానికి తాను వెళ్తానని మనోహరి చెప్పడంతో వద్దని నేనే వెళ్తానని అమర్ చెప్పడంతో నువ్వు ఇక్కడ ఉంటేనే మంచిది. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా జరగొచ్చు అని మనోహరి చెప్పడంతో అమర్ సరేనని రాథోడ్ ను పంపిస్తానని చెప్పడంతో వద్దని రాథోడ్ ను చూస్తే వాళ్లు గుర్తుపడతారని చెప్పడంతో అమర్ సరే అంటాడు. ప్రాణం అంటే తీపి ఉన్న మను ఎందుకు ఈ ప్లాన్ చేస్తుందని ఆరు అనుకుంటుంది. తర్వాత రణవీర్ రావడంతో బయటే సెక్యూరిటీ వాళ్లు ఆపేస్తారు. అది చూసిన భాగీ, అమర్ కు చెప్తుంది.
భాగీ: ఏవండి బయట రణవీర్ గారు వచ్చారు.
అమర్: అవునా అతను ఇప్పుడెందుకు వచ్చాడు. సరే వెళ్దాం పద.
ఆరు : ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు. మను ఏమైనా చేసిందా? అది అంత నంగనాచి మాటలు మాట్లాడినప్పుడే అనుకున్నా అదేదో చేస్తుందని.. ఇదేంటి కారు తీసుకెళ్లకుండా గేటు దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు.
అమర్: హలో రణవీర్.. వచ్చి వెళ్లిపోతున్నారు.
రణవీర్: నిన్న అంజలి పాప కాల్ చేసి ఇంట్లో పూజ ఉంది. తప్పకుండా రమ్మంది. ఇక్కడికి వస్తే మిలటరీ వాళ్లు అలో లేదన్నారు. అందుకే వెళ్లిపోతున్నాను.
భాగీ: అంజు పాప రమ్మని చెప్పిందా?
రణవీర్: అవునండి వచ్చి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. కానీ రాకుంటే అంజలి పాప బాధపడుతుందని వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూశాక రావడం కరెక్టు కాదనిపించింది. నేను వచ్చి వెళ్లానని అంజలికి చెప్పండి.
అని రణవీర్ చెప్పి వెళ్లిపోతుంటే అమర్, భాగీ రణవీర్‌ను లోపలికి తీసుకెళ్తారు. బయటకు వెళ్లిన మనోహరి, బాబ్జికి ఫోన్ చేస్తుంది. దుర్గను నేను అంటూ డీటెయిల్స్ చెప్పబోతుంటే బాబ్జీ ఫోన్ స్విచ్చాప్ అవుతుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. మరోవైపు లోపలికి వెళ్లిన రణవీర్ ను చూసి అంజు హ్యాపీగా ఫీలవుతూ విషెస్ చెప్తుంది.
ఆరు: అంజు ఏంటి మనోహరి భర్తను చూసి ఇంత ఆనంద పడుతుంది. ఇంత దగ్గర అవుతుందేంటి?
అంజు: అంకుల్ మీ డ్రెస్ చాలా బాగుంది.
రణవీర్: నీ డ్రెస్ కూడా చాలా బాగుంది.
రాథోడ్: అంజు పాప అందరితో ఇట్టే కలిపిపోతుంది.
రణవీర్: ఇంట్లో ముఖ్యమైన వాళ్లు లేనట్టు ఉంది.
అని అడుగగానే ఎవరు అని అందరూ క్వశ్చన్ మార్కు ఫేస్ పెట్టడంతో మనోహరి గారు అంటాడు రణవీర్ దీంతో అమర్ మిలటరీ వాళ్ల దగ్గరకు వెళ్లి జామర్ ఆఫ్ చేయమని చెప్పి మనోహరికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. మనోహరి సరేనని చెప్పి బాబ్జీని తిట్టి కారులో వెళ్లిపోతుంది. అరవింద, మనోహరి కారును ఫాలో చేస్తాడు. ఒక దగ్గర కారు ఆపిన మనోహరి దగ్గరకు వినాయక విగ్రహం తీసుకుని వచ్చి అమర్ సార్ చెప్పారని విగ్రహం ఇచ్చి మనోహరిని మళ్లీ ఫాలో చేస్తారు.
అరవింద్: మనం బాంబు పెట్టిన పీట ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు.
అనుచరుడు: ఇంటి వరకు రావడం ఈజీయే అన్నా కానీ సెక్యూరిటీని దాటుకుని ఇంట్లోకి వెళ్లడం కష్టమే కదా? వాళ్లకు కానీ దొరికితే
అరవింద్: దొరకదు. వాళ్ల మిషన్ కు మ్యాచ్ అవకుండా బాంబును సెట్ చేశాను.
అని చెప్తాడు. అరవింద్ చెప్పినట్లు మిలటరీ వాళ్లు చెక్ చేసినా బాంబు దొరకదు. దీంతో విగ్రహం తీసుకుని మనోహరి లోపలికి వెళ్తుంది. అందరూ సంతోషంగా విగ్రహం తీసుకెళ్లి పూజా మందిరంలో పెడతారు. బయటి నుంచి అరవింద్ రిమోట్ ఆన్ చేస్తాడు. బాంబు పేలదు. దీంతో జామర్లు ఆన్ చేశారు. అందుకే పేలలేదు అని ఇది ఫెయిల్ అయినా దీపాలు వెలిగిస్తే వచ్చే హీట్ కు బాంబు పేలేటట్లు సెట్ చేశాను అంటాడు అరవింద్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?