Nindu Noorella Saavasam Serial Today September 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ ప్లాన్ సక్సెస్ - నిజం చెప్పిన రణవీర్ లాయరు
Nindu Noorella Saavasam serial Today Episode September 12th: అమర్ ప్లాన్ చేసి రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. అందుకోసం లాయరును కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: బ్లడ్ బ్యాంక్ నుంచి వస్తున్న రాథోడ్‌ను రణవీర్ మనిషి అడ్డగించి బ్లడ్ కింద పడేలా చేస్తాడు. దీంతో రాథోడ్ కోపంగా ఆ వ్యక్తిని తిడుతుంటే ఇంకో వ్యక్తి వచ్చి బ్లడ్ ప్యాకెట్ చినిగిపోయేలా చేస్తాడు. అది చూసి రాథోడ్ బాధపడుతుంటాడు.
రాథోడ్: అయ్యో రక్తం అంతా నేల పాలు అయిపోయిందే
అమర్: రాథోడ్ ఏమైంది..? అసలు ఏం జరిగింది.. బ్లడ్ ప్యాకెట్ కింద పడిపోయిందేంటి..?
రాథోడ్: సారీ సార్ నేను బ్లడ్ తీసుకుని వస్తుంటే ఎవడో ఒకడు వచ్చి డాష్ ఇచ్చాడు. బ్లడ్ కిందపడిపోయింది. నేను కావాలని చేయలేదు.. నన్ను క్షమించండి సార్
అమర్: ఇట్స్ ఓకే రాథోడ్ ఇలా జరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు.
భాగీ, పిల్లలు, రామ్మూర్తి వస్తారు.
అమ్ము: బ్లడ్ దొరికింది కదా..? అంజలికి సర్జరీ అవుతుంది అనుకున్నాం.. ఇప్పుడెలా డాడీ
భాగీ: రాథోడ్ మీరు ఆ బ్లడ్ ప్యాకెట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు
రాథోడ్: ఒక హాస్పిటల్ లో తీసుకొచ్చాను మిస్సమ్మ.. అక్కడ ఉన్న ఒక్క బ్లడ్ ప్యాకెట్ నాకే ఇచ్చారు.
భాగీ బాధపడుతుంది. అమర్‌ను పక్కకు తీసుకెళ్తుంది.
భాగీ: ఏవండి రణవీర్.. అంజు తండ్రి అని మనకు తెలుసు కదా..? రణవీర్ బ్లడ్ అంజుకు సరిపోతుందేమో చూస్తే..
అమర్: రణవీర్ బ్లడ్ ఎందుకు ఇస్తాడు. పైగా మనం అలా చేస్తే రణవీర్‌కు అంజు తన కూతురు అన్న విషయం తెలిసిపోతుంది కదా..?
భాగీ: రణవీర్‌కు తెలియకుండా ఎలాగైనా బ్లడ్ తీసుకునే ప్రయత్నం చేయండి.
అమర్: సరే నా ప్రయత్నం నేను చేస్తాను.. రాథోడ్ కారు తీయ్ వెళ్దాం..
అంటూ వెళ్లిపోతాడు. తర్వాత కొంత మందితో రణవీర్ లాయరును కిడ్నాప్ చేయిస్తుంటాడు అమర్. కారులో వెళ్తుంటాడు. ఒక దగ్గర కారును ఆపమని రాథోడ్ కు చెప్తాడు. రాథోడ్ కారు ఆపేస్తాడు. అక్కడే రోడ్డు పక్కన రణవీర్ లాయరు టీ తాగుతుంటాడు. కొందరు మనుషులు లాయరు దగ్గరకు వెళ్తారు.
రాథోడ్: ఎందుకు సార్ ఇక్కడ ఆపమన్నారు.. ఇక్కడ మనకేంటి పని..?
అమర్: అక్కడ చూడు రణవీర్ లాయరు ఉన్నాడు. వాడిని పట్టుకుంటే.. రణవీర్ భార్య ఎవరో తెలుస్తుంది.
లాయరు దగ్గరకు అమర్ మనుషులు వెళ్లి మాట్లాడతారు.
అమర్ మనిషి: మీరు లాయరు కదా..? మాకు ఒక కేసు వాదించాలి.. మీరు ఫీజు ఎంత తీసుకుంటారు.
లాయరు: నేను బయటి కేసులు వాదించను అయినా నా గురించి మీకు ఎవరు చెప్పారు.
అమర్ మనుషులు లాయరును బలవంతంగా తమ కారులో తీసుకుని సీక్రెట్ ప్లేస్‌కు వెళ్తారు.
లాయరు: ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు. నేను ఒక లాయరు అన్న విషయం మీరు మర్చిపోతున్నారు.. నేను బయటికి వెళితే మీరు లీగల్ గా కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది.
అమర్ మనిషి: కంగారు పడకు నువ్వు సేఫ్ గానే ఉన్నావు.. మాకు కావాల్సిన ఇన్మఫర్మేషన్ ఇస్తే అంతే సేఫ్‌గా నువ్వు ఇంటికి వెళ్తావు.
లాయరు: అసలు మీరెవరు..? మీకు నాతో ఏం పని ఉంది.. నేను ఏం సమాచారం ఇవ్వాలి మీకు
అమర్ మనిషి: ఒక చిన్న సమాచారం కావాలి. అది నీకు తెలిసిందే.. నువ్వు కోల్‌కతా నుంచి వచ్చిన రణవీర్ దగ్గర పని చేస్తావు కదా..?
లాయరు: అవును నేను రణవీర్ కు పర్సనల్ లాయరును.. అయినా ఎందుకు అడుగుతున్నారు.. ? అసలు మీరు ఎవరు..? నాతో మీకు ఏం ఇన్మఫర్మేషన్ కావాలి.
అమర్ మనిషి: ఏం లేదు.. రణవీర్ వైఫ్ ఎవరో చెప్పు.. నిన్ను వదిలేస్తాం
లాయరు: అతని వైప్ ఎవరో నాకు తెలియదు.. అయినా ఆ విషయం మీకు ఎందుకు చెప్పాలి.. అసలు మీరెవరో చెప్పకుండా ఏం చేస్తున్నారు మీరు..
అమర్ మనుషులు లాయరును కొట్టి బెదిరిస్తారు.
అమర్ మనిషి: రణవీర్ వైఫ్ ఎవరో చెప్పకపోతే నిన్ను చంపేస్తాం.. అసలు నీ శవం కూడా ఎవ్వరికీ దొరకకుండా చేస్తాం.. ఓన్లీ మేము అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు
అని కొడుతుంటే.. లాయరు నిజం చెప్తాడు. అంతా వీడియో కాల్ లో చూస్తున్న అమర్.. లాయరు మాటలకు షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















