అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా పిలిచిన అమర్ – రణవీర్ కు వార్నింగ్ ఇచ్చిన మనోహరి

Nindu Noorella Saavasam Today Episode: రణవీర్ పెడుతున్న మానసికమైన టార్చర్ భరించలేని మనోహరి, బాబ్జిని పిలిచి రణవీర్ ను ఏమైనా చేయమని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు కిచెన్‌ లోకి వెళ్లి భాగీని మాటల్లో పెట్టి  ఆరు గురించి మీ ఆయన తెలుసుకున్నారా? అని అడుగుతుంది. దీంతో భాగీ లేదంట అక్క అని చెప్పగానే నాకెందుకో ఆయన అన్ని తెలుసుకుని ఉంటాడని ఆరు అంటుంది. భాగీ కూడా అవును అక్కా ఆయన ఆశ్రమానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి  ఏదోలా ఉన్నాడని చెప్తుంది. అయితే నువ్వు ఆయన నుంచి నిజం తెలుసుకోవాలని ఆరు చెప్పడంతో అవునని భాగీ అంటుంది. మరోవైపు రణవీర్‌కు ఎదురుగా వెళ్తుంది మనోహరి.

రణవీర్‌: ఏంటి మనోహరి చావాలని అంత ఆశగా ఉందా? బతుకు మీద విరక్తి వచ్చిందా? నాకే ఎదురొస్తున్నావు.

మనోహరి: ఏం కావాలి నీకు చెప్పు ఏం కావాలి నీకు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు. మన పెళ్లిలో ప్రేమ లేదు నాకు నీతో బతకాలని లేదు. ఆ ఇంట్లో నాకు సంతోషమే లేదు.

రణవీర్‌: దుర్గ... తనతో నేను కోల్పోయిన జీవితం కావాలి. చెప్పు తిరిగి తెచ్చి ఇవ్వగలవా? నువ్వు చేసిన తప్పులకు నేను పాత రణవీర్‌ అయ్యుంటే నిన్ను ఎప్పుడో చంపేవాణ్ని.

మనోహరి: ఏంటి రణవీర్‌ నీ గురించి నాకు తెలిసి కూడా నీ కూతురుని నీకు అప్పగిస్తానని ఎలా అనుకున్నావు. నేను నీ కూతురును నీకు అప్పగించిన మరుక్షణం నువ్వు నన్ను ప్రాణాలతో వదలవని నాకు తెలుసు.

రణవీర్‌: ఏయ్‌ ఇన్ని సార్లు దుర్గ గురించి మాట్లాడావు కదా.. ఒక్కసారి కూడా నా కూతురు అని పలకవా?

 అని రణవీర్‌ అడగ్గానే పలకనని మన పెళ్లి సరిగ్గా జరగలేదని చెప్తుంది. దీంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నువ్వు.. నీ ఫ్రెండును చంపి తన జీవితాన్ని నీకు కావాలని తిరుగుతున్నావు చూడు అని రణవీర్‌ అనగానే మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో తేరుకుని అమర్‌తో నా జీవితం సెట్‌ అయ్యేదాకా నీ కూతురు గురించి నీకు చెప్పను అంటుంది. దీంతో కోపంగా నా కూతురు గురించి నీతోనే చెప్పిస్తానని వెళ్లిపోతాడు రణవీర్‌. మరోవైపు రూంలో ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతున్న అమర్‌ మిస్సమ్మను భాగీ అని పేరు పెట్టి పిలుస్తాడు. కిచెన్‌ లో ఉన్న భాగీ హ్యాపీగా పైకి పరుగెత్తుకువెళ్తుంది.

శివరాం: చూశావా ఒక్క పిలుపునకే ఇంతలా పరుగెడుతుంది అంటే ఇంక ప్రేమ పంచితే ఇంకెంత ఆనందిస్తుందో..

నిర్మల: అవునండి అమర్‌ మిస్సమ్మను ప్రేమతో స్వీకరించే రోజు కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తున్నానండి.

అమర్‌: మిస్సమ్మ... ఎంతసేపు..

 అని అమర్‌ తిరిగి చూడగానే మిస్సమ్మ ఎదురుగా నిలబడి చూస్తుండిపోతుంది.

అమర్‌: హలో ఏంటి వచ్చి కూడా పలకవేంటి?

భాగీ: మీరు నా పేరు పలుకుతుంటే బాగుంది. అందుకే పలకలేకపోయా?

అమర్‌: అదేంటి ఎప్పుడు నీ పేరుతోనే కదా పిలుస్తాను.

భాగీ: ఎప్పుడూ మిస్సమ్మా అనేవారు. ఇప్పుడు భాగీ అన్నారు కదా?

అమర్‌: నేను భాగీ అన్నానా? నేను మిస్సమ్మ అనే..

 అంటూ తాను భాగీ అని పిలిచింది గుర్తు చేసుకుంటాడు అమర్‌. దీంతో భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో మిస్సమ్మ అని పిలవడం అలవాటైపోయింది. భాగీ అని పిలవడానికి కొంచెం టైం పడుతుంది. అని చెప్పగానే వినాయకచవితి వస్తుంది కదా మీ నాన్న, పిన్నిని రమ్మని చెప్పు అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం. అని అమర్‌ చెప్పగానే నేను పిలిస్తే రారని.. అదే మీరు పిలిస్తే వస్తారు అని భాగీ చెప్పగానే నువ్వు రెడీ అవ్వు మీ ఇంటికే వెళ్లి పిలుద్దాం అని అమర్‌ చెప్పగానే భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు మనోహరి, బాబ్జీని కలిసి రణవీర్‌ను ఏదో ఒకటి చేయాలని చెప్తుంది. మరోవైపు రామ్మూర్తి పడుకుని ఉంటే మంగళ తిడుతుంది. ఏం సాధించావని ప్రశాంతంగా ఉన్నావని అడుగుతుంది. ఇద్దరూ గొడవపడుతుంటే ఇంతలో భాగీ, అమర్‌ వస్తారు. వినాయకచవితికి రమ్మని పిలవగానే రామ్మూర్తి మొహమాట పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ కు ఐ లవ్ యూ చెప్పిన నక్షత్ర – పూరికి ఇందును సారీ చెప్పమన్న చంద్ర

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
Embed widget