అన్వేషించండి

Meghasandesham Serial Today September 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ కు ఐ లవ్ యూ చెప్పిన నక్షత్ర – పూరికి ఇందును సారీ చెప్పమన్న చంద్ర

Meghasandesham Today Episode: పూరిని ఇందు ఎలా అవమానించిందో ఇంట్లో వాళ్లకు ప్రసాద్ చెప్పడంతో చంద్ర పూరికి ఇందును సారీ చెప్పమంటాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  పూరి మాటలు గుర్తు చేసుకున్న కృష్ణప్రసాద్‌, శారదకు ఫోన్‌ చేయడంతో  శారద కోపంగా వద్దన్నా మీరెందుకు ఫోన్‌ చేస్తున్నారు అంటూ నిలదీస్తుంది. మీ వల్ల పిల్లలు శత్రువులుగా మారిపోతున్నారు అంటుంది. దీంతో కృష్ణప్రసాద్‌ నాకు అన్నీ తెలుసని ఫోన్‌ పూరికి ఇవ్వమని అడుగుతాడు. ఒకసారి పూరితో మాట్లాడతానని చెప్పడంతో కాలేజీలో అంత జరిగాక మీతో మాట్లాడుతుందా? అని ప్రశ్నిస్తుంది శారద. ఇంతలో పూరి వచ్చి ఫోన్‌ లాక్కుని కృష్ణప్రసాద్‌ ను తిడుతుంది. దీంతో ఇందు తెలియక మాట్లాడిందని కృష్ణ ప్రసాద్‌ చెప్పగానే తెలియక మాట్లాడటమేంటి? అన్ని తెలిసే మాట్లాడుతుందని మీరు ఫోన్‌ చేయడం కన్నా మా ముగ్గురిని చంపేయండి అని ఫోన్‌ కట్‌ చేస్తుంది. దీంతో కృష్ణ ప్రసాద్‌ కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు శరత్‌చంద్ర బయటకు వెళ్తుంటే ప్రసాద్‌ వస్తాడు.

ప్రసాద్‌: చనిపోయే నాటికి శోభాచంద్ర గారు గర్భవతి కదా?

చంద్ర: ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు.

ప్రసాద్‌: ప్లీజ్‌ చెప్పండి చెల్లమ్మా గర్భవతియే కదా?

చంద్ర: అవును గర్భవతే..

ప్రసాద్‌: ఆవిడ చనిపోక ముందే ఒకవేళ బిడ్డ పుట్టి ఉంటే మీ మీద ఎక్కువ అధికారం పుట్టిన ఆ బిడ్డకు ఉంటుందా. లేక నక్షత్రకు ఉంటుందా? చెప్పండి. ఎక్కువ అధికారం ఎవరికి ఉంటుంది.

చంద్ర: ఇందులో ప్రత్యేకంగా చెప్పేదేముంది. నా పెద్ద బిడ్డకే ఎక్కువ అధికారం ఉంటుంది.

ప్రసాద్‌: మరి నా విషయంలో మాత్రం అలా ఎందుకు ఆలోచించడం లేదు.

   అని చెప్పగానే అపూర్వ, ప్రసాద్‌ను తిడుతుంది. దీంతో ప్రసాద్‌ మీకో న్యాయం నాకో న్యాయమా? అంటూ నిలదీస్తాడు. దీంతో ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని చంద్ర అడగ్గానే జరిగిన విషయం ప్రసాద్‌ చెప్తాడు. పూర్ణిమను కాలేజీలో పెళ్లి కార్డు విషయంలో ఇందు అవమానించిన విషయం చెప్తాడు.  తండ్రి దూరంగా ఉన్నంత మాత్రాన నా బిడ్డ తండ్రి లేనిది అవుతుందా? అని ప్రశ్నిస్తాడు. దీంతో చెర్రి, చంద్ర , ఇందును తిడతారు.

చంద్ర: ఏంటి ఇందు కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నావా? ఇలా గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావా? ఆడపిల్లను అలా బాధపెట్టడం కరెక్టు కాదు. నువ్వు చేసింది తప్పు. నువ్వు కాలేజీలో ఎవరి ముందు ఆ అమ్మాయిని అవమానించావో వాళ్ల ముందే ఆ అమ్మాయికి సారీ చెప్పు.

ఇందు: సరే మామయ్యా..

చంద్ర: రేపు కాలేజీకి వెళ్లగానే నువ్వు క్షమాపణ చెప్తున్నావు అంతే..

అపూర్వ: బాగుంది కృష్ణప్రసాద్‌. సరేలే ఏదో మాట్లాడుతున్నావు కదా అని ఊరుకుంటే.. ఎప్పుడూ నువ్వు వాళ్లను సమర్థిస్తూ మాట్లాడతావు తప్పా వీళ్లను సమర్థిస్తావా?

 అంటూ అసలు ఆ పూర్ణిమ ఏం చేసిందో చెప్పలేదు అంటుంది. దీంతో ఇందు ఆ పూర్ణిమ నా కలర్‌ గురించి అవహేళన చేసింది నా పెళ్లి పత్రిక చించేసింది. అని చెప్తుంది ఇందు. దీంతో తను ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది అపూర్వ దీంతో చంద్ర, ప్రసాద్‌ను తిడతాడు. ముందు నువ్వు తప్పు చేయడం మానేయమంటాడు.

    మరోవైపు కారులో వెళ్తున్న గగన్‌ ను రొమాంటిక్‌ గా చూస్తుంది భూమి. తనకు ఆకలిగా ఉందని చెప్తుంది. ఇంటికే వెళ్తున్నాము కదా ఈలోపు పానీపూరి తిను అని పానీ పూరి బండి దగ్గరకు వెళ్తారు. పానీ పూరి తినడం తనుక రాదని భూమి చెప్పగానే గగన్‌ పానీపూరి భూమికి తినిపిస్తాడు. దీంతో భూమి తన ప్రేమను చెప్పాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. ఏంటో చెప్పు అని గగన్‌ అడగ్గానే భూమి ఐ లవ్యూ చెప్పబోతుంటే ఇంతలో నక్షత్ర వచ్చి గగన్‌ కు ఐ లవ్యూ చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సాంబ్రాణి ధూపం ఉపయోగాలు తెలుసా? ఆ రోజు ధూపం వేస్తే మీకు లక్ష్మీకటాక్షమే

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget