అన్వేషించండి

BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్

BRS Harish Rao: తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తుమ్మిడిహెట్టి నీరు గ్రావిటీతో తేవడంపై హరీష్ రావు సవాల్.
  • కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు; శ్వేతపత్రం విడుదల చేయాలన్న హరీష్.
  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది.
  • తుమ్మిడిహెట్టి చర్చల్లో కొత్త పురోగతి లేదని బీఆర్ఎస్ నాయకుడు.

BRS Harish Rao: తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు బహిరంగ సవాల్ విసిరారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చి నిరూపిస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేదంటే మంత్రి ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌ తెలంగాణభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పట్టిసీమ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తే, కాంగ్రెస్ దేవాదుల మోటార్లను ఎందుకు నడపలేకపోయిందో చెప్పాలని, దీనిపై తక్షణమే వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి పాలనలోనే ఎత్తు తగ్గింపు ఒప్పందం 

2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్రతో తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరిపినప్పటికీ, వారు అంగీకరించలేదని హరీశ్‌రావు తెలిపారు. 2007 నుండి 2014 వరకు కేంద్రం, ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రల్లో కాంగ్రెసే అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టు ముందుకు సాగలేదని విమర్శించారు. పైగా, 2013 జనవరి 21న జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోనే బ్యారేజీ ఎత్తు తగ్గించడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని స్పష్టం చేశారు.

తుమ్మిడిహెట్టి దగ్గర సరిపడా నీళ్లు లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ మూడుసార్లు స్పష్టంగా లేఖలు రాసిందని పేర్కొన్నారు. అక్కడ 160 టీఎంసీలు కాదు కదా, కనీసం 102 టీఎంసీలు కూడా అందుబాటులో లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ను వెంటనే బయటపెట్టాలని, రాజకీయాలు పక్కనపెట్టి మేడిగడ్డను మరమ్మతు చేసి కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. 

‘తుమ్మిడిహెట్టి’పై సాధించిందేమీ లేదు- బోయినపల్లి వినోద్‌కుమార్

ఇదిలా ఉండగా, తెలంగాణ, మహారాష్ట్రల ముఖ్యమంత్రుల భేటీలో తుమ్మిడిహెట్టి విషయంలో కొత్తగా సాధించిందేమీ లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తుమ్మిడిహెట్టి ఎత్తుపై చర్చలు ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి సీఎంలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో ప్రారంభమయ్యాయన్నారు. అప్పుడే నాటి మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తును వ్యతిరేకించిందని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలోనూ చర్చలు జరిపి 148 మీటర్ల ఎత్తుకే మహారాష్ట్ర ఒప్పుకుందన్నారు.

Also Read: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?

ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పిస్తే మంచిదేనని, అయితే ఎత్తు ఒక్కదానితోనే సమస్య తీరదని వినోద్‌కూమార్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాబోయే అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఇప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.  

"ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు? దేవాదుల, కల్వకుర్తి మోటర్లు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది ముమ్మాటికి కాలం తెచ్చిన కరువు కాదు..  కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్. మీరు నీళ్లు వదిలితేనే కదా ఏపీకి వెళ్తాయి. గోదావరి నది మీద ఉన్న దేవాదుల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు? దేవాదుల నుంచి ఎన్ని మోటార్లు నడిపారు? ఎన్ని గంటలు నడిపారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి" - మాజీ మంత్రి హరీశ్ రావు. 

Also Read: తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?

Frequently Asked Questions

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు ఏ విషయంలో సవాల్ విసిరారు?

తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామన్న మంత్రి వ్యాఖ్యలపై హరీశ్‌రావు సవాల్ చేశారు. నీళ్లు తెచ్చి నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు తగ్గించడానికి ఏ ప్రభుత్వం అంగీకరించింది?

2013 జనవరి 21న జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారేజీ ఎత్తు తగ్గించడానికి ఒప్పుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎత్తు తగ్గించేందుకు చర్చలు జరిగాయి.

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి సీడబ్ల్యూసీ ఏమి పేర్కొంది?

తుమ్మిడిహెట్టి దగ్గర సరిపడా నీళ్లు లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ మూడుసార్లు లేఖలు రాసింది. అక్కడ 160 టీఎంసీలు కాదు, కనీసం 102 టీఎంసీలు కూడా అందుబాటులో లేవని పేర్కొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం దేనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు?

దేవాదుల మోటార్ల ఆపరేషన్, ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు, ఎన్ని మోటార్లు ఎన్ని గంటలు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Telangana Governor Quota MLCs: 3 ఎమ్మెల్సీ పదవులకు 30 మందికి పైగా పోటీ.. కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందు భారీ టాస్క్! రేసులో ఉన్న ఫ్రంట్ రన్నర్స్ వీరే!
3 ఎమ్మెల్సీ పదవులకు 30 మందికి పైగా పోటీ.. కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందు భారీ టాస్క్! రేసులో ఉన్న ఫ్రంట్ రన్నర్స్ వీరే!
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
Embed widget