అన్వేషించండి

Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది

Skip Detox Drinks : కడుపు శుభ్రంగా ఉండాలని.. గట్ హెల్త్ మెరుగుపడాలని చాలామంది డీటాక్స్ డ్రింక్స్ తాగుతారు. పేగుల ఆరోగ్యానికి ఇవేమి అవసరం లేదని.. కేవలం 3 పద్ధతులు ఫాలో అయితే చాలని అంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డిటాక్స్ డ్రింక్స్ బదులు, సాధారణ అలవాట్లతో జీర్ణవ్యవస్థకు ఆరోగ్యం.
  • పీచు పదార్థాలు, పులియబెట్టిన ఆహారాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • రోజువారీ నడక, తగినంత నీరు మలబద్ధకం నివారిస్తాయి, ఆరోగ్యానికి.

Constipation and Gut Health : జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఉదయాన్నే డిటాక్స్ డ్రింక్స్, వివిధ రకాల హెర్బల్ వాటర్స్ తాగుతుంటారు. అయితే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఖరీదైన పానీయాలు ఏవి అవసరం లేదని చెబుతున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి. రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు, చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో చూసేద్దాం.

ఫైబర్ రిచ్ ఫుడ్స్

పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చాలామంది తగినంత పీచు పదార్థాలు తీసుకోవట్లేదని డాక్టర్ తెలిపారు. కాబట్టి డైట్లో ఉడికించిన కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, గింజలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. 

" ఫైబర్ అనేది పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. సాధారణంగా మహిళలు రోజుకు సుమారు 25 గ్రాములు, పురుషులు 38 గ్రాముల ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వయసు, ఆహార అవసరాలను బట్టి ఈ పరిమాణం మారవచ్చు. ఫైబర్‌ను ఒక్కసారిగా ఎక్కువ చేయకుండా క్రమంగా పెంచుకోవాలి. "
-డాక్టర్ సౌరభ్ సేథి 

Also Read : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

పులియబెట్టిన ఆహారాలు 

పేగుల్లో మంచి బ్యాక్టీరియా సమతుల్యతగా ఉండటం జీర్ణవ్యవస్థకు చాలా ముఖ్యం. ఇందుకోసం రోజువారీ ఆహారంలో పెరుగు, మజ్జిగ వంటి పులియబెట్టిన ఆహారాలను చేర్చుకోవచ్చు. వీటిలో ఉండే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందుకే వేసవిలోనే కాకుండా ఏడాది పొడవునా మజ్జిగ, పెరుగు తీసుకోవచ్చు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

అలాగే చక్కెర ఎక్కువగా కలిపిన ఫ్లేవర్డ్ యోగర్ట్‌లకు బదులుగా సాధారణ పెరుగు తీసుకోవడం మంచిది. పాలు పడనివారు లేదా లాక్టోజ్‌ను జీర్ణించుకోలేనివారు తమకు సరిపోయే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

Also Read : ఉదయాన్నే వాము నీరు తాగితే కలిగే అద్భుత లాభాలు.. బరువు తగ్గడం నుంచి గట్ హెల్త్ వరకు

రోజువారీ నడక..

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా అవసరం. రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేసేవారు.. భోజనం చేసిన వెంటనే పడుకునేవారిలో కొందరికి మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వారు ప్రతిరోజూ కొంత సమయం నడవడానికి కేటాయించాలని డాక్టర్ సౌరబ్ సేథి సూచిస్తున్నారు.

నడక పేగుల కదలికలకు తోడ్పడి మలవిసర్జన సక్రమంగా జరిగేందుకు సహాయపడుతుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత వీలైతే 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవవచ్చు. క్రమంగా రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేసేలా అలవాటు చేసుకోవాలి. అయితే తిన్న వెంటనే వేగంగా నడవడం లేదా తీవ్రమైన వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.

Also Read : గట్ హెల్త్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫుడ్స్.. మొక్కల ఆధారిత ఫుడ్స్​తో ఎన్ని లాభాలో

నీళ్లు తాగడం మరచిపోవద్దు

ఫైబర్ ఎక్కువగా తీసుకునేటప్పుడు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీరు సరిపడా లేకపోతే ఫైబర్ తీసుకున్నప్పటికీ మలబద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

పేగుల ఆరోగ్యం కోసం డిటాక్స్ డ్రింక్స్ తప్పనిసరి కాదు. సమతుల్య ఆహారం, తగినంత ఫైబర్, రోజూ నడవడం, సరిపడా నీళ్లు తాగడం వంటి అలవాట్లు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. అయితే తరచూ మలబద్ధకం, తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం లేదా కారణం తెలియని బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

Also Read : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saffron Water : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
Pilates vs Strength Training : పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?
పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?
Healthy Habits : రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
Kalonji Oil : కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Embed widget