అన్వేషించండి

Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు

Morning Cumin Drink : ఉదయాన్నే ఆరోగ్యంగా ప్రారంభించడమే కాదు.. జీర్ణ సమస్యలను దూరం చేసుకోవడానికి జీలకర్ర డ్రింక్ తాగాలని ఆయుర్వేదం చెప్తోంది. దీనిని ఎలా చేసుకోవాలి.. లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోగనిరోధక శక్తి, మెటబాలిజాన్ని పెంచుతుంది; కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Drinking Cumin Water Every Morning : అసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటికి అనారోగ్యకరమైన ఆహారం, భోజన సమయం, ఒత్తిడి వంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి. మీరు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా మీ డైట్లో జీలకర్ర (Cumin)ను చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. ముఖ్యంగా ఉదయాన్నే జీలకర్రతో చేసిన డ్రింక్‌ను తీసుకుంటే జీర్ణక్రియకు మద్దతు లభిస్తుందని అంటున్నారు.

జీలకర్ర డ్రింక్ కోసం కావాల్సిన పదార్థాలు

జీలకర్ర - 1 టీ స్పూన్

నీరు - 1 గ్లాస్

నిమ్మరసం - 1 టీ స్పూన్ 

తేనె - 1 టీ స్పూన్ 

తయారీ విధానం

ముందురోజు రాత్రి ఒక గ్లాస్ నీటిలో జీలకర్రను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అదే నీటిని 5 నుంచి 10 నిమిషాలు మరిగించి వడగట్టాలి. గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపి తాగవచ్చు. జీలకర్రను నానబెట్టకున్నా.. మరిగించి కూడా తీసుకోవచ్చు. దీనిని ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Also Read : ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి, అందానికి కలిగే లాభాలు ఏంటి? రోజుకు ఎన్ని తినాలి?

అసిడిటీ దూరం

జీలకర్ర జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కాబట్టి అజీర్తి, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

మెరుగైన జీర్ణక్రియ 

జీలకర్రలో ఉండే సహజ సమ్మేళనాలు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి తోడ్పడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడవచ్చు.

మెటబాలిజం కోసం..

కొన్ని అధ్యయనాల ప్రకారం.. జీలకర్ర జీవక్రియను మెరుగుపరచడంలో కొంత పాత్ర పోషించవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకుంటే బరువు నియంత్రణకు కూడా సహాయపడవచ్చు.

Also Read : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగితే కలిగే లాభాలు.. బాడీ డీటాక్స్ నుంచి బరువు తగ్గడం వరకు

యాంటీఆక్సిడెంట్లు 

జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తికి మద్దతు

జీలకర్రలో ఐరన్‌తో పాటు కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మేలు చేసి.. సీజనల్ వ్యాధులు రాకుండా అదుపులో ఉంచుతాయి. 

షుగర్ కంట్రోల్..

కొన్ని పరిశోధనల్లో జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కొంత సహాయపడవచ్చని సూచించినప్పటికీ.. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. కానీ డయాబెటిస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. అలా అని మందులకు బదులుగా దీనిని తాగకూడదు.

హైడ్రేషన్

ఉదయాన్నే గోరువెచ్చని జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందడంతో పాటు రోజును తాజాగా ప్రారంభించేందుకు సహాయపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జీలకర్ర డ్రింక్ ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లో బీపీ ఉన్నవారు జీలకర్ర డ్రింక్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు, మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని దీనిని రొటీన్​లో చేర్చుకోవాలి. 

మార్నింగ్ రొటీన్ సెట్ చేసుకోవడానికి, ఉదయాన్నే హెల్తీగా ప్రారంభించడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget