అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  గేటు దగ్గర ఆరు ఆత్మను కాపలా పెట్టిన ఘోర – లోపల పూజను చులకనగా మాట్లాడిన మనోహరి

Nindu Noorella Saavasam Today Episode:  ఆరు ఆత్మను గేటు దగ్గర కాపలాగా పెట్టి ముత్తైదువలు ఎవరూ భోజనానికి వెళ్లకుండా ఘోర చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఘోర, అమర్‌ ఇంటికి వస్తాడు. మనోహరి తిడుతుంది. అమర్‌ చూస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది. ఇంట్లో భోజనాలు చేయడానికి ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా ఆత్మ చేతనే ఆపేస్తానంటాడు ఘోర.

ఘోర: ఇవాళ నీకోసం చేస్తున్న అమ్మవారి దీక్షకు అడ్డుపడి కొంచెం పాపం మూటకట్టుకో..

ఆరు: వద్దు దీక్షకు బంగం కలిగించి నువ్వేం సాధించలేవు. అమ్మవారు చూస్తూ ఊరుకోరు.

అనగానే ఘోర మంత్రం చదివి ఆరును బయటకు పంపిస్తాడు. గేటు ముందు ఆత్మ నిలబడుతుంది. ఆ ఆత్మను దాటుకని ఎవ్వరూ లోపలకి వెళ్లరు మనోహరి. అని చెప్పగానే మనోహరి సరేనని లోపలికి వెళ్తుంది. లోపల భోజనాలు రెడీ చేసి అతిథుల కోసం ఎదురుచూస్తుంటారు. భోజనానికి ఎవరూ రారు.  బయట గుప్త.. ఘోర చేసిన పని చూసి షాక్‌ అవుతుంటాడు. భోజనానికి వచ్చిన ముత్తైదువలు గేటు దగ్గరకు వచ్చి వెళ్లిపోతుంటారు.

భాగీ: అదేంటండి. ఇంటికి వెళ్లి మరీ భోజనానికి పిలిస్తే ఒక్కరూ కూడా రావడం లేదేంటి..?

మనోహరి: రావడం ఇష్టం లేదేమో.. రారేమో..

నిర్మల: శుభమాని పూజ చేస్తుంటే ఏంటమ్మా ఆ మాటలు..

మనోహరి: ఆంటీ నేనేం తప్పుగా అనడం లేదు. పూజను లాస్ట్‌ మినిట్‌ లో అనుకున్నారు అందరికీ లాస్ట్‌ మినిట్‌ లో చెప్పారు. అందుకే రారేమో అన్నాను. అయినా మనసు బాగాలేదని దీక్షలు చేస్తే ఇలాగే ఉంటుంది. నాకు తెలిసి ఈ దీక్ష ఇంతటితో ఆపేస్తే మంచిది అనిపిస్తుంది. ఏంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు. నేను నీ మంచి కోసమే.. అదే ఈ ఇంటి కోసమే చెప్తున్నాను.

నిర్మల: మనోహరి చెప్తున్నది కూడా నిజమే కదమ్మా.. భోజనానికి ఎవ్వరూ రాకపోతే ఇంటికి అరిష్టమేమో..

రాథోడ్‌: మిస్సమ్మ నువ్వేం బాధపడకు. నువ్వు ఎవరెవరిని పిలిచావో వాళ్లన నేను వెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను.

 అని రాథోడ్ వెళ్లిపోతాడు. భాగీ అమ్మవారి దగ్గరకు వెళ్లి బాధగా ప్రార్థిస్తుంది. భాగీ పక్కన అమర్‌ పిల్లలు కూడా వచ్చి కూర్చుని అమ్మవారిని ప్రార్థిస్తుంటారు.

శివరాం: మిస్సమ్మ మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఈ దీక్ష పూర్తి అవ్వడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి.

గుప్త: జగన్నాథ కళ్ల ముందే ఇంత ఘోరమూ ఇంత అన్యాయమూ జరగుతుంటే నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఈ ఒక్కసారి ఈ ఘోరాన్ని ఆపే శక్తిని ఇవ్వు జగన్నాథ

 అని గుప్త కోరుకోగానే దేవుడు గుప్తకు శక్తులు ఇస్తాడు. లోపల అందరూ అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. తనకు వచ్చిన శక్తులతో ఘోర వేసిన బంధనాన్ని పటాపంచలు చేసి గుప్త లోపలికి వెళ్తాడు. లోపల మనోహరి భాగీని చులకనగా మాట్లాడుతుంది.

మనోహరి: దండం పెట్టుకున్నా.. దయ చూపించమని అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఆంటీ ఇంకా ఎంత సేపని ఇలా ఉంటాము. వెంటనే దీక్షను విరమించడం బెటర్‌.

అని మనోహరి చెప్పగానే అందరూ బాధగా చూస్తుంటారు. ఇంతలో గుప్త వెనకాల ముత్తైదువలు వస్తుంటారు. ఇంతలో గుప్త మాయం అయిపోతాడు. ఇంట్లోకి వస్తున్న ముత్తైదువులకు బయటకు వెళ్లి కాళ్లకు పసుపురాసి లోపలికి తీసుకెళ్తుంది. మరోవైపు లోపల కూరల్లో ఉప్పు ఎక్కువగా కలుపుతుంది మనోహరి. ఇంతలో అందరూ లోపలికి వచ్చి భోజనం చేస్తుంటారు. మొదటగా భోజనం చేసిన ఆవిడ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని అదో రకంగా చూస్తుంది.

మనోహరి: ఏంటి బామ్మగారు ముద్దు నోట్లో పెట్టగానే ముఖం అలా పెట్టారు. ఏం బాలేవా..?

బామ్మ: అన్ని చక్కగా సరిపోయాయి అమ్మా.. ఇంత చక్కగా కుదిరిన వంటను ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు ఏ కోరికతో దీక్ష చేపట్టావే తెలియదు కానీ అది మనఃస్పూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను.

గుప్త: మానవునికి మాధవుడు తోడైతే ఎలా ఉంటుందో  ఈ బాలికకు భోధపడుతుందని నేను అనుకుంటున్నాను.

అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget