Nindu Noorella Saavasam Serial Today October 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని చంపేందుకు బయటకు తీసుకెళ్లిన చంభా –భాగీని కారుతో అటాక్ చేసిన మను
Nindu Noorella Saavasam serial Today Episode October 26th: భాగీని చంపేందుకు మను తన ప్లాన్ చంభాకు చెప్పడంతో చంభా అలాగేనని భాగీని బయటకు తీసుకెళ్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: చంభాను అంజు అనుమానిస్తుంది. ఎక్కడ చూశానని డౌటుగా అడుగుతుంది. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడైనా కలిశానా అని అడుగుతుంది అంజు.
చంభా: లేదమ్మా నేను ఈ ఇంట్లోకి రావడం ఇదే మొదటి సారి
అంజు: బయట ఎక్కడైనా కలిశామా..?
చంభా: ఇళ్లల్లో పని చేసుకునే దాన్ని బయట ఎక్కువ తిరగను అమ్మా
అంజు: నీ పేరేంటి..?
చంభా: నా పేరు యాదమ్మ అమ్మ..
అంజు: నిన్ను ఎక్కడో చూశాను అబ్బా..
మను: ఈ పొట్టిది ఒకతి ( మనసులో అనుకుని) స్కూల్ కు టైం అవుతుంది కదా అంజు వెళ్లండి. అమ్ము తీసుకెళ్లు..
అమ్ము: పద అంజు
అంజు: నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా..? సాయంత్రం మాట్లాడుకుందాం
అంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఇక యమలోకంలో ఉన్న ఆరు కంగారుగా యముడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది.
యముడు: ఎవరది.. ఎవరు..?
ఆరు: నేనే రాజుగారు..
యముడు: ఏమిటా కంగారు మీ వల్ల మా కిరీటము కింద పడబోయినది
ఆరు: పెద్ద ప్రమాదం వచ్చింది రాజు గారు
యముడు: యమపురికి ప్రమాదమా.? అసాధ్యం
ఆరు: అయ్యో ప్రమాదం వచ్చింది మీ రాజ్యానికి కాదు.. మా చెల్లికి మనోహరి మా చెల్లి దగ్గర చంభా మాత్రికురాలిని పనిలో పెట్టింది
యముడు: అయినచో మేమేమీ చేయవలెను
ఆరు: ఏదో ఒకటి చేసి ఆ మాత్రికురాలిని అక్కడి నుంచి పంపించివేయండి లేదంటే మా చెల్లికి ప్రమాదం
యముడు: ప్రతిసారి నీ సోదరిని కాపాడటమే మా పనా..?
ఆరు: ప్రతిసారి అంటే ఎన్నిసార్లు కాపాడారు..? ఒక్కసారి అయినా కాపాడారా రాజుగారు..
యముడు: మేము యమధర్మరాజులం మా విధులు వేరే.. మా కర్తవ్యాలు వేరు
ఆరు: ఏంటి మీ పని నా లాంటి మంచి వాళ్లను త్వరగా చంపేస్తారు.. మనోహరి లాంటి చెడ్డ వాళ్లను పాపి చిరాయువు అంటూ చాలా రోజులు భూమ్మీదే ఉంచుతారు
యముడు: దేనికైనా సమయం రావాలి బాలిక..
ఆరు: అదే ఆ సమయం ఎప్పుడు వస్తుంది. ఆ మనోహరి పాపం ఎప్పుడు పండుతుంది
యముడు: నువ్వు అలా తొందర పడితే ఎలా బాలిక కాస్త ఓపిక పట్టుము.. అయినా నీకు భూలోకంలో జరుగు విషయములు ఎలా తెలియుచున్నవి..నీ శక్తులు సమాప్తం అయినవి కదా..
ఆరు: ఇప్పుడు అదా ముఖ్యం మా చెల్లిని కాపాడండి స్వామి అంటే లాజిక్కులు అడుగుతున్నారు..? రాజు గారు ఇంతకీ మేడం గారు స్నానానికి ఎప్పుడు వెళ్తారు..
యముడు: ఎందులకు ఈసారి మళ్లీ అంగుళీయకము దొంగిలించుటకా..? ఈసారి నీ ఆటలు సాగవు బాలిక మా దేవి నగలన్నీ బోషానములో భద్రపరచి తాళం వేసి స్నానమునకు వెళ్లినది.
ఆరు: పెట్టుకోండి సార్ మీ సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోండి.. మా ప్రాణాలను మాత్రం మీ ఇష్టాలకు తీసేయండి
గుప్త కంగారుగా ప్రభూ అంటూ పరుగెత్తుకుంటూ వస్తాడు..
యముడు: ఏమిటి విచిత్ర గుప్త నువ్వు కూడా పాపుల వలే అరుచుచున్నావు.. ఏమిటీ ఆ గావు కేకలు..
గుప్త: ప్రభు నారదుల వారు మన యమలోకమునకు విచ్చేయుచున్నారని వర్తమానం అందింది
యముడు: (మనసులో) అమ్మో నారదుల వారు ఇక్కడ బాలిక ను చూశారంటే ఇంకేమైనా ఉందా..?
గుప్త: ఇప్పుడు ఏమి చేయుదుము ప్రభు ఆయన వచ్చో లోపు ఈ బాలికను భూలోకం పంపించెదమా..?
దీంతో యముడు కోపంగా గుప్తను తిట్టి.. ఏదైనా రహస్య మందిరంలో దాచి పెట్టమని చెప్పి యముడు వెళ్లిపోతాడు. కింద భాగీని చంపాలని మనోహరి, చంభా ప్లాన్ చేస్తారు. అందుకోసం చంభా, భాగీని తీసుకుని బయటకు వస్తుంది. అప్పుడే మనోహరి తన కారుతో వచ్చి భాగీని గుద్దుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















