Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనుతో వెళ్లిపోయిన పిల్లలు – ఎమోషనల్ అయిన భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode October 22nd: భాగీని తిట్టిన పిల్లలు స్కూల్‌కు కూడా మనుతో వెళ్లిపోతారు. అయితే అంజు మనోహరిని నమ్మదు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: స్కూల్‌లో డ్రాప్ చేస్తానన్న భాగీని పిల్లలు తిట్టి మనోహరి ఆంటీ మీరు రండి మీరు మమ్మల్ని స్కూల్ లో డ్రాప్ చేయండి అని అడుగుతారు. సరే అంటూ మను వెళ్లగానే.. అందరూ మనోహరి తో పాటు బయటకు వెళ్తారు. అంజు మాత్రం ఆగిపోతుంది.
ఆనంద్: అంజు ఎందుకు ఆగిపోయావు రా వెళ్దాం..
అంజు: నేను రాను మీరే వెళ్లండి
అమ్ము: ఏమైంది ఎందుకు రావు
అంజు: మనోహరి ఆంటీ మిస్సమ్మ గురించి తప్పుగా మాట్లాడింది. ఆంటీ మాటలు నమ్మి నువ్వు కూడా మిస్సమ్మతో ఎలా పడితే అలా మాట్లాడావు..
అమ్ము: నేనేం తప్పుగా మాట్లాడలేదు అంజు
అంజు: మిస్సమ్మతో నువ్వు అలా మాట్లాడటం తప్పే… మిస్సమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది.
మను: రేపటి నుంచి అలా చూసుకోదు. ఎందుకంటే తన సొంత బేబీ వస్తుంది
అంజు: మీరు మాట్లాడకండి ఆంటీ.. మాలాంటి పిల్లలకు మీరు అలా చెప్పడమే తప్పు
అమ్ము: ఆంటీ చెప్పింది రైట్ ఆంజు
అంజు: ఏంటి రైటు మిస్సమ్మకు బేబీ పుడితే తప్పేంటి..? నువ్వు అనసరంగా ఆంటీ మాటలు విని పొల్యూట్ అవుతున్నావు..
అమ్ము: అంజు నువ్వు చిన్న పిల్లవి చిన్న పిల్లలాగా ఉండు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు
అంజు: నువ్వు కూడా చిన్న పిల్లవే కదా అమ్ము
అమ్ము: అయితే నేను మీ అందరి కంటే పెద్ద దాన్ని నాకు మంచి చెడు తెలుసు.. అంజు
అంజు: అప్పుడు మా అందరి కంటే మిస్సమ్మ గురించి నీకే ఎక్కువ తెలియాలి. మాకంటే ముందు మిస్సమ్మకు నువ్వే సపోర్టు చేయాలి
అమ్ము: నాతో ఆర్య్గూ చేయకు అంజు.. మర్యాదగ మాతో వస్తావా..? రావా…
అంజు: రాను మిస్సమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మీతో నేను అస్సలు రాను
ఆకాష్: నాకు అంజు చెప్పింది కరెక్టు అనిపిస్తుంది అమ్ము.. మనం అనవసరంగా మిస్సమ్మను నెగటివ్‌గా చూస్తున్నాము..
అమ్ము: అది ఆకాష్ ఆంటీ చెప్పిందే కరెక్టు.. రేపటి నుంచి మిస్సమ్మ మన గురించి అసలు ఆలోచించదు
అంజు: మిస్సమ్మ ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తుంది..
అమ్ము: ఇప్పటి వరకు మన గురించే ఆలోచిస్తుంది. కానీ రేపు బేబీ వచ్చాక మనల్ని అదిలిస్తుంది. అంతే కదా ఆనంద్
ఆనంద్: ఏమో అమ్ము నాక్కూడా మిస్సమ్మను తప్పు పట్టాలి అనిపించడం లేదు
మను: ( మనసులో కష్టపడి వీళ్ల మనసును పొల్యూట్ చేస్తే.. ఇప్పుడు అంజు మాట్లాడింది విని అంతా భాగీ వైపు వెళ్లేలా ఉన్నారే..) మీరు చిన్న పిల్లలు ఆనంద్ పెద్ద వాళ్లు ఎప్పుడు ఎలా మారతారో మీకు తెలియదు..
అంజు: మిస్సమ్మ ఎప్పటికీ మారదు
అమ్ము: అలా అని నువ్వు గ్యారంటీ ఇస్తావా..? చెప్పు గ్యారంటీ ఇస్తావా..?
మను: ఇప్పుడు డిసకర్షన్ ఎందుకు అమ్ము.. స్కూల్కు టైం అవుతుంది కదా..? పదండి వెళ్దాం
అమ్ము: వచ్చి కారెక్కు అంజు
అంజు: నేను మీతో రానని చెప్పాను కదా..?
అమ్ము: రాకపోతే కాళ్లు విరగొడతాను.. ఆనంద్ ఆకాష్ వచ్చి కారు ఎక్కండి
అంటూ అమ్ము కోపంగా చెప్పగానే..ఆనంద్, ఆకాష్ కారెక్కుతారు.. అంజును అమ్ము బలవంతంగా కారెక్కిస్తుంది. కోపంగా చూస్తున్న అంజును మను చూసి దీనితో జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















