Nindu Noorella Saavasam Serial Today October 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని అనుమానించన అమర్ - సంతోషంలో మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode October 21st: అమర్‌కు తెలియకుండా అబార్షన్ కోసం సంతకం చేయించుకుంటుంది భాగీ. తర్వాత అమర్ భాగీని అనుమానించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లడానికి భాగీ రెడీ అవుతుంది. అప్పుడే కిందకు వచ్చిన అమర్ టిఫిన్ చేస్తూ.. భాగీని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.
భాగీ: హాస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్తున్నానండి
అమర్: సారీ భాగీ ఈ టైంలో నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను.. నాకన్నా నువ్వు నన్ను ఎక్కువ అర్థం చేసుకున్నావు. నిజానికి నేనే దగ్గరుండి నిన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించాలి. కానీ ఆఫీసులో హెవీ వర్క్ ఉండి నేను వెళ్లక తప్పడం లేదు. అది అర్థం చేసుకుని నువ్వే సొంతంగా హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలనుకుంటున్నావు అంతే కదా
భాగీ: అవునండి..
అమర్: థాంక్యూ భాగీ ఈ సారి నీతో రాలేకపోయినా నెక్ట్స్ టైం తప్పకుండా వస్తాను.. ఐ ప్రామీస్
భాగీ: (మనసులో) ఆ అవసరం ఎప్పటికీ రాదులేండి
అమర్: ఇప్పుడు నీతో రాథోడ్ వస్తాడు. నీకేం భయం లేదు.. హాస్పిటల్ లో అన్ని తనే చూసుకుంటాడు. రాథోడ్ మిస్సమ్మను జాగ్రత్తగా హాస్పిటల్ కు తీసుకెళ్లి టెస్టులు చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకురా
రాథోడ్: (మనసులో భగవంతుడా ఈ పాపంలో నాకు భాగం పంచుతున్నావా..? స్వామి) సార్ నేను పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లాలి
అమర్: పిల్లలతో పాటు మిస్సమ్మను కూడా తీసుకెళ్లు.. పిల్లలను స్కూల్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత మీరు హాస్పిటల్‌కు వెళ్లండి
రాథోడ్: అది కాదు సార్
అమర్: ఏంటి రాథోడ్ అంత కంగారు పడుతున్నావు.. నేను మిస్సమ్మను తీసుకెళ్లమంటుంది వార్ జోన్‌కు కాదు.. హాస్పిటల్‌కు
మను: ( మనసులో) రాథోడ్ కంగారు పడుతుంది దాని కడుపులో బిడ్డను చంపే పాపంలో ఎలా పాలు పంచుకోవాలా..? అని
అమర్: మిస్సమ్మకు నువ్వైనా తోడుగా వెళ్లినే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది.
రాథోడ్: సరే సార్
అమర్: సరే భాగీ నేను ఆఫీసుకు వెళ్తున్నాను.. నువ్వు టెన్షన్ పడకుండా హాస్పిటల్ కు వెళ్లిరా
అంటూ వెళ్లబోతుంటే..
భాగీ: ఏవండి ఒక్క నిమషం ఆగండి.. (అని లోపలికి వెళ్లి హాస్పిటల్ ఫైల్ తీసుకొచ్చి అమర్‌కు ఇచ్చి) ఇందులో మీ సైన్ కావాలండి
అమర్: సైన్ ఏంటి..? ఎందుకు..?
మను: (మనసులో) అబార్షన్‌కు నీ అనుమతి కావాలి కదా అమరేంద్ర
భాగీ: అది టెస్టులకు వెళ్తున్నాను కదండి.. హాస్పిటల్ ఫార్మాలిటీ అంతే
అనగానే అమర్ సైన్ చేస్తుంటాడు.
మను: (మనసులో) నువ్వు చేస్తుంది సంతకం కాదు అమర్.. పుట్టబోయే నీ బిడ్డకు మరణశాసనం
అమర్ సంతకం చేసి వెళ్లబోతుంటే.. భాగీ హగ్ చేసుకుంటుంది.
భాగీ: ( మనసులో) నన్ను క్షమించండి మీకు తెలియకుండా బిడ్డను చంపేసుకుంటున్నాను. మీకు ఈ నిజం తెలిసిన రోజు మీరు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను.
అమర్ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు. ఇక రాథోడ్, భాగీ హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడి డాక్టర్‌కు విషయం చెప్పి అమర్ సంతకం చేసింది కూడా చూపిస్తుంది భాగీ. దీంతో డాక్టర్ అబార్షన్ చేయడానికి భాగీని అపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తుంది. మరోవైపు ఆఫీసులో ఉన్న అమర్‌కు భాగీ తీసుకున్న సంతకం గురించి అనుమానం వస్తుంది. వెంటనే హాస్పిటల్‌కు బయలుదేరుతాడు అమర్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















