(Source: Poll of Polls)
Nindu Noorella Saavasam Serial Today October 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరి ప్లాన్ సక్సెస్ - భాగీని తిట్టిన అమ్ము
Nindu Noorella Saavasam serial Today Episode October 20th: పిల్లలను భాగీకి దూరం చేయాలనుకున్న మనోహరి ప్లాన్ సక్సెస్ అవుతుంది. పిల్లలు భాగీని తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి ప్లాన్ ప్రకారం పిల్లలను భాగీకి దూరం చేయాలనుకుంటుంది. అందుకోసం పిల్లల దగ్గరకు వెళ్లి వాళ్ల మనసులో భాగీ మీద విషపు బీజాలు నాటుతుంది. భాగీ కన్సీవ్ అయిందని రేపు పాపో బాబో పుడితే మిమ్మల్ని మీ డాడీకి దూరం చేస్తుందని చెప్తుంది. దీంతో పిల్లలు ముగ్గరు భయపడిపోతారు. భాగీ మీద కోపం పెంచుకుంటారు. తర్వాత అందరూ స్కూల్‌కు వెళ్లడానికి కిందకు వస్తారు. హాల్లో ఉన్న భాగీని చూసి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటారు.
భాగీ: ఏంటి పిల్లలు ఎందుకు డల్లుగా ఉన్నారు.. ఏమైంది..?
పిల్లుల ఎవ్వరూ పలకరు.. మౌనంగా ఉండిపోతారు. ఇంతలో అక్కడికి మనోహరి వస్తుంది. ఆరు కూడా వచ్చి డోర్ దగ్గర నిలబడి భాగీకి కనిపించకుండా చూస్తుంటుంది.
భాగీ: అంజు ఏమైంది నువ్వైనా చెప్పు అంజు..
అంజు: ఏం లేదు మిస్సమ్మ..
భాగీ: ఏం లేకపోతే ఎందుకు డల్లుగా ఉన్నారు..? చెప్పండి పిల్లలు ఎవరైనా ఏమైనా అన్నారా..? స్కూల్ లో ఏదైనా ప్రాబ్లమా..? చెప్పండి.. పిల్లలు..
అంజు: ఏం లేదని చెప్పాము కదా మిస్సమ్మ.. మళ్లీ మళ్లీ ఏమైంది అని అడుగుతూ విసిగిస్తావేంటి…?
భాగీ: అమ్మో అంజుకు కోపం వచ్చిందా..? అయినా ఏదో ఉంది. మీరు నాతో ఏదో దాస్తున్నారు.. సరే లేండి పదండి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను
అంటూ పిల్లల చేతిలో ఉన్న బ్యాగ్స్ భాగీ తీసుకుంటుంది. దీంతో అమ్ము కోపంగా బ్యాగ్ లాక్కుంటుంది.
అమ్ము: ఏమీ అక్కర్లేదు.. మేము వెళ్లగలం.. నువ్వు రావాల్సిన అవసరం లేదు.. రాథోడ్ ఉన్నాడు కదా మేము వెళ్లిపోతాం..
భాగీ: ఎందుకు అమ్ము ఏం జరిగింది. నేను ఎందుకు రాకూడదు.. మిమ్మల్ని డ్రాప్ చేయడానికి.. అయినా ఏం జరిగింది మీరెందుకు ఇంత మూడీగా ఉన్నారు.. చెప్పండి పిల్లలు..
అమ్ము: మాకు అంతా తెలుసు.. నువ్వు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. నీ గురించి మాకు నిజం తెలిసిపోయింది. ఇక నీతో మేము ఎప్పటికీ మట్లాడము..
రాథోడ్: అమ్ము ఏంటి ఆ మాటలు.. అసలు దేని గురించి అంటున్నావు నువ్వు.. మిస్సమ్మ గురించి మీకు ఏం తెలిసింది. ఎవరు చెప్పారు..? చెప్పు అమ్ము..
మను: కొంపదీసి భాగీ తల్లి అవ్వడం గురించి అయితే కాదు కదా..?
అనగానే భాగీ, రాథోడ్ కోపంగా మనోహరిని చూస్తుంటారు.
భాగీ: ( కోపంగా) మనోహరి నాకు నా పిల్లల మధ్యలోకి నువ్వు రాకు.. అయినా పిల్లల మనసుల్లో ఇలాంటి ఆలోచనలు నూరి పోసింది నువ్వే అయ్యుండొచ్చు అనుమానం వస్తుంది. నీకు ఎంత చెప్పినా మారవా మనోహరి.
అమ్ము: మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు.. అసలు ఎవరి మధ్యలోకి ఎవరు వస్తున్నారు మిస్సమ్మ.. మనోహరి ఆంటీ ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మా మధ్యలోకి వస్తుంది ఎవరు..? మా నాన్నకు మేం నలుగురం చాలు మరో బేబీ అవసరం లేదు..
అని అమ్ము చెప్పగానే.. భాగీ షాక్ అవుతుంది. డోర్ దగ్గర నిలబడి చూస్తున్న ఆరు ఇదంతా మనోహరి ప్లాన్ పిల్లల మనసు పాడు చేసింది ఈ మనోహరి అని కోపంగా తిట్టుకుంటుంది. మనోహరి మాత్రం పిల్లలు తన మాటలకు మారిపోయారని ఇక భాగీ చాప్టర్ క్లోజ్ అయినట్టే అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















