అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 1st:  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరిని ఆవహించిన ఆరు  ఆత్మ – తాయెత్తు కట్టడానికి వచ్చిన అంజు

Nindu Noorella Saavasam Today Episode:  మనోహరి ఇచ్చిన తాయోత్తు కట్టడానికి అంజు ఇంటికి వస్తుంది. అంజును చూడకుండా మనోహరి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  గుప్త ఆరు కోసం వెతుకుతుంటాడు. ఆరు  ఎక్కడ కనిపించదు. ఇంతలో యముడు  వచ్చి ఇంకా ఆ బాలికను తీసుకురాలేదేంటి అని అడుగుతాడు. పౌర్ణమి గడియలు  ముగిసే లోపు ఆ బాలికను తీసుకుని  వస్తాను అని గుప్త చెప్తాడు. గుప్త మాటలు ఆరు వింటుంది.  ఆరును చూసిన గుప్త షాక్‌ అవుతాడు. ఆరు మాత్రం ఏడుస్తుంది. నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పబోతుంటే నన్ను ఎలా మెసం చేయాలనిపించింది అని అడుగుతుంది. దీంతో ఇది మోసం కాదని ఇందులో నా వ్యక్తిగతం ఏమీ లేదని చెప్తాడు. మీరు నన్ను ఎప్పటికీ మోసం చేయరని అనుకున్నాను కదా అది నా తప్పే అంటుంది.  నీకు ఒక  సోదరుడిగా చెప్తున్నాను. ఇక్కడ అన్ని వదిలేసి ఇక వచ్చేయ్‌. నీకు ఈ ఇంటికి రుణం తీరింది బాలిక. మనం మా లోకానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది.

 అని గుప్త మంత్రాలు చదువుతుంటే ఆరుకు మనోహరి చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే లోపలికి  పరుగెత్తుకెళ్తుంది. వెనకాలే గుప్త బాలికా ఆగుము అంటూ వెనకాలే వెళ్తాడు. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. గుప్త ఇంట్లో వాళ్లను అందరినీ పరీక్షగా చూస్తుంటాడు. ఎవరిలోనూ ఆరు లేదని నిర్ధారించుకుంటాడు. తర్వాత మనోహరి రూంలోకి వెళ్లి చూస్తాడు గుప్త.

గుప్త: బాలికా ఇచ్చట ఉన్నది నీవేనని నాకు తెలుయును ఎందుకు ఇటుల చేయుచుంటివి. బాలికా నీవు ఈ శరీరం లో ఉండరాదు. వెంటను బయటకు  రమ్ము

ఆరు ఆత్మ: సారీ గుప్త గారు నేను రాలేను.

గుప్త: బాలికా నువ్వు ఈ బాలిక శరీరం నందు ఉండుట వలన నీకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో నీకు తెలియుట లేదు. రమ్ము బయటకు రమ్ము బాలిక. నీవు తన శరీరం నందు ప్రవేశించాలనే ఆ బాలిక అట్ట మాట్లాడింది.

ఆరు: నేను మనోహరి  ప్లాన్‌ చేస్తే మను బాడీలోకి రాలేదు గుప్త గారు. నేను నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వచ్చాను. నా ఇంటికి వచ్చిన సమస్య కోల్కత్తాలో మొదలైంది అనిపిస్తుంది. రణవీర్‌ మనోహరితో మొదలైంది అనిపిస్తుంది. అందుకే సమాధానాలు వెత్తుక్కుంటూ రణవీర్‌ దగ్గరకు వెళ్తున్నాను.

గుప్త: అది కాదు బాలికా.. నేను

ఆరు: రణవీర్‌, మనోహరి తన భార్య కాదని చెప్పడం వెనక మనును ఇక్కడే ఉంచడం వెనక కారణాలు తెలుసుకుంటే మా ఇంట్లో ఉన్న సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. నా పని అయిపోగానే నేనే వస్తాను గుప్త గారు. నాకేం కాదు. నన్నెవరూ ఏమీ చేయలేరు.

 అని చెప్పి గుప్త పిలుస్తున్నా వెళ్లిపోతుంది. మరోవైపు కారులో స్కూల్‌ కు వెళ్తున్న అంజుకు మనోహరి చెప్పింది గుర్తుకు వచ్చి కారు ఆపమని చెప్తుంది. ఎందుకని రాథోడ్‌ అడగ్గానే తాయెత్తు చూపిస్తుంది. మనోహరి ఆంటీ ఇది కట్టమని చెప్పింది నేను మర్చిపోయాను అంటుంది అంజు.  సాయంత్రం కడుదువులే రాథోడ్‌ వెళ్దాం పద అంటుంది అమ్ము. అంజు అది కాదు రాథోడ్‌ అని కారు దిగి పోతుంది. మీరు వెళ్లండి నేను వెళ్తాను అంటుంది. రాథోడ్‌ కూడా కారు దిగి అంజును పిలుస్తాడు. అయినా ఆగకుండా వెళ్లిపోతుంది. అంజు తాయోత్తు తీసుకుని ఇంటికి వెళ్తుంది.

గుప్త: బాలిక నువ్వు పెద్ద తప్పు చేయబోతున్నావు. నీవు  పెద్ద ప్రమాదంలో పడిపోతున్నావు. నా మాట వినుము బాలిక. బాలిక ఆగుము. బాలికా ఈ ఒక్కమారు నా మాట వినుము.

ఆరు:  విని మళ్లీ మోసపోలేను గుప్తగారు.

గుప్త: బాలిక ఈసారి నేను నీకు నిజం చెప్తున్నాను. ఈ ఒక్క రోజు ఏమీ చేయకు.

ఆరు: మీరు ఏ క్షణమైనా నన్ను తీసుకెళ్లిపోతారని నాకు అర్థం అయింది గుప్తగారు.

గుప్త: నీవు ఏ నిజం తెలుసుకున్నా ఎంత ప్రయత్నించినా జరగబోయేది ఆపలేవు. జరగాల్సింది మార్చలేవు.

ఆరు: అవునా సరే

 అంటూ కారు తీసుకుని వెళ్లిపోతుంది. ఇంతల అంజు పరుగెత్తుకొస్తుంది. నేను ఈవిడ కోసం వస్తే ఈవిడేంటి పట్టించుకోకుండా పోతుంది అనుకుంటుంది. ఇంతలో గుప్త వచ్చి తాయెత్తు చూసి భయపడతాడు. ఇంతలో యముడు  వచ్చి గుప్తను తిడతాడు. నీకు ఏమి చెప్తే ఏమీ చేస్తున్నావు అంటాడు. మరోవైపు అమర్‌ బాధగా ఉంటాడు టిఫిన్‌ చేయకుండా ఆలోచిస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget