Nindu Noorella Saavasam Serial Today May 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మను రూంలోకి వెళ్లిన అమర్ - కిటికీలోంచి గమనిస్తున్న భాగీ
Nindu Noorella Saavasam Today Episode: చిత్ర బస్టాండ్ నుంచి ఎస్కేప్ అవ్వడంతో అమర్ ఇంటికి వచ్చి మనోహరి రూంలోకి వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర బ్లాక్ మెయిలర్‌లా మనోహరికి కాల్ చేస్తుంది. తాను చెప్పిన చోటికి డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతుంది. దీంతో మనోహరి తాను రాలేదని తన ఫ్రెండ్‌ను పంపించానని చెప్తుంది.
చిత్ర: అయితే నన్ను అమరేంద్రకు కాకుండా ఆయన భార్య భాగీకి నిజం చెప్పమంటావా
మనోహరి: పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వు డబ్బులు అడిగావు ఇస్తున్నాను ఎవరు ఇస్తే ఏంటి..?
అంటూ ఫోన్ మ్యూట్‌లో పెట్టి మరో ఫోన్ నుంచి రణవీర్‌కు కాల్ చేస్తుంది.
మను: చిత్ర ఫోన్ మాట్లాడుతుందా..?
రణవీర్: తన హెయిర్ అడ్డుగా ఉంది సరిగ్గా కనిపించడం లేదు
మను: అయితే దగ్గరకు వెళ్లి చూడు
చిత్ర: హలో మను..
మను: ఆ ఉన్నాను ఫ్లీజ్ ఈ ఒక్కసారి అర్థం చేసుకో అమర్‌కు నా మీద డౌటు వచ్చింది. నేను డైరెక్టుగా వచ్చి డబ్బులు ఇవ్వడం కుదరదు
చిత్ర: ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొక్క సారి
అంటూ రణవీర్ తన వైపు రావడం చూసి భయపడుతుంది.
మనోహరి: రణవీర్ అది ఫోన్ మాట్లాడుతుందా..?
రణవీర్: దగ్గరకు వెళ్తున్నాను
మనోహరి: హలో నా ఫ్రెండ్ డబ్బులు తీసుకుని వచ్చింది. డబ్బులు ఎక్కడ పెట్టాలో చెబితే నా ఫ్రెండ్ పెట్టేస్తుంది. హలో… రణవీర్ అది ఫోన్ మాట్లాడటం లేదు కచ్చితంగా అదే బ్లాక్ మెయిల్ చేస్తుంది.
రణవీర్: చిత్ర ఆటో ఎక్కి వెళ్లిపోతుంది.
మను: ఏయ్ రణవీర్ తనను ఫాలో అవ్వు
రణవీర్: సరే ఫాలో అవుతాను..
అంటూ కారు దగ్గరకు వెళ్తుంటే.. అమర్ వస్తాడు.
రణవీర్: అమర్ వచ్చాడు ఫోన్ కట్ చెయ్ మనోహరి.
భాగీ: అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు
రణవీర్: హలో అమరేంద్ర గారు మీరేంటి ఇక్కడ
అమర్: అది నేను అడగాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు. నీకు చిత్ర తెలుసా..?
రణవీర్: చిత్రనా తెలియదు అమరేంద్ర గారు ఎవరు తను
రాథోడ్: మీరు ఇందాక నుంచి ఫాలో అవుతూ వచ్చారు కదా ఆ అమ్మాయి సార్.
అమర్: బస్టాప్‌లో కూడా తనతో మాట్లాడాలని చూశారు కదా చిత్ర ఎలా తెలుసు నీకు చిత్రకు నీకు ఏంటి పరిచయం
రణవీర్: మనిషే తెలియదు అంటుంటే ఎలా పరిచయం అంటే ఏమని చెప్తాను అమరేంద్ర గారు. నేను ఎవరిని ఫాలో అవుతూ ఇక్కడికి రాలేదు. నా వైఫ్ ఈ ఏరియాలో కనిపించింది అని చెబితే తన కోసమే కోల్ కతా నుంచి ఉదయమే వచ్చాను. రోజూ ఇదే బస్టాప్ కు వస్తుందని చెప్పారు. అందుకే ఇక్కడే ఉంటే కనిపిస్తుందని ఇక్కడికి వచ్చాను
అమర్: అవునా.. నేను ఇంకేదో అనుకున్నాను..
రణవీర్: ఏమైంది అమరేంద్ర గారు ఇంట్లో అంతా ఓకేనా..? మొన్న కూడా ఇలానే ఏదో డౌటు అని కోల్‌కతా వరకు వచ్చారు.. ఇప్పుడేమో ఇలా .. ఆర్‌యూ ఓకే అమరేంద్ర గారు..
అమర్: యా ఐ యామ్ ఫైన్ జస్ట్ జాగ్రత్తగా ఉంటున్నాను.. నీ వైఫ్ డీటెయిల్స్ ఇవ్వు మా వాళ్లతో వెతికిస్తాను..
రాథోడ్: టెన్షన్ పడతారేంటి సార్ ఇవ్వండి
రణవీర్: చాలా రోజులు తర్వాత కనిపించింది. తనని మళ్లీ పోలీసులు ఫాలో చేస్తున్నారు అని తెలిస్తే మళ్లీ కనిపించకుండా పోతుందేమో..?
అమర్: సరే ఓకే రణవీర్..
అంటూ వెళ్లిపోతాడు. భయంతో మనోహరి దగ్గరకు వెళ్తుంది చిత్ర. చిత్రను చూసి కోపంతో రగిలిపోతుంది మనోహరి. చిత్ర భయంతో జస్ట్ మిస్ అమరేంద్ర గారికి దొరికిపోయేదాన్ని అని చెప్తుంది. మనోహరి మాత్రం కోపంగా ఏయ్ నటించకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. బెదిరిస్తుంది నువ్వే అని నాకు తెలుసు. అది కనిపెట్టడానికే ఇదంతా చేశాను. నిజం చెప్పు నన్ను బెదిరిస్తుంది నువ్వే కదూ అంటూ నిలదీస్తుంటే ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని అమర్, రాథోడ్ వస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















