Nindu Noorella Saavasam Serial Today May 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: చిత్రకు డబ్బులు ఇచ్చిన మను – కిటికీలోంచి అంతా గమనించిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: ఎవ్వరికీ తెలియకుండ చిత్రను ఇంటికి పిలుస్తుంది మనోహరి అయితే చిత్ర రావడం మనోహరి చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని లాన్‌లోకి తీసుకెళ్లడానికి వీర్ చైర్‌తో వచ్చిన రాథోడ్ ను భాగీ తిడుతుంది. వీర్ చైర్‌ను విరగ్గొట్టమని రాథోడ్‌కు చెప్తుంది. రాథోడ్ వీర్ చైర్ విరగ్గొడతాడు. ఇంతలో అమర్ రూంలోకి వస్తాడు. భాగీ ఏమీ తెలియనట్టు వీల్ చైర్ ఇరిగిపోయిందని బాధపడుతుంది.
భాగీ: లాన్‌లో కూర్చుంటే బాగుండు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ చాన్స్ కూడా లేకుండా పోయింది.
రాథోడ్: అమ్మా మిస్సమ్మ నిన్ను, సారును ఎలా కలపాలా అని మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే.. ఒక్క సెకనులో ప్లాన్ చేసి నన్ను ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నావా..? (మనసులో అనుకుంటాడు.)
భాగీ: సరేలే రాథోడ్ నాకు లాన్‌లో కూర్చుని కాఫీ తాగే అదృష్టం కూడా లేదనుకుంటా.. ఆ కాఫీ ఏదో ఇక్కడికే తీసుకురా
రాథోడ్: అలాగే మిస్సమ్మ పాపం నిన్ను చూస్తుంటే.. చాలా బాధగా ఉంది. ఒక్క కాఫీ కూడా నువ్వు అనుకున్నట్టు తాగలేకపోతున్నావు నేను.. వెళ్లి కాఫీ తీసుకుని వస్తాను.. మిస్సమ్మ నేను వెళ్తున్నా…
అమర్: రాథోడ్ ఆగు..
అంటూ వెళ్లి భాగీని తన చేతులతో ఎత్తుకుని లాన్‌లోకి తీసుకెళ్తాడు అమర్. అక్కడే కాఫీ తాగుతున్న మనోహరి అమర్ భాగీని ఎత్తుకుని రావడం చూసి షాక్ అవుతుంది. అమర్ భాగీని మనోహరి ఎదురుగా కూర్చోబెడతాడు.
భాగీ: చాలా థాంక్స్ అండి మీరు కూడా కూర్చోండి.. మనోహరిగారు చెప్పడం మర్చిపోయాను సారీ అండి..
అమర్: మిస్సమ్మ మనోరికి ఎందుకు సారీ చెప్తున్నావు
భాగీ: ఎందుకేంటండి ఇవాళ మనోహరి గారిని నలుగురు నాలుగు మాటలు అంటున్నారు అంటే దానికి కారణం నేనే కదా
మనోహరి: నన్ను ఎవరు ఏమి అంటున్నారు
భాగీ: ఆయనతో అవ్వాల్సిన మీ పెళ్లి… పీటల మీదనే ఆగిపోవడానికి కారణ నేనే అని మీరు నా మీద పగ పెంచుకున్నారు అంటున్నారు. నా అడ్డు ఎలాగైనా తొలగించి మీరు మళ్లీ ఆయన్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అంటున్నారు. ఏ సబంధం వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదని ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నావు అంటున్నారు
మను: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు.. నేను ఏమీ అలా అనుకోవడం లేదు.
భాగీ: అరే నాకు తెలియదా మనోహరి గారు మీరు అలా అనుకోరు అని కానీ నలుగురు అంటున్నారు అంటున్నాను.. అంటే వాళ్లకు మీ గురించి పూర్తిగా తెలియదు కదా..? ఇందాక కరుణతో మాట్లాడుతుంటే మీరు కావాలనే నన్ను కింద పడేశారేమోనని తనకు డౌటుగా ఉందని చెప్పింది.
మను: ఏయ్ నేను పడేయడం ఏంటి..? అమర్ భాగీ పడ్డప్పుడు నేను అసలు లేనే లేను
భాగీ: మనోహరి గారు నేను కరుణకు చెప్పానులే.. నేను కింద పడటానికి మనోహరిగారికి ఎలాంటి సంబంధం లేదని .. కరుణ అంటే నా ఫ్రెండు కాబట్టి చెప్పగలిగాను. ఇలా నీ గురించి తప్పుగా అనుకునే అందరికీ నేను చెప్పలేను కదా మనోహరి గారు. నా వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది కదా అని మీకు సారీ చెప్తున్నాను. అదే మీరు ఒక ఇంటి కోడలు అయి ఉంటే ఇన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు. ఏమంటారు అండి..
అమర్: అవును భాగీ.. కరెక్టుగా చెప్పావు.. అమ్మవాళ్లు మనుకు సంబంధం చూస్తా అని చెప్పారు ఇప్పుడే వెళ్లి ఆ విషయం ఎంత వరకు వచ్చిందో కనుక్కుంటాను.
మను: పర్వాలేదు అమర్ ఎవరు ఏమనుకున్నా నాకు బాధగా లేదు
అని చెప్తుండగానే.. అమర్ వెళ్లిపోతాడు.
మను: ఏయ్ నిజం చెప్పు ఎవ్వరూ అలా అనలేదు కదా.. ? నువ్వే కావాలని అన్నావు కదా..?
భాగీ: ఏంటి మను నీకు ఇంకా డౌటు గానే ఉందా..? నీకు ఈ పాటికే క్లారిటీ వచ్చింది అనుకున్నానే
అంటూ భాగీ చెప్పగానే.. మనోహరి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత చిత్ర మెల్లగా ఇంట్లోకి వస్తుంది. మనోహరి రూంలోకి వెళ్తుంది. పై నుంచి అంతా గమనిస్తుంది భాగీ.
భాగీ: వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి.
మను: ఇంత లేట్ అయిందేంటి త్వరగా రమ్మని చెప్పాను కదా.. ఇదిగో ఈ బ్యాగు తీసుకో..
చిత్ర: ఈ బ్యాగ్ ఏంటి మను..
అంటూ ఓపెన్ చేయగానే అందులో డబ్బులు ఉంటాయి. ఇంత డబ్బు నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతంది. కిటిక దగ్గర నుంచి గమనిస్తున్న భాగీ షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















