Nindu Noorella Saavasam Serial Today March 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మీనన్‌కు హెల్ప్ చేసిన మను - డేంజర్‌లో పిల్లలు, మినిష్టర్
Nindu Noorella Saavasam Today Episode: స్కూల్ లోకి రావడానికి మీనన్‌కు మనోహరి హెల్ప్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి సాయంతో స్కూల్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటాడు మీనన్. వెంటనే మనుకు ఫోన్ చేస్తాడు. మీనన్ వాయిస్ విన్న మనోహరి షాక్ అవుతుంది.
మీనన్: హలో మనోహరి ఎలా ఉన్నావు. ఏంటి మనోహరి ఎలా ఉన్నావని అడిగితే ఏం చెప్పట్లేదు.
మనోహరి: నీకేం కావాలి మీనన్.. నాకెందుకు ఫోన్ చేశావు.
మీనన్: నీలో నాకు నచ్చే విషయం ఇదే మనోహరి.. స్ట్రెయిట్‌గా పాయింట్‌కు వచ్చేస్తావు. ఇచ్చిన పని క్లీన్‌గా చేస్తావు.
మనోహరి: నీకు నాతో ఏం పని ఉందో తెలియదు కానీ నేనైతే చేయలేను. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు.
మీనన్: ఫోన్ కట్ చేస్తే నా నెక్ట్స్ కాల్ అమర్‌కు వెళ్తుంది. అమర్‌కు నీ బెంగాళీ మొగుడి గురించి నీ పంతం గురించి తెలియదు అనుకుంటా.. చెప్పేయనా..?
మనోహరి: వద్దు నీకేం కావాలో చెప్పు
మీనన్: మేము లోపలికి రావాలి. అమర్ సెక్యూరిటీ వల్ల లోపలికి రాలేకపోతున్నాము.
మనోహరి: అమర్‌కు విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు.
మీనన్: నేను ఫోన్ చేసి నిజం చెప్పినా చంపేస్తాడు. కానీ నేను అలా చేయను. నీకు 50 లక్షల డబ్బు ఇస్తాను.. ఆలోచించుకో మనోహరి
మనోహరి: సరే.. నాకు కొద్దిగా టైం ఇవ్వండి నేనే ఫోన్ చేస్తాను
అని మనోహరి ఆలోచిస్తుంది. మరోవైపు లోపల పిల్లలు రెడీ అవుతుంటారు. ఒక టీచర్ వచ్చి అమ్మును రెడీగా ఉండమని చెప్తాడు.
భాగీ: అమ్ము అన్ని స్టెప్స్ గుర్తు ఉన్నాయి కదా..?ఆడియన్స్ లో నేను ఉంటాను. భయం అనిపిస్తే నన్ను చూడు..
అంజు: మిస్సమ్మ ఏమైంది నీకు రెండు రోజుల నుంచి నన్ను జాలిగా చూస్తున్నావు. డిఫరెంట్‌గా మాట్లాడుతున్నావు
భాగీ: అంజు అనాథ అని తెలిసినప్పటి నుంచి నాకు తెలియకుండానే నేను తేడా చూపిస్తున్నట్టున్నానేమో.. దీనికి భయపడి ఆయన నిజాన్ని దాచినట్టు ఉన్నారు (అని మనసులో అనుకుంటూ) అంటే నీకు డ్రామాలో పూర్ క్యారెక్టర్ ఇచ్చారు కదా నిన్ను చూసి జాలిపడుతున్నాను.
అమ్ము: మిస్సమ్మ నా పర్ఫార్మెన్స్ కు టైం అయింది. ఇంకా డాడీ రాలేదేంటి..?
అని అమ్ము అడగ్గానే భాగీ నేను వెళ్లి తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్తుంది భాగీ. కంగారుగా బయటకు వెళ్లిన భాగీ అమర్‌ను డాష్ కొడుతుంది.
భాగీ: అది బాడీయా బండరాయా..? అయినా ఏంటా కంగారు.. కొంచెం చూసుకుని నడవొచ్చు కదా..?
అమర్: ఏయ్ లూజ్ చూసుకోకుండా వచ్చింది నువ్వు అయినా నువ్వు బయట తిరుగుతున్నావేంటి..?
భాగీ: మీ కోసమే వచ్చాను అమ్ము పర్ఫామెన్స్ స్టార్ట్ అవుతుంది మీరు రండి
అమర్: నేను వర్కులో ఉన్నాను కదరదు.
భాగీ అమాయకంగా చూస్తూ.. అమర్‌ను బతిమాలుతుంది. అమర్ సరే అనగానే.. చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది భాగీ. ఇంతలో లోపల అమ్ము డాన్స్ చేస్తుంది. భాగీ, అమర్, అనామిక చూస్తుంటారు. ఇంతలో ఒక పోలీస్ వచ్చి మినిస్టర్ వస్తున్నారట అని అమర్‌కు చెప్పగానే అమర్ బయటకు వస్తాడు. ఇంతలో మినిస్టర్ వస్తాడు. ఆడిటోరియంలోకి వెళ్లిపోతాడు. అమర్ అనుమానంగా చూస్తుంటాడు.
పోలీస్: ఏమైంది సార్ అలా చూస్తున్నారు..?
అమర్: ఆ రౌడీలు ఇక్కడకు వచ్చి రెక్కీ నిర్వహించి.. అటాక్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా అటాక్ చేయలేదు ఎందుకని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది.
అని అమర్ చెప్తుండగానే.. మరోవైపు మనోహరి స్కూల్ లోకి మీనన్ రావడానికి ప్లాన్ చెప్తుంది. మనోహరి చెప్పినట్టుగానే మీనన్ స్కూల్ లోకి ఎంటర్ అవుతాడు. ఇంతలో అమర్‌కు అనుమానం వచ్చి మీనన్ వస్తున్న వైపు వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















