Nindu Noorella Saavasam Serial Today March 29th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఇంట్లో ప్రత్యక్షమైన అరుంధతి తాళి - మనోహరికి మిస్సమ్మ వార్నింగ్
Nindu Noorella Saavasam Today Episode: కనిపించకుండా పోయిన ఆరు తాళి ఇంట్లో ప్రత్యక్యం కావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి తన కూతురు మిస్సమ్మ పెళ్లి గురించి పంతులును అడగ్గానే ఈ జాతకం ఉన్న అమ్మాయికి వచ్చే పౌర్ణమికి పెళ్లి కాబోతుందని.. కొత్తగా మళ్లీ సంబంధం చూడటమేంటని పంతులు చెప్తాడు. ఈ అమ్మాయి పెళ్లికి దేవుడే ముహూర్తం నిర్ణయించాడని.. ఆ పెళ్లి పనులు విధి చేస్తుందని, ఈ పెళ్లితో మీ అమ్మాయి కష్టాలు తీరుతున్నాయని పంతులు చెప్పగానే రామ్మూర్తి సంతోషంతో భయపడతాడు. మూడు రోజుల్లో పెళ్లి అవుతుందని భయంగా ఉన్నా.. ఆ పెళ్లితో నా కూతురు కష్టాలు తీరతాయన్నందుకు సంతోషంగా ఉందంటాడు రామ్మూర్తి. మరోవైపు గుప్త తన దగ్గర ఉన్న అరుంధతి తాళి తీసుకెళ్లి ఇంట్లో హాల్ లో పెట్టి వస్తాడు. పిల్లలు ఆ తాళి చూసి అందర్ని పిలుస్తారు. తాళిని చేతితో పట్టుకుని చూసిన వైజయంతి షాక్ అవుతుంది.
నిర్మల: ఇది మన కోడలు అరుంధతి తాళి కదూ..
శివరాం: కొడైకెనాల్‌లో అరుంధతికి యాక్సిడెంట్ అయ్యాక పోయిన తాళి ఇన్ని రోజులకు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది.
అని అందరూ అంటుండగానే పైనుంచి వచ్చిన మిస్సమ్మ, వైజయంతి చేతిలో తాళిని చూసి షాక్ అవుతుంది. అప్పుడే బయట నుంచి వచ్చిన అమర్ కూడా తాళిని చూసి షాక్ అవుతాడు. ఇంతలో మిస్సమ్మ వచ్చి ఇది నా తాళి అని తీసుకుంటుంది.
అమర్: ఇది నీ తాళా?
మిస్సమ్మ: ఇది మీ ఆవిడ తాళా?
వైజయంతి: మిస్సమ్మ ఇది నీ తాళా?
అరుంధతి: నా తాళి పట్టుకుని అది తన తాళి అంటుందేంటి గుప్తగారు.
శివరాం: ఇది మా కోడలు చనిపోయినప్పుడు మిస్సయిపోయిందమ్మా? మళ్లీ ఇప్పుడు సడెన్‌గా ఇంట్లో తేలింది. మళ్లీ ఇప్పుడు నీది అంటున్నావేంటి?
మిస్సమ్మ: ఈ తాళిని ఇంట్లోకి నేనే తీసుకొచ్చానండి.
నిర్మల: మిస్సమ్మ ఈ తాళి నీ దగ్గరకి ఎలా వచ్చింది. మా కోడలు తాళి నీ దగ్గర ఉండటమేంటి? మాకేం అర్థం కావడం లేదు.
మిస్సమ్మ: నేను కొడైకెనాల్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఇది నాకే తెలియకుండా నా బ్యాగులో పడినట్టు ఉంది. ఈ తాళి నా బ్యాగులో ఉన్నది కూడా నేను హైదరాబాద్ వచ్చాక చూసుకున్నాను. అసలు ఈ తాళి ఎవరిదో నా దగ్గరకు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు.
గుప్త: అది నీ హక్కు కాబట్టి నీ దగ్గరకు చేరింది (అని మనసులో అనుకుంటాడు.)
శివరాం: నా కోడలికి నీకు ఏదో సంబంధం ఉంది మిస్సమ్మ. లేకుంటే ఎక్కడ కొడైకెనాల్, ఎక్కడ హైదరాబాద్. ఎక్కడ మా కోడలు, ఎక్కడ నువ్వు.
నిర్మల: అవును మిస్సమ్మ నిన్ను చూస్తూంటే అసలు మా కోడలును చూసిన్నట్లే అనిపిస్తుంది.
శివరాం: అవును మిస్సమ్మ నువ్వు మా కోడలు చనిపోయినప్పుడు నువ్వు కొడైకెనాల్ ల్లోనే ఉన్నావా?
మిస్సమ్మ: మా అక్కను కలవడానికి వెళ్లాను. మా అక్క ఎంతో ప్రేమతో కలవాలని అడిగితే తనని చూడటానికి వెళ్లాను.
నిర్మల: అవునా ఇంతకీ మీ అక్క పేరేంటి మిస్సమ్మ..
వైజయంతి: మిస్సమ్మ థాంక్యూ సో మచ్. నాకు చెందాల్సిన తాళిని భద్రంగా తీసుకొచ్చినందుకు.
శివరాం: అయినా నీ దగ్గర నుంచి పోయిన తర్వాత ఇన్ని రోజులకు మళ్లీ ఎలా వచ్చింది.
వైజయంతి: నా ఆరు నా కోసం ఈ తాళిని నా దగ్గరకు చేర్చింది. ఇప్పటివరకు నా ఫ్రెండుకు ఈ పెళ్లి ఇష్టమో లేదోనని.. నా ఫ్రెండుకు నేను అన్యాయం చేస్తున్నానేమోనని ఉండేది ఇప్పుడు నా ఆరే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లైంది.
అంటూ వైజయంతి నాటకం మొదలుపెట్టగానే మిస్సమ్మ నిజంగానే మేడం మీ పెళ్లికి ఒప్పుకున్నట్లుంది. ఇప్పుడు ఈ తాళిని మేడం నగలు అన్నీ కలిపి మేడం ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకో అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో తేరుకుని ఆ నగలు మెరుగు పెట్టడానికి షాపులో ఇచ్చానని రేపు తీసుకొస్తానని చెప్పడంతో అందరూ సరేనని వెళ్లిపోతారు. దీంతో మిస్సమ్మ, మనోహరికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.