Nindu Noorella Saavasam Serial Today March 27th: మిస్సమ్మ కోసం బయటకు వెళ్లిన అమర్ - ఆరు, అమర్ రావడాన్ని చూసి షాక్ అయిన మిస్సమ్మ
Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మను వెతుక్కుంటూ అమర్ వెళ్లడంతో మనోహరి ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి పిల్లలను పిలిచి డిన్నర్ చేయండని చెప్తుంది. క్యాంపుకు కావాల్సినవన్నీ సర్దుకున్నారా? అంటూ అడుగుతుంది. దీంతో పిల్లలు కోపంగా చూస్తుంటారు. ఇంతలో అమర్ వచ్చి మిస్సమ్మ ఎక్కడ అని అడగడంతో మనోహరి కోపంగా చూస్తూ బయటకు వెళ్లిందేమో తర్వాత తింటుంది. నువ్వైతే తిను అంటూ పనివాళ్లని మనవాళ్లు అనుకుంటే ఇలాగే ఉంటుంది అనగానే వెంటనే నువ్విచ్చిన నగ మళ్లీ మనోహరి తీసుకుంది అందుకు ఫీల్ అయ్యిందేమో అంటూ నిర్మల అనగానే బంగారం కోసం ఫీల్ అయ్యే మనస్తత్వం కాదు తనది అంటూ తనను తీసుకొస్తాను అంటాడు అమర్.
మనోహరి: అమర్ ఎక్కడని వెతుకుతావు.
శివరాం: అవును అమర్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది ఎక్కడుందో తెలియదు కదా? నువ్వెల్లి ఎలా తీసుకొస్తావు.
అమర్: తను ఎక్కడుంటుందో నాకు తెలుసు నాన్నా నేను వెళ్లి తీసుకొస్తాను.
అంటూ అమర్ బయటకు వెళ్లగానే మనోహరి ఇరిటేషన్‌గా చూస్తుంటుంది. అమర్ బటయకు వెళ్తుంటే అరుంధతి చూసి గుప్తను నిద్ర లేపుతుంది. అమర్ ఎక్కడికో వెళ్తున్నారు వెళ్లి కనుక్కోండి అని చెప్తుంది. దీంతో గుప్త కోపంగా నేను అడగాలా నువ్వు తోడుగా వెల్లి తెలుసుకోవచ్చుగా అంటాడు. దీంతో అవునుగా అంటూ అరుంధతి ఏవండి నేను వస్తున్నాను ఆగండి అంటూ గట్టిగా పిలవడంతో అమర్ వెంటనే బండి ఆపేస్తాడు. అరుంధతి వచ్చి కూర్చోగానే ఎవరో తన బండి మీద కూర్చున్నట్లు ఫీలవుతాడు అమర్. మిస్సమ్మ ఒంటరిగా కూర్చుని మనోహరి గురించి ఆలోచిస్తుంది. మనోహరి పెళ్లి ఎలాగైనా ఆపాలని ఆలోచిస్తుంది. ఇంతలో అమర్ వస్తాడు. అరుంధతి బైక్ దిగడం చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. అలాగే అక్కడ మిస్సమ్మను చూసి ఆరు షాక్ అవుతుంది. ఇంతలో ఆరు పక్కకు వెళ్లిపోతుంది. తన దగ్గరుక వచ్చిన అమర్‌ను మిస్సమ్మ ఆవిడ మీ బైక్ మీద వచ్చిందేంటని అడుగుతుంది.
అమర్: ఎవరో పక్కింటావిడ నాకు తెలియకుండా నా బైక్ మీద రావడం ఏంటి? ఎవర్ని చూసి ఎవరనుకున్నావో.. అయినా ఆ పక్కింటావిడ నీ మాటల్లో తప్ప ఎప్పుడూ కనిపించదు.
మిస్సమ్మ: నేను చూసింది అక్కనే కదా మరి ఈయనేంటి ఎవరూ లేరంటున్నారు.
అమర్: మిస్సమ్మ ఈ లోకంలోనే ఉన్నావా?
మిస్సమ్మ: అయినా మీరేంటి ఇక్కడ అదికూడా ఈ టైంలో
అమర్: నీ కోసమే వచ్చా? ఇంట్లో పిల్లలు అమ్మా నాన్న నువ్వు ఎక్కడికి వెళ్లావో అని కంగారుపడుతున్నారు. పద వెళ్దాం.
మిస్సమ్మ: నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పలేదు. మరి మీకెలా తెలిసింది.
అమర్: నీ మనసు బాగాలేనప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడికే వస్తావు కదా? అందుకే వచ్చాను.
అంటూ ఇక వెళ్దామా అనగానే కొద్దిసేపు కూర్చుని వెళ్దాం అని అడుగుతుంది. అమర్ సరే అని అక్కడే పక్కనే కూర్చుంటాడు. మిస్సమ్మ కూడా అమర్ పక్కన కూర్చోగానే దూరంగా చెట్టు పక్కన దాక్కున అరుంధతి కనిపిస్తుంది. దీంతో మిస్సమ్మ అరుంధతిని అక్కా అంటూ పిలుస్తూ వెళ్తుంది. అరుంధతి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మిస్సమ్మ వచ్చి నువ్వు ఇక్కడున్నావేంటి? అని అడగ్గానే ఆరు స్టోరీ చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో అమర్ వచ్చి మిస్సమ్మను వెళ్తాం పద అంటూ పిలుస్తాడు. ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. తర్వాత మనోహరి రూంలో కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది.
మనోహరి: దీన్ని చూసి రమ్మంటే కాల్చి వస్తుందేమో? బయట లోపల ఎవరైనా ఉన్నారేమో చూసి రమ్మంటే ఇప్పుడు ఏం చేసి వస్తుందో ఏమో? ఏయ్ ఎవరైనా ఉన్నారేమో చూసి రమ్మంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు.
నీల: నేను ఇంట్లో పని చేసుకునే దాన్ని అమ్మా ఇలా దొంగతనాలు చేయడం నాకేమైనా అలవాటా?
మనోహరి: అంటే నాకేమైనా అలవాటా?
నీల: ఏమో ఎవరికి తెలుసు? ఒకటే నెలలో ఇది రెండో దొంగతనం అమ్మా ఇక మీకు అలవాటనే అంటారు కదా?
అనడంతో ఇదంతా నా ఆస్థి అంటూ.. నేను చెప్పింది మాత్రమే చెయ్యి అంటూ నగల బ్యాగు నీలకు ఇచ్చి పంపిస్తుంది మనోహరి. నగలు తీసుకుని బయటకు వెళ్తున్న నీలను రాథోడ్ అపడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఎయిర్‌పోర్టులో కాజల్ అగర్వాల్ సందడి - ఆమె కొడుకును చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నాడో