Nindu Noorella Saavasam Serial Today June 5th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ – వద్దని ఓదార్చిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: వినోద్ టార్చర్ భరించలేక భాగీ బాధపడుతుంటే అమర్ వచ్చి ఓదారుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఫోటో ఉన్న రూం కీస్ తీసుకుని ఈరోజు ఎలాగైనా ఆరు ఫోటో చూడాలనుకుని భాగీ రూం దగ్గరకు వెళ్లి తాళం తీయబోతుంటే.. వెనక నుంచి మనోహరి వచ్చి ఆపేస్తుంది. దీంతో భాగీ కోపంగా చూస్తుంది. చేతిలో కీస్ లాక్కుంటుంది మనోహరి.
భాగీ: మను ఏం చేస్తున్నావు అంటుంది.
మనోహరి: అది నేను అడగాలి. నువ్వు ఈ రూం ఎందుకు ఓపెన్ చేస్తున్నావు..
భాగీ: ఏ ఎందుకు చేయకూడదు
మనోహరి: నువ్వు ఓపెన్ చేయకూడదు. ఇది ఆరు రూం ఈ రూంలోకి అమర్ పర్మిషన్ లేకుండా వెళ్లకూడదు
భాగీ: పిచ్చి మను పర్మిషన్స్ అన్ని బయటి వాళ్లకు. అంటే నీలాంటి వాళ్లకు నేను ఆయన భార్యను ఈ ఇంట్లో సర్వాధికారాలు నాకు ఉన్నాయి. నీకు ఇంకా క్లారిటీ కావాలంటే వెళ్లి ఆంటీ వాళ్లను అడుగు
మను: నువ్వు ఈ రూం ఓపెన్ చేస్తున్నావని ఇప్పుడే వెళ్లి అమర్‌కు చెప్తాను ఉండు
భాగీ: దాంతో పాటు నువ్వు నాకు ఎవరి ఫోటోనో చూపించి ఆరు అక్కా అని చెప్పిన విషయం కూడా చెప్పు.. అంత షాక్ అయినట్టు యాక్ట్ చేయకు మను. నిజం నాకు తెలిసిపోయిందన్న విషయం నీకు తెలిసిందని నాకు తెలుసు. అసలు నువ్వు ఎందుకు అబద్ద చెప్పావనే నేను ఫోటో చూద్దాం అనుకునేది. నీ కళ్లల్లో భయం ఆ కంగారు.. అసలు ఆ డోర్ అవతల ఉన్న ఆరు అక్క ఫోటో చూస్తే నీకొచ్చే నష్టం ఏంటి..? ఏంటి చెప్పవా..? సరేలే నేనే చూస్తాను.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు.. వెళ్లు మను లేదంటే నేను ఆయన్ని పిలిచి నిజం చెప్పమని అడగడం ఆయన నిన్ను నిజం చెప్పమనడం అవసరమా చెప్పు
మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మొత్తం చాటు నుంచి వింటున్న అనామిక కంగారుగా భాగీ లాక్ తీయబోతుంటే.. వచ్చి ఆపేస్తుంది. తన మాటలతో భాగీని కన్వీన్స్ చేసి రూం తాళం తీయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తుంది. ఇంతలో మనోమరి వస్తుంది.
మనోహరి: అసలు నువ్వు నువ్వేనా..? భాగీ, ఆరు ఫోటో చూడకుండా చేయాలని నాకో కారణం ఉంది. కానీ నువ్వెందుకు ఆపేస్తున్నావు
అనామిక: భాగీ ఆ ఫోటో చూస్తే మళ్లీ బాధపడుతుందని చూడకుండా చేస్తున్నాను.
మనోహరి: అబద్దం ఎంత చక్కగా చెప్తున్నావే.. ఇంకా అనామిక ముసుగులో ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను. అయినా.. భాగీ నిజానికి దగ్గరగా ఆలోచిస్తుంది. నా గురించి నిజం తెలిస్తే ఆ ముసలోళ్లు, భాగీ ముగ్గురు కలిసి నన్ను ఇంట్లోంచి వెళ్లగొడతారు. ఇదంతా జరగకూడదు అనుకుంటే చిత్రను వినోద్ పెళ్లి చేసుకోవాలి. ( మనసులో అనుకుంటుంది) వెంటనే వినోద్ రూంలోకి వెళ్లిపోతుంది.
వినోద్: చెప్పండి మనోహరి గారు ఇలా వచ్చారేంటి..?
మను: ఏం లేదు వినోద్ నీ ఫ్రెండ్ చిత్రకు పెళ్లి సెట్ అయిందంట కదా నీకు తెలుసా..?
వినోద్: ఏంటి మీరు అనేది
మను: అవును వినోద్ అబ్బాయి చాలా బాగున్నాడు. చిత్ర అనాథ అని చెప్పాక కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు
వినోద్: నిన్న చిత్ర ఇక్కడే ఉంది. కదా మరి నాకు ఎందుకు చెప్పలేదు. అసలు చిత్ర ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి..? చిత్ర పెళ్లికి ఒప్పుకుందా..?
మను: మంచి సంబంధం నేను వార్డెన్ ఒప్పుకోమని చెప్పాను. తన మనసులో మాట చెప్పడానికి టైం అడిగింది
అంటూ మనోహరి చెప్తుండగానే ఆగలేక వినోద్ వెంటనే చిత్రకు కాల్ చేస్తాడు. నీకు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది నిజమేనా అని అడుగుతాడు. చిత్ర ఆశ్చర్యంగా ఎవరు చెప్పారు అని అడుగుతుంది. మనోహరి గారు చెప్పారు అని వినోద్ చెప్పగానే.. చిత్ర షాక్ అవుతుంది. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర వినోద్ చిత్ర గురించి చెప్తుంటే.. భాగీ కలగజేసుకుంటుంది. దీంతో వినోద్ చిత్రను తిడతాడు.
వినోద్: ఎవరు ఎలాంటి వారో.. ఏ ఉద్దేశంతో ఇంట్లోకి అడుగుపెట్టారో కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. నా విషయంలో ఆవిడను జోక్యం చేసుకోవద్దని చెప్పండి నాన్న.
అని వినోద్ వార్నింగ్ ఇవ్వగానే భాగీ బయటకు వెల్లిపోతుంది. వెనకే వెల్లిన అమర్ భాగీని ఓదారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















