Nindu Noorella Saavasam Serial Today June 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అంజుకు అండగా అమర ఫ్యామిలీ – రణవీర్‌కు చెక్ పెట్టనన్న చిత్ర
Nindu Noorella Saavasam Today Episode: అంజును డిసప్సాయింట్ చేసిన మనోహరికి బుద్ది చెప్పేందుకు అమర్ ఫ్యామిలీ రంగంలోకి దిగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీకి దెబ్బ తగిలేలా చేసిన చిత్ర కావాలని తనకు తెలియనట్టు నటిస్తూ రూంలోకి వెళ్లిపోతుంది. వెనకే వినోద్, మనోహరి వెళ్తారు. ఇంతలో వినోద్‌కు ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు.
మను: చిత్ర నీ గురించి చాలా తక్కువ అంచనా వేశాను. ఇంట్లోకి వచ్చీ రాగానే దానికి దెబ్బ తగిలేలా చేశావు చూడు నిజంగా నువ్వు గ్రేట్. అసలు అది దెబ్బ తగిలి రక్తం వచ్చినా కూడా అది మౌనంగా వెళ్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా..? అయినా మోసం చేసి పెళ్లి చేసుకున్నావని వాళ్లందరికీ నిజం తెలుసని నీకు తెలిసినా ఎలా ఈ పని చేశావు. అసలు ఏం చూసుకుని నీకు అంత ధైర్యం
చిత్ర: (తాళి చూపిస్తూ) దీన్ని చూసుకునే నాకు అంత ధైర్యం ఇప్పుడు నేను అరుంధతి స్నేహితురాలు చిత్రను కాదు మను. ఈ ఇంటి చిన్న కోడలిని ఈ ఇంట్లో భాగీకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది
మను: ఇన్ని రోజులు వాళ్లు దాన్ని ఒక్క మాట అననివ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్లందరూ నోరు తెరవలేకపోవడం చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా
చిత్ర: ఏంటి ఇంత చిన్న దానికే అంత హ్యాపీ అవుతావా..? రేపు నేను ఆ భాగీని పర్మినెంట్‌గా ఈ ఇంట్లోంచి పంపించి వేస్తాను. నేను దాచేసిన నా గతాన్ని అందరికీ చెప్పాలనుకుంటుందా..? అందుకే భాగీని వెంటనే ఈ ఇంటికి బావగారికి దూరం చేస్తాను
మను: అదంతా ఈజీ కాదు చిత్ర అమర్‌కు ఇప్పుడే భాగీ మీద ప్రేమ మొదలైంది..
చిత్ర: నువ్వు చూస్తూ ఉండు నా మెడలో పడిన తాళి సాక్షిగా బావగారి చేతే భాగీని ఈ ఇంట్లోంచి బయటకు గెంటిస్తాను
మను: ఆరు ఎప్పుడూ తాళి పవర్ గురించి చెప్తుండేది.. దాని పవర్ అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది.. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు నేను ఈ ఇంటి కోడలు అయిపోతాను
చిత్ర: తర్వాత ఇద్దరం కలిసి ఈ ఆస్తిని అనుభవించవచ్చు
మనోహరికి రణవీర్ కాల్ చేస్తాడు.
మను: ఈ టైంలో వీడు కాల్ చేస్తున్నాడేంటి..?
రణవీర్: హలో మనోహరి నేను హైదరాబాద్ వచ్చాను. ఎయిర్‌ఫోర్ట్ నుంచి మీ ఇంటికి వస్తున్నాను. నిన్ను అర్జెంట్ గా కలవాలి
మను: రణవీర్ ఇంటికి రావొద్దు. అసలే ఇక్కడ పరిస్థితి బాగాలేదు.
రణవీర్: చూడు మనోహరి అంజలి విషయంలో నాకు నీ హెల్ప్ కావాలి.
మను: అంజు విషయంలో నీకు ఒకసార హెల్ప్ చేశాను. ఇక నేను చేయను.. నువ్వు ఇక్కడకు రావొద్దు నేను తర్వాత కలుస్తాను.
రణవీర్: అయితే నేను ఇప్పుడే అమరేంద్రను కలిసి నిజం చెప్తాను
మను: అయితే ఇప్పుడు నేనేం చేయాలి
రణవీర్: నేను అంజలిని చంపాలనుకుంటున్నాను అందుకు నువ్వు హెల్ప్ చేయాలి.
మను: ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..? ఇప్పుడే చిత్ర, వినోద్‌ల పెళ్లి అయింది. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు.
అంటూ మను మాట్లాడుతుండగానే రణవీర్ కాల్ కట్ చేస్తాడు. మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.
చిత్ర: ఏంటి మను నీ మాజీ మొగుడి నుంచి పిలుపు వచ్చిందా..? నువ్వు వెళ్లి అక్కడ లెక్క సెటిల్ చేసుకుని రా ఇక్కడ నేను అందరి లెక్క సెట్ చేస్తాను
అని చెప్పగానే మనోహరి సరే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రణవీర్ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత అంజు పేకలతో బిల్డింగ్ కటుడుతుంది. మనోహరి చూసి దగ్గరకు వెళ్లి వాటిని కూల్చేసి అంజు డిస్సపాయింట్ చేస్తుంది. ఇంతలో అమర్ వాళ్లు అందరూ వచ్చి మళ్లీ పేకలతో బిల్డింగ్ కడతారు. మనోహరిని పిలిచి అంజు వార్నింగ్ ఇస్తుంది. నా ఫ్యామిలీ నా వెనక ఉండగా నేను ఎప్పటికీ ఓడిపోను అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















