Nindu Noorella Saavasam Serial Today July 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: నగలు ఇచ్చేసిన భాగీ – సారీ చెప్పిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: నగలు ఇవ్వమన్నందుకు సారీ అంటూ అమర్ ఎమోషనల్ అవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని పట్టుకోవడానికి అమర్ ప్లాన్ సగం సక్సెస్ అవుతుంది. ఫోన్ ఆన్ చేసిన వెంటనే మళ్లీ మనోహరి స్విచ్చాప్ చేయడంతో కరెక్ట్ లొకేషన్ ట్రేస్ చేయలేకపోతారు. దీంతో రాథోడ్ మన వాళ్లను తీసుకొచ్చి వెతికిద్దాం అంటాడు. అవసరం లేదని మళ్లీ ఫోన్ ఆన్ చేయగానే ట్రేస్ చేయోచ్చని అమర్ చెప్తాడు. మరోవైపు చిత్రను మను తిడుతుంది.
మను: ఇది ఇల్లు అనుకున్నావా..? చేపల మార్కెట్ అనుకున్నావా..? అలా అరుస్తున్నావు..
చిత్ర: ఏంటి మను నా విజయాన్ని నీతో పంచుకుందామని వస్తే ఎందుకు అలా మాట్లాడుతున్నావు
మను: అబ్బో పంచుకునేంతగా ఏం సాధించావు
చిత్ర: అప్పుడే మర్చిపోయావా..? భాగీ ఇప్పుడు నాకు అరుంధతి నగలు ఇస్తుంది కదా..?
మను: ఒసేయ్ తింగరి దానా..? అది నీకు పర్మినెంట్‌గా ఇవ్వడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటుంది. మళ్లీ వాటిని తీసుకుని కప్‌బోర్డులో పెట్టేస్తుంది దానికి ఎందుకు అంత సంబరపడుతున్నావు
చిత్ర: భాగీ తీసుకోవడానికైనా నేను ఇవ్వడానికైనా నగలు ఉండాలి కదా మను
మను: ఏంటి ఏం మాట్లాడుతున్నావు నగలు ఉండవా..? మరి ఏమైపోతాయి
చిత్ర: నగల దొంగతనం విషయం మనుకు చెబితే వాటా అడుగుతుంది. ( మనసులో అనుకుని) భాగీ అడక్కముందే నేనే వెళ్లి కప్‌బోర్డులో పెట్టేస్తాను అందుకే అలా అన్నాను.
అంటూ చిత్ర.. మనోహరిని డైవర్ట్ చేయాలనుకుంటుంది. అప్పుడే భాగీ హాల్లోకి నగలు తీసుకొచ్చి చిత్రను పిలుస్తుంది. అంతా ఆరు, గుప్త కిటికీలోంచి చూస్తుంటారు.
ఆరు: పాపం గుప్త గారు భాగీ… వీళ్లందరూ తనతో ఆడేసుకుంటున్నారు. నాకు కానీ శక్తులు రావాలి వీళ్ల పని పట్టేదాన్ని
గుప్త: అటుల చేసేదవనే నీ శక్తులు హరించుకుపోయాయి
చిత్ర: వడ్డాణం ఉందా..? చోకర్ లాంగ్ చైన్ బుట్టకమ్మలు అన్ని ఉన్నాయి కదా..? ఏమైనా మిస్ చేశావా..?
భాగీ: లేదు ఏం మిస్ చేయలేదు
చిత్ర: థాంక్స్ నగలు ఇచ్చేస్తున్నందుకు
భాగీ: హలో ఇస్తున్నందుకు అని చెప్పాలి. ఎందుకంటే రిసెప్షన్ అవ్వగానే తిరిగి తీసుకుంటా కాబట్టి.. చైన్‌లో లింక్ మిస్ అయింది. నెక్లెస్ కింద పడిపోయింది అని కథలు చెప్పాలని చూస్తే నువ్వు నాలో ఇంకో భాగీని చూస్తావు. అది నీకు అసలు మంచిది కాదు. కావాలంటే మనును అడుగు చెప్తుంది
మను: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు
భాగీ: ఆ ఏంటి..? ఇవి ఆరు అక్క నగలు ఆయన జ్ఞాపకాలు వీటికి ఏమైనా జరిగితే ఇద్దరిని వదలను.. నా గురించి చిత్రకు తెలియకపోవచ్చు మను కొంచెం నువ్వు చెప్పు నాతో ఆడినట్టు ఆరు అక్క నగలతో ఆడితే రప్పాడిస్తానని
అని భాగీ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. భాగీ కిచెన్‌లో వంట చేస్తుంటే.. అమర్ వెళ్తాడు.
అమర్: భాగీ..
భాగీ: ఏంటండి.. ఏమైందండి ఎప్పుడూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడని మీరు ఇవాళేంటి ఏకంగా కిచెన్ లోపలికే వచ్చేశారు.
అమర్: అది భాగీ…
భాగీ: ఏంటో చెప్పండి..
అమర్: నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా నగలు ఇవ్వమన్నందుకు సారీ భాగీ.
భాగీ: ఏవండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు. నాకు కావాల్సింది నగలు, డబ్బు కాదండి నా కష్టసుఖాల్లో మీరు నాకు తోడుగా ఉండటం.. నా బాధలో ఓదార్పు, నా కష్టంలో తోడు. రోజులో మీతో ఓ పది నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకునే సమయం అంతే చాలండి.. మా ఆడవాళ్లకు ఇవేనండి ఆస్థులు
అంటూ భాగీ చెప్తుండగానే అమర్ ఎమోషనల్‌గా ఫీలవుతూ భాగీని హగ్ చేసుకుంటాడు. భాగీ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















