Nindu Noorella Saavasam Serial Today July 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అర్థరాత్రి ఆరును గుర్తు చేసుకున్న అమర్ - బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కోసం పట్టుబట్టిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: సడెన్‌గా ఆరును గుర్తు చేసుకుని ఫోటో చూస్తూ అమర్ ఎమోషనల్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని ప్రశ్నిస్తున్న అమర్‌కు మనోహరి సరిగ్గా సమాధానం చెప్పదు. దీంతో మరింత అనుమానంగా లోతుగా ప్రశ్నిస్తాడు అమర్.
అమర్: కోల్‌కతా ఎందుకు వెళ్లావు…? రెండేళ్లు ఎక్కడున్నావు..? ఏం చేశావు.. ఆశ్రమంలో ఉంటానని సరస్వతి గారికి చెప్పి వెళ్లావు. కానీ ఆశ్రమంలో లేవు మరి ఎక్కడున్నావు..? ఆ రెండేళ్ల గురించి ఆరు ఎప్పుడు అడిగినా ఎందుకు చెప్పలేదు..? పైగా మాట దాటేసే దానివి ఎందుకు..?
మనోహరి: మాట దాటేయడం ఏం లేదు అమర్ అంటే చెప్పడానికి ఏమీ లేదని..
అమర్: నువ్వు గడిచిన టూ ఇయర్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదా..? ఎక్కడున్నావు.. ఏం చేశావు.. ఎవరినైనా ఇష్టపడ్డావా..? పెళ్లి చేసుకున్నావా..? ఇలా ఏదైన ఒకటి ఉంటుంది కదా..? అంటే ఆరు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఎందుకు లాస్ట్ వరకు ఆరుకు చెప్పలేదు.. ఏంటి మనోహరి నువ్వు మాట్లాడితే నేను విందామనుకుంటే అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడలేదు
మనోహరి: అంటే నిజంగా చెప్పడానికి ఏమీ లేదు అమర్. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. అందుకే అక్కడ ఉండలేక తిరిగి వచ్చేశాను
అమర్: చిన్న ఉద్యోగమా..? నేనేదో బాధ్యత గల ఉద్యోగమేమో అందుకే అక్కడ రెండేళ్లు ఉన్నావేమో అనుకున్నాను. సరే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నావు.. బయలుదేరు మనోహరి.. ఇక నువ్వు వెళ్లొచ్చు
మనోహరి: సరే అమర్
మనోహరి వెళ్లిపోతుంది. వెంటనే రాథోడ్, భాగీకి ఫోన్ చేస్తాడు.
భాగీ: హలో రాథోడ్ మను దొరికిందా..? అసలు ఆయనకు మను గురించి ఏ విషయం తెలిసింది..?
రాథోడ్: తెలియదు మిస్సమ్మ
భాగీ: తెలియకపోవడం ఏంటి రాథోడ్.. మను ఇంకా బయటకు రాలేదా..?
రాథోడ్: వచ్చారు మిస్సమ్మ కానీ ఉలుకు పలుకు లేకుండా వెళ్లిపోయారు
భాగీ: వెళ్లిపోయారా…?
రాథోడ్: అవును మిస్సమ్మ కానీ వెళ్లేటప్పుడు ఆవిడను చూస్తే భయం వేసింది. మనిషి వణికిపోతుంది. కళ్లల్లో భయం.. అడుగుల్లో తడబాటు.. సార్ ఏం అడిగారో తెలియదు కానీ ఆ విషయం మాత్రం చాలా భయపెట్టినట్టు ఉంది మిస్సమ్మ
భాగీ: రణవీర్‌కు సాయం చేస్తుంది మనునే అనే అనుమానం ఆయనకు వచ్చి ఉంటుంది అంటావా రాథోడ్. ఒకవేల వచ్చి ఉంటే ఆయన మనును అంత ఈజీగా వదలరు కదా
రాథోడ్: తెలిసి కూడా ఈ కేసును వదిలేశారు అంటే మా సారు దగ్గర ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది మిస్సమ్మ
భాగీ: సరే రాథోడ్ నీకు ఏదైనా విషయం తెలియగానే.. నాకు ఫోన్ చేయ్
అని భాగీ చెప్పగానే.. సరే మిస్సమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాథోడ్. తర్వాత ఇంటికి వచ్చిన అమర్‌కు అనాథశరణాలయం నుంచి వచ్చిన వ్యక్తి గురించి చెప్తుంది భాగీ. ఎలాగైనా వారికి హెల్ప్ చేయాలంటుంది. సరే చూద్దాం అంటూ అమర్ వెళ్లిపోతాడు. అమర్ బెడ్‌రూంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే భాగీ వెళ్తుంది. సిటీలో బెస్ట్ కపుల్ కాంటెస్ట్ నడుస్తుందని చెప్తుంది. అందులో మనం పార్టిసిపేట్ చేసి గెలిస్తే వచ్చే ఫ్రైజ్ మనీ అనాథశరణాలయానికి ఇద్దామని చెప్తుంది. అమర్ పలకడు. దీంతో భాగీ నిద్ర పోతుంది. అమర్ ఆరు ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్ అవుతాడు.
అమర్: ఆరు నువ్వు బతికి ఉంటే ఎలా ఆలోచించే దానివో భాగీ కూడా అలాగే ఆలోచిస్తుంది. అచ్చం నీలాగే అన్ని విషయాలు చూసుకుంటుంది.
అనుకుంటూ అమర్ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















