Nindu Noorella Saavasam Serial Today July 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఉగ్రరూపం చూపించిన ఆరు – మనోహరి ఇక ఖతమే
Nindu Noorella Saavasam Today Episode: భాగీ చంపాలనుకున్న మనోహరిని ఆరు గొంతు నులిమి చంపేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: రూంలో రెడీ అయిన తర్వాత సెల్ఫీలు దిగుతుంది చిత్ర. మనోహరి వచ్చి చూసి నవ్వుకుంటుంది. లక్షలు ఖర్చు చేసి ఫోటో గ్రాఫర్‌ను పెడితే చిత్ర ఇక్కడ ఫోన్ లో ఫోటోలు దిగుతున్నావా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
చిత్ర: ఇలా నగలన్నీ పెట్టుకుని ఫోటోస్ దిగాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా మను..? అందుకే ఆశ తీరా ఫోటోలు తీసుకుంటున్నాను.
మనోహరి: చిత్ర నీకు కోట్లు వచ్చినా నీ కక్కుర్తి బుద్ది పోలేదు
చిత్ర: ఎలా పోతుంది మను పుట్టుకతో వచ్చింది. సరేరా మనిద్దరం సెల్ఫీ తీసుకుందాం
మను: అవసరం లేదు చిత్ర నువ్వు తీసుకో..!
చిత్ర: నా ఒంటి మీద నగలు చూసి చిన్నబోతున్నావా మను నీ టైం కూడా వస్తుందిలే అప్పటి వరకు వెయిట్ చేయ్
వినోద్ వచ్చి చిత్ర రమ్మని పిలుస్తాడు.
చిత్ర: సరే వినోద్ నేను ఎలా ఉన్నాను
వినోద్: చాలా బాగున్నావు చిత్ర
చిత్ర: ఇన్ని నగలు వేసుకున్నాక బాగానే ఉంటాను కదా.? అయినా ఈ నగలన్నీ ఫంక్షన్ అయిపోయాక మళ్లీ ఇచ్చేయాలి కదా అదే నా బాధ సరే పద వెళ్దాం వినోద్.
ఇద్దరూ బయటకు వెళ్లిపోతారు. మనోహరి మాత్రం చిత్రను అనుమానిస్తుంది. ఇదేదో పెద్ద ప్లాన్ వేసినట్టు ఉంది. అనుకుంటూనే మళ్ళీ అది ఏం చేస్తే నాకెందుకు నా పనేదో నేను చూసుకోవాలి. ఇవాళ ఎలాగైనా భాగీని చంపేయాలి అని మనసులో అనుకుంటుంది మనోహరి. అమర్, భాగీ పిల్లలు హ్యపీగా ఉండటం చూసిన ఆరు తాను కూడా హ్యాపీగా ఫీలవుతుంది.
ఆరు: గుప్త గారు నా పిల్లలను చూశారా ఎంత ముద్దుగా ఉన్నారో.. గుప్త గారు ఇవాళ భాగీని అంజును ఎలాగైనా కాపాడుకుంటాను
గుప్త: బాలిక మరోక రెండు దినములలో మనం మా లోకమునకు వెళ్లెదము అప్పటి వరకు నాకు శిరోభారము కలిగించకు
ఆరు: అవునా.? అయితే మీరొక పని చేయండి రణవీర్‌ను మనును మా ఆయనకు దొరికేలా చేసి వాళ్లిద్దరూ జైలుకు వెళ్లిపోయేలా చేయండి గుప్త గారు.
గుప్త: అది మేము చేయరాదని నీకు తెలియదా బాలిక.
అంటూ గుప్త చెప్పగానే.. నేను కూడా మీకు తలనొప్పి రాకుండా చేయలేను గుప్త గారు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రిసెప్షన్‌లో ఆలోచిస్తూ నిలబడ్డ మనోహరి, భాగీని ఎలా చంపాలా అని ఆలోచిస్తుంది. ఆరు చూసి కోపంగా మనును తిడుతుంది.
ఆరు: చూశారా గుప్త గారు ఆ మనోహరి రణవీర్ కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. రానివ్వండి ఇవాళ వాళ్ల కథ ముగిసిపోతుందని నాకు అర్థం అయింది.
శివరాం: అమ్మా మనోహరి వచ్చిన వాళ్లకు ఏం కావాలో చూడమ్మా..!
అని చెప్పగానే మనోహరి సరే అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో రణవీర్ వస్తాడు. అమర్‌ను విష్ చేస్తాడు.
అమర్: పిలవగానే వస్తావని అనుకోలేదు
రణవీర్: రాక నాకు తప్పలేదు అమర్. ఇక్కడకు రావడం నాకు చాలా ఇంపార్టెంట్ అని మీకు కూడా తెలుసు కదా
అమర్: నువ్వు కూడా ఇలా నా కళ్ల ముందు ఉండటం చాలా ఇంపార్టెంట్ అని నీకు కూడా తెలుసు కదా
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రణవీర్‌ను గమనించిన మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. అమర్ ఫోకస్ రణవీర్ మీద ఉంటే తాను భాగీని ఈజీగా చంపొచ్చని అనుకుంటుంది. ఇంతలో రణవీర్ బయట ఏర్పాటు చేసిన మనుషులు అమర్ ఇంట్లోకి వచ్చే కరెంట్ వైర్ కట్ చేస్తారు. వెంటనే భాగీ క్యాండిల్ కోసం వెళ్లగా వెనకే కత్తితో వెళ్లిన మనోహరి, భాగీని పొడవబోతుంటే.. ఆరు వచ్చి మనోహరి గొంతు పట్టుకుని పైకి లేపేస్తుంది. దీంతో మనోహరి ఏడుస్తూ తనను వదలమని ఆరును బతిమాలుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















