Nindu Noorella Saavasam Serial Today January 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మళ్లీ భూలోకం వెళ్లనున్న ఆరు – రణవీర్‌ను అనుమానించిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: హాస్పిటల్ లో ఉన్న రణవీర్ మాల్ లో ఉన్నామని మిస్సమ్మకు ఫోన్ లో చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భూలోకం వెళ్తానని గోల చేస్తున్న ఆరును పక్కకు తీసుకెళ్లమని గుప్తుకు చెప్తాడు యముడు. గుప్త ఆరును పక్కకు తీసుకెళ్లగానే.. యముడు కోపంగా నువ్వు చేసే తప్పిదాల వల్ల మానవులతో ఎప్పుడూ చిక్కు వచ్చి పడుతుంది చిత్రగుప్త అంటూ కోప్పడతాడు. దీంతో చిత్రగుప్తుడు ఆ బాలిక నాలుగు పాపాలు చేసిందని చిట్టాలో రాస్తాను అంటాడు. దీంతో యముడు మరింత కోపంగా అప్పుడు మనం ఇద్దరం ఇక్కడ నరకంలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటాడు.
చిత్రగుప్త: మరి ఇప్పుడేం చేయాలి ప్రభు..
యముడు: ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన చిత్రి విచిత్రగుప్తుడినే అడుగుదాం. అతన్ని ఇక్కడకు పిలవండి.
గుప్త: ఆ బాలికను రెచ్చగొట్టింది నేనే అని పసిగట్టారా ఏంటి ప్రభువుల వారు. ( అని మనసులో అనుకుంటాడు)
చిత్రగుప్తు: విచిత్రగుప్త ఆ బాలికకు మీరే నిజం చెప్పారా..?
గుప్త: నేను ఆ పని ఎందుకు చేస్తాను.. ప్రభు..
యముడు: అయితే ఇప్పుడు ఆ బాలిక మా మాట విన వలెనన్నా ఏమీ చేయవలెను.
గుప్త: ఆ బాలిక తన పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉన్నదని గమనించింది. ఆ పిల్ల పిచ్చుకను కాపాడితే సరిపోతుంది ప్రభు.
యముడు: అయితే ఇప్పుడే నేను భూలోకం వెళ్లాలా..?
గుప్త: అవసరం లేదు ప్రభు ఆ బాలికను భూలోకం పంపినచో సరిపోతుంది.
చిత్రగుప్తు: విచిత్ర గుప్త నీకు మతి కానీ భ్రమించిందా..? ఆ బాలికను భూలోకం నుంచి తీసుకుని వచ్చుటకు ఎంత కష్టపడ్డామో తెలిసి మళ్లీ భూలోకం పంపమని చెప్తున్నావా..?
గుప్త: ప్రభువుల వారు అడిగితిరి నేను చెప్పితిని
యముడు: సరే విచిత్ర నేను ఆలోచించుకుని చెప్తాను నువ్వు వెళ్లు
అని చెప్పగానే గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆరు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ప్రభువుల వారు ఆలోచిస్తా అన్నారు. అంటే నిన్ను భూలోకం పంపిస్తారనే అర్థం అంటాడు. పరధ్యానంలో కూర్చున్న భాగీ.. రణవీర్, మనోహరి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో శివరాం వచ్చి మచినీళ్లు అడిగినా పలకదు. దగ్గరకు వెళ్లి పిలవగానే ఉలిక్కిపడి చూస్తుంది భాగీ.
శివరాం: ఏంటి మిస్సమ్మ అలా ఉన్నావు
భాగీ: మనోహరి, రణవీర్ గురించి మామయ్యా.. నాకెందుకో వాళ్లిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే అంజును పంపాలంటే భయమేసింది.
నిర్మల: వాళ్లిద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తారు మిస్సమ్మ వాళ్లిద్దరూ ముందు నుంచి తెలిసివాళ్లు కాదు కదా..? అయినా నీకెందుకు అలా అనిపించింది.
భాగీ: మనోహరి, రణవీర్ సైగ చేసుకోవడం.. ఇద్దరూ ఒకర్ని ఒకరు ముందే కలిశామని చెప్పడం కంగారు పడటం లాంటివి చూస్తుంటే అనుమానం వచ్చింది అత్తయ్యా
అని భాగీ చెప్పగానే.. నిర్మల, శివరాం ఆలోచనలో పడిపోతారు. అంజును హాస్పిటల్ కు తీసుకెళ్తాడు రణవీర్.
అంజు: ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంకుల్..
రణవీర్: ఇంతకు ముందు ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు చిన్నగా దగ్గావు కదమ్మా అందుకు..
అంజు: అయ్యో అంకుల్ ఐస్ క్రీమ్ తింటే దగ్గు రాకుండా ఉంటుందా..?
రణవీర్: అది కాదు అంజు నీకు జలుబు కానీ జ్వరం కానీ వస్తే మళ్లీ నన్ను తిడతారు. ఐస్‌క్రీమ్ తిన్నందుకు నిన్ను తిడతారు
అంజు: అయితే ఓకే అంకుల్..
అంజును రిసెప్షన్ లో కూర్చోబెట్టి రణవీర్ డాక్టర్ దగ్గరకు వెళ్లి అంజుకు టెస్టులు చేయాలని చెప్తాడు. డాక్టర్ సరే అంటాడు. ఇంతలో భాగీ ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని అడుగుతుంది. మాల్ లో ఉన్నామని రణవీర్ చెప్పగానే వెనక ఒక వ్యక్తి ఫోన్‌లో మట్లాడుతూ హాస్పిటల్ లో ఉన్నామని చెప్తాడు. భాగీ అది విని షాక్ అవుతుంది. రణవీర్ ఫోన్ కట్ చేస్తాడు. భాగీ అనుమానంతో ఆ హాస్పిటల్‌కు వెళ్తానని నిర్మల, శివరాంలకు చెప్పి బయలుదేరుతుంది. ఇదంతా యమలోకం నుంచి ఆరు చూస్తుంది. అంజు గురించి బాధపడుతుంది. దీంతో నువ్వు మళ్లీ భూలోకం వెళ్లే టైం దగ్గర పడిందని గుప్త చెప్తాడు. ఆరు షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

