Nindu Noorella Saavasam Serial Today January 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీ కోసం ప్లాన్ చేసిన మనోహరి – ట్రాప్‌లో పడిపోయిన అమ్ము
Nindu Noorella Saavasam serial Today Episode January 23rd: అమ్మును చంపడం లేదా ప్రమాదం జరిగేలా చేయాలనుకుంటుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలు అందరూ రూంలో హోం వర్క్ చేసుకుంటుంటే కింద యాదమ్మ భోజనం చేద్దురు రండి అని పిలుస్తుంది. పిల్లలు అందరూ కిందకు వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ.. కర్రీస్ ఏం చేశావు అని యాదమ్మను అడగ్గానే.. మీరే చూడండి అని యాదమ్మ చెప్తుంది. కర్రీస్ చూస్తారు పిల్లలు.
అంజు: ఏంటి యాదమ్మ ఈ కూరల్లో మాకు ఇష్టమైనవి ఒక్కటి కూడా లేవు
ఆనంద్: మాకు ఇష్టమైనవి చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి
యాదమ్మ: మనోహరి గారు చెప్పిన మెనూనే చేశాను
ఆకాష్: మాకు ఇష్టం లేనివి చేస్తే మేము తినాలా..?
యాదమ్మ: ఆ విషయం మనోహరి గారినే అడగండి
అప్పుడే మనోహరి వస్తుంది.
మను: ఏంటి యాదమ్మ ఏమైంది..?
అమ్ము: ఈ యాదమ్మ చేసే వంటలు మాకు నచ్చడం లేదు ఆంటీ
అంజు: ఒక్క కర్రీ కూడా టేస్టీగా ఉండదు ఆంటీ.. ఎలా తినాలి ఆంటీ
మను: అయితే నన్ను తినవే.. తిను
అంజు: మీరు కూడా టేస్టీగా ఉండరు అనుకోండి కారం కారంగా ఎప్పుడు చూసినా ముఖం అలా పెట్టుకుని మూడీగా ఉంటారు.
ఆనంద్: ఈ యాదమ్మకు వంటైనా నేర్పించండి ఆంటీ లేదంటే ఈవిడను మార్చి ఇంకో కొత్త కుక్ ను తీసుకురండి
మను: యాదమ్మను మార్చడం కుదరదు..
ఆకాష్: తను చేసే టేస్ట్ లేని వంటలు మేము తినము
మను: ఈ విషయం మీ డాడ్‌తో చెప్పమంటారా..?
అమ్ము: చెప్పండి మేము డాడ్ చెప్పే డైటే ఫాలో అవుతాం ఇలా రుచి లేని వంటలు తినము
అంజు: ఫుడ్ టేస్టీగా లేకపోతే మా డాడ్ మాత్రం ఊరుకుంటారా ఏంటి..?
ఆనంద్: మీరే కాదు ఫుడ్ బాగాలేదని మేమే మా డాడీతో చెప్తాము
ఆకాష్: అప్పుడు డాడీయే ఈ యాదమ్మను పనిలోంచి తీసేసి వేరే కుక్ ను పెడతాడు
మను: ( మనసులో అమర్ అంత పని చేసినా చేస్తాడు.) రేపటి నుంచి యాదమ్మతో దగ్గరుండి నేనే వంట చేయిస్తాను.. ఈరోజు ఫుడ్‌ను ఆర్డర్ చేసి తెప్పిస్తాను సరేనా
అంజు: ఏమీ అక్కర్లేదు మేము బయటి ఫుడ్ అసలు తినము
మను: తినకపోతే ఆకలితో మాడిపోతారు
అంజు: మాడిపోకుండా మా ఫుడ్ ఎలా తినాలో మాకు తెలుసు..? పదండి వెళ్దాం
అని ముగ్గురుని తీసుకుని పైకి వెళ్తుంది అంజు.
మను: ( మనసులో ఈ పొట్టి దానికి ఎంత పొగరు మాటకు మాట సమాధానం చెప్తుంది.) నువ్వు కూడా ఏంటి చంభా.. వంటలు కాస్త రుచిగా చేయోచ్చు కదా..?
యాదమ్మ: మనోహరి నేను మంత్రగత్తెను.. వంటగత్తెను కాదు
మను: నువ్వు వంట సరిగ్గా చేయకపోతే అమర్ తో చెప్పి పిల్లలు నిన్ను ఇక్కడి నుంచి పంపిచేలా ఉన్నారు.. కాస్త చూసుకో
అంటూ హెచ్చరించి వెళ్లిపోతుంది మనోహరి. తర్వాత అమ్మును ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేసిన మనోహరి. తన ప్లాన్ గురించి చంభాకు చెప్తుంది. మనోహరి ప్లాన్ ప్రకారం అమ్మును మేడ మీదకు పంపిస్తుంది యాదమ్మ. మేడ మీదకు వెళ్లిన అమ్మును చంపాలని మనోహరి మేడ మీదకు వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















