Nindu Noorella Saavasam Serial Today January 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: స్కూల్ లో బుజ్జమ్మను కలిసిన అమ్ము, అంజు – విషయం తెలిసి షాక్ అయిన మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode January 10th: అంజు, అమ్ము, ఆకాష్, ఆనంద్ నలుగురు కలిసి వెళ్లి స్కూల్ లో బుజ్జమ్మను కలవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: విక్రమ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అమర్ ఆలోచిస్తుంటాడు. రాథోడ్ బయట వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే ఒక మిలటరీ ఆఫీసర్ వచ్చి విక్రమ్ సార్ ఇచ్చారు.. అరకు నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల లిస్టు అట ఇది అమరేంద్ర సార్‌కు ఇవ్వమన్నాడని చెప్పగానే రాథోడ్ ఆ కవర్ తీసుకుంటాడు.
రాథోడ్: ఓహో సార్ నన్ను వద్దని చెప్పి తనే స్వయంగా మిస్సమ్మ గురించి వెతుకుతున్నాడా..?
అనుకుని లోపలికి వెళ్లి కవర్ అమర్‌కు ఇస్తాడు.
రాథోడ్: ఏంటి సార్ మిస్సమ్మ గురించి వెతకొద్దని నాకు చెప్పి మీరే స్వయంగా వెతుకుతున్నారా..?
అమర్: లేదు విక్రమ్ చెప్పింది కరెక్టేనా కాదా అని చెక్ చేస్తున్నాను
అందులో మిస్సమ్మ పేరు ఉండదు.. కోపంగా లిస్ట్ రాథోడ్‌కు ఇస్తాడు.
రాథోడ్: సార్ లిస్ట్‌లో మిస్సమ్మ, బుజ్జమ్మ పేర్లు లేవేంటి..? అంటే వాళ్లు హైదరాబాద్ రాలేదా..? లేదా విక్రమ్ సార్ పొరబడ్డారా..? లేదా వేరే ఎవరినైనా చూసి మిస్సమ్మ అనుకున్నారా..? అంతే అయ్యుంటుంది సార్ లేకపోతే మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్ రావడం ఏంటి..? ఇంటికి రాకపోవడం ఏంటి..? విక్రమ్ సారు పొరబడ్డారు.. మిస్సమ్మ వాళ్లు అయితే ఇక్కడకు రాలేదు..
అమర్: తను వస్తే ఏంటి..? రాకపోతే ఏంటి..? అదంత మనకు అనవసరం.
రాథోడ్: సార్ మీరు పైకి అలా అంటున్నారు కానీ.. మనసులో ఎంతలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం అవుతుంది సార్. మీకు మిస్సమ్మపై ఉన్నది కోపం కాదు సార్ బాధ.. దయచేసి ఆ బాధను కోపంగా కన్వర్ట్ చేయకండి సార్ మిస్సమ్మ బుజ్జమ్మను తీసుకుని తప్పకుండా వస్తుంది సార్
అమర్: నాకు ఏ బాధ లేదు రాథోడ్.. ఎవరు వచ్చినా రాకపోయినా నాకే ఇబ్బంది లేదు.. యు కెన్ గో
అనగానే రాథోడ్ బయటకు వెళ్తాడు. మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్ రాలేదు సార్ ఒకవేళ వచ్చి ఉంటే.. వాళ్లను ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తాను అని మనసులో అనుకుంటాడు రాథోడ్. మరోవైపు నిజం తెలుసుకున్న మనోహరి, చంభాతో కలిసి బుజ్జమ్మను కనిపెట్టడానికి స్కూల్ దగ్గరకు వెళ్లి గేటు దగ్గర వెయిట్ చేస్తుంటారు. ఇంతలో అక్కడకు రాజు వస్తాడు. మనోహరిని చూసి షాక్ అవుతాడు.
మనోహరి: అంత మంది పిల్లలో బుజ్జమ్మను ఎలా కనిపెట్టాలి
చంభా: నాకు అదే అర్థం కావడం లేదు మేడం
రాజు: ఈ మనోహరి ఇక్కడికి ఎందుకు వచ్చింది. ఎవరి కోసం వచ్చింది.. అంజు పాప కోసం వచ్చిందా..? లేక ఆరు పాప కోసం వచ్చిందా..?
ఇంతలో పిల్లుల బయటకు వస్తుంటారు. బుజ్జమ్మ వచ్చి మనోహరిని తగలగానే మనోహరికి షాక్ తగులుతుంది. వెంటనే బుజ్జమ్మ కోసం వెళుతుంది మనోహరి. రాజు, బుజ్జమ్మను తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత అమర్, పిల్లలు, మనోహరి, చంభా, రాథోడ్ అందరూ స్కూల్ దగ్గరకు వస్తారు. బుజ్జమ్మను చూసిన అంజు అదిగో బుజ్జమ్మ అక్కడ ఉంది అని చెప్తుంది. అందరూ కారు దిగి బుజ్జమ్మ దగ్గరకు వెళ్తుంటారు. అక్కడే ఉన్న రాజు వాళ్లను చూసి భాగీని ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్లమని చెప్తాడు. సరే అంటూ భాగీ ప్రిన్సిపాల్ రూం వైపు వెళ్తుంది. ఇంతలో పిల్లుల బుజ్జమ్మ దగ్గరకు వచ్చి తమను తాము పరిచయం చేసుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















